ఉపోద్ఘాతము:
పేరు: సొలోమోను రాజు వివేకానికి ప్రతీకగా భావించబడుటవలన, ఈ గ్రంథమును ఆ రాజు పేరుతోనే పిలువబడుచున్నది. (1:1,7:5) కాలము: క్రీ.పూ 2వ – 1వ శతాబ్దము.
రచయిత: ఐగుప్తులోని అలెగ్జాండ్రియా యూదుకవి ఈ గ్రంథములోని విషయములను సమీకరించి వుాండని కొందరు పండితుల అభిప్రాయము. దీనిని గ్రీకు భాషలో వ్రాసిరి. ఈ గ్రంథము హీబ్రూ బైబులులో ఉండదు.సెప్తువజింత్ బైబులులో మాత్రమే కనిపించును.
చారిత్రక నేపథ్యము: ప్రవాసకాలము అనంతరము యూదులు పాలస్తీనాకు తిరిగివచ్చిరి. కాని వారిలో కొందరు ఆ వలసదేశములోనే స్థిరపడిపోయిరి. వారు అటు హీబ్రూ సంస్కృతికిని, ఇటు గ్రీకు సంస్కృతికిని రెండికి అలవాటుపడుటచే హీబ్రూ సంస్కృతి విలక్షణత మరుగుపడే పరిస్థితి ఉద్భవించినది. అి్ట సమయములో ఆ ప్రాంతపు యూదులలో యావే దేవునిపై, ధర్మశాస్త్రముపై విశ్వాసమును దృఢపరచుటకు ఈ గ్రంథమును వ్రాసినారు. నరునికి పరలోక జీవితమును, అమరత్వమును కలదని మొట్టమొదిసారిగా స్పష్టముగా చెప్పిన పూర్వవేద గ్రంథములలో ఇదియునొకి.
ముఖ్య అంశములు: దైవజ్ఞానము, వివేకము, నీతిమంతమైన జీవితములో నడిపించడము దీని ముఖ్యాంశము (7:1-14; 8:17-9:18; 1 రాజు 3:6-9). విగ్రహారాధనలు, లోకముపోకడలు దేవునినుండి మానవులను దూరము చేస్తాయి. ఇటువిం వారికి భవిష్యత్తులో దేవుని న్యాయము, తీర్పు అనివార్యము అని తెలుపును. (4:20); దానికి భిన్నముగా నీతిమయమైన జీవితము శాశ్వతమైనది (1:15). దేవుని జ్ఞానము, వివేకము చారిత్రకమైనవి (10-12 అధ్యాయములు). అవి ఆదాము నుండి అభివ్యక్తమవుతున్న సత్యాలు.
క్రీస్తుకు అన్వయము: నరుని అమరత్వము ప్రప్రధమముగా స్పష్టముచేసిన గ్రంథములోని అంశము క్రీస్తు ప్రసాదించు నిత్య జీవమునకు ముంగుర్తుగానున్నది.