సొలోమోను ఇతర నరులవింవాడే

7 1.         నరులందరివలె నేనును మర్త్యుడనే.

                              నేనును మ్టినుండి ప్టుిన

                              మొది మనిషి నుండి జన్మించినవాడనే.

                              నేను నా తల్లి గర్భములో

                              రక్తమాంసములతో తయారైతిని.

2.           స్త్రీతో సుఖము ననుభవించిన

               పురుషుని వీర్యమునుండి నేనుద్భవించితిని.

               పది నెలల పాటు నా తల్లి గర్భమునందలి

               నెత్తురులో నా దేహము రూపముతాల్చెను.

3. ప్టుినప్పుడు అందరు పీల్చుగాలినే నేనునూ పీల్చితిని.

               అందరిని భరించు నేలమీదనే

               నన్ను కూడ పరుండబ్టెిరి.

               అందరివలె నేనును ఏడ్పుతోనే

               నా మొది శబ్దమును చేసితిని.

4.           నన్ను పొత్తి గుడ్డలలో చ్టుి జాగ్రత్తగా సాకిరి.

5.           ఏ రాజును ఇంతకంటే భిన్నమైన

               జీవితము జీవించియుండడు.

6.           నరులెల్లరు ఒక్క రీతిగనే ప్టుి,

               ఒక్క రీతిగనే చత్తురు.

సొలోమోనునకు జ్ఞానముపట్ల గల ప్రీతి

7.            కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు

               నాకు వివేకమొసగెను.

               నేను మనవి చేయగా

               జ్ఞానాత్మము నామీదికి దిగి వచ్చెను.            

8.           సింహాసనము కంటెను, రాజదండము కంటెను

               అధికముగా నేను జ్ఞానమును అభిలషించితిని.

               సంపదలు దానితో సరితూగజాలవని గ్రహించితిని.

9.           అమూల్య మణులేవియు

               దానికి సాిరావని తెలిసికొింని.

               జ్ఞానముతో పోల్చినచో లోకములోని

               బంగార మంతా వ్టి ఇసుకముద్ద,

               వెండి అంత వ్టి మ్టిపెళ్ళ.

10.         నేను ఆరోగ్యము కంటే, సౌందర్యము కంటే,

               జ్ఞానము నెక్కువగా కోరుకొింని.

               దాని కాంతి ఏనాడును తరిగిపోదు.

               కనుక వెలుతురు కంటే కూడ 

               దానిని అధికముగా  అభిలషించితిని.

11.           జ్ఞానము నా చెంతకు వచ్చినపుడు

               సమస్త ప్రశస్తవస్తువులను గూడ తీసికొనివచ్చెను.

               బహుసంపదలను కూడ తెచ్చెను.

12.          జ్ఞానమే కొనివచ్చెను కనుక

               నేనా వస్తువులను చూచి ఆనందించితిని.

               ఆ వస్తువులకెల్ల జ్ఞానమే ఆధారమని

               పూర్వము నాకు తెలియదు.

13.          నేను చిత్తశుద్దితో సంపాదించిన జ్ఞానమును

               గూర్చి మీకును నిశ్చింతగా తెలియజేసెదను.

               అది నాకు తెచ్చిప్టిెన లాభములను

               నేనొక్కడనే దక్కించుకోను.

14.          జ్ఞానము తరుగని నిధివింది.

               దానిని సంపాదించువారు

               దేవునికి స్నేహితులగుదురు.

               దాని ఉపదేశమును ఆలించువారిని

               ఆయన మెచ్చుకొనును.

దైవ సహాయము కొరకు ప్రార్థన

15. నేను దేవుని చిత్తప్రకారము సంభాషింతునుగాక! 

               నేను నేర్చుకొనిన సంగతులకు

               అనుగుణముగా మ్లాడెదనుగాక!

               ఈ భాగ్యమును దయచేయవలయునని

               ప్రభువును వేడుకొనుచున్నాను.

