నక్షత్రారాధన, ప్రకృతి ఆరాధన

13 1.       దేవుని తెలