మంచివారిగతి, చెడ్డవారిగతి
3 1. సజ్జనులను దేవుడు కాచి కాపాడును.
వారేనాడును వ్యధలకు గురికారు.
2. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి.
తమ మరణానంతరము అపజయము
పొందినవారివలెను
3. నాశనమునకు గురి అయిన వారివలెను చూప్టిరి.
కాని వారు శాంతిని అనుభవించుచున్నారు.
4. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారివలె
చూప్టినను అమరత్వము పొందెదమను
నమ్మకము వారికి కలదు.
5. వారి బాధ కొద్దిపాిది,
బహుమతి మాత్రము చాలపెద్దది.
ప్రభువు వారిని పరీక్షించిచూచి,
వారు తన సన్నిధిలో ఉండుటకు
యోగ్యులని తలంచెను.
6. బంగారమును పుటము వేసినట్లుగా
దేవుడు వారిని పరీక్షించెను.
దహనబలి నంగీకరించినట్లుగా
వారి ప్రాణములనంగీకరించెను.
7. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము
ఈయవచ్చినపుడు
వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వలవలె మండుచూ
దుష్టులను కాల్చివేయుదురు.
8. వారు నానా జాతులకు తీర్పు విధించి
వారిని పరిపాలింతురు.
ప్రభువే నిరతము వారికి పాలకుడగును.
9. ప్రభువును నమ్మినవారికి
ఆయన సత్యము తెలియును.
ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు.
ఆయన తానెన్నుకొన్నవారికి కరుణను,
వరప్రసాదమును దయచేయును.
10. కాని దుష్టుల దురాలోచనలకుగాను
వారికి శిక్షపడును.
వారు ప్రభువును నిరాకరించి
న్యాయమును అనాదరము చేసిరి.
11. జ్ఞానమును, ఉపదేశమును నిరాకరించువారు
దౌర్భాగ్యులు, వారి ఆశలు వమ్మగును,
కృషి వ్యర్థమగును, వ్యాపారములు నిష్ఫలమగును.
12. వారి భార్యలు బాధ్యతారహితులుగా
ప్రవర్తింతురు,
వారి పుత్రులు దుర్మార్గులగుదురు,
వారి వంశజులు శాపగ్రస్తులగుదురు.
దుర్మార్గులైన బిడ్డలను కనుటకంటె
వంధ్యత్వము మేలు
13. వ్యభిచారమునకు పాల్పడక,
నిర్మల జీవితము గడపిన స్త్రీ
గొడ్రాలయినను ధన్యురాలే.
న్యాయనిర్ణయ దినమున
ఆమె సంతానమునెల్లరును చూడవచ్చును.
14. ప్రభువును గూర్చి దుష్టాలోచనములు
చేయనివాడును,
ధర్మశాస్త్రమును మీరని వాడునగు
నపుంసకుడును ధన్యుడు.
అతని భక్తికిగాను
ప్రభువతనికి విశిష్టవరమునొసగును
అతడు ప్రభువు దేవాలయమున ప్రవేశమునొంది
తగు స్థానమును బడయును.
15. కష్టించి పనిచేసినచో సత్ఫలితములు
పడయవచ్చును.
విజ్ఞానవృక్షమూలము ఎండిపోక పిలకలువేయును.
16. కాని వ్యభిచారమున ప్టుిన బిడ్డలు
పెంపుచెందరు.
పాపమున ప్టుిన వారు నశించి తీరుదురు.
17. అి్ట వారు దీర్ఘకాలము జీవించినను
ఫలితముండదు
కడన ముసలిప్రాయమున వారినెవరును
గౌరవింపరు
18. ఒకవేళ వారు లేత వయసుననే చనిపోయినచో
న్యాయనిర్ణయదినమున
ఎి్ట ఆనందమును అనుభవింపజాలరు.
19. దుర్మార్గులకు పట్టు దుర్గతి అి్టది.