               జ్ఞానమును నడిపించువాడును,

               జ్ఞానులను చక్కదిద్దువాడును ప్రభువే.

16.          మనమును, మన పలుకులును,

               మన జ్ఞానమును, నైపుణ్యమును

               ఆయన ఆధీనమున నుండును.

17.          నరులకు ఆయా వస్తువుల జ్ఞానమును 

               దయచేసిన వాడు ఆయనే.

               ప్రపంచ నిర్మాణమును గూర్చియు,

               పంచభూతములను గూర్చియు,

18.          కాలపుారంభమును, మధ్యమమును,

               అంతమును గూర్చియు,  సూర్యగతిని గూర్చియు,

               ఋతుక్రమములను గూర్చియు,

19.          గ్రహములను, యుగములను గూర్చియు,

20.        ప్రాణులను, వన్యమృగములను గూర్చియు,

               వాయువులను గూర్చియు,

               నరుల ఆలోచనావిధానమును గూర్చియు,

               పలురకములైన మొక్కలను గూర్చియు,

               వాని మూలికలతోచేయు మందులను గూర్చియు

               నాకు తెలియ జేసినవాడు ఆయనే.

21.          నరులకు స్పష్టముగా తెలిసినవియు,

               తెలియనివిగూడ నేను నేర్చుకొింని.

               అన్నికిని అస్తిత్వమొసగిన జ్ఞానమే

               నాకును బోధచేసెను.

విజ్ఞాన స్తోత్రము

22.        విజ్ఞానము యొక్క ఆత్మము తెలివికలది,

               పవిత్రమైనది.

               ఒక్కియయ్యు బహుముఖముల చూపట్టునది

               సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది,

               పరిశుభ్రమైనది, స్వచ్ఛమైనది, బాధింపరానిది,

               మేలుచేయునది, చురుకైనది,

23.        ఎదిరింప శక్యముకానిది, ఉపకారము చేయునది,

               నరులతో స్నేహము చేయునది, స్థిరమైనది,

               నమ్మదగినది, విచారమునకు లొంగనిది,

               సర్వశక్తికలది, సర్వమును పరీక్షించునది,

               జ్ఞానాత్మకములును, పునీతములును,

               సూక్ష్మములునైన ప్రాణులన్ని లోనికి

               ప్రవేశించునది.

24.         జ్ఞానము కదలిక కంటె గూడ త్వరగా కదలును.

               అది పవిత్రమైనది గనుక

               అన్ని వస్తువులలోనికి ప్రవేశించును. 

25. అది దైవశక్తి యొక్క శ్వాసము.

               ప్రభువు మహిమ యొక్క స్వచ్ఛమైన ప్రవాహము.

               మలినమైనదేదియు దానిలోనికి ప్రవేశింపజాలదు

26.        అది శాశ్వతజ్యోతికి ప్రతిరూపము.

               దేవుని క్రియాశక్తిని

               ప్రతిబింబించు నిర్మలపుటద్దము.

               దేవుని మంచితనమునకు ప్రతిబింబము.

27.         అది ఒంటరిగా పనిచేసినను అన్నిని నిర్వహించును

               తాను మారకయే అన్నిని నూత్నీకరించును.

               అది ప్రతి తరమునను కొందరు భక్తులలోనికి

               ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగను,

               ప్రవక్తలుగను మార్చివేయును.

28.        జ్ఞానమును చేప్టినవానిని మాత్రమే

               ప్రభువు ప్రేమించును.

29.        అది సూర్యునికంటె తేజోవంతమైనది.

               నక్షత్రరాసులకంటె, కాంతిమంతమైన

               వెలుతురుకంటె గూడ మెరుగైనది.

30.        వెలుతురు చీకికి లొంగిపోవును,

               కాని చెడుమాత్రము జ్ఞానమును జయింపజాలదు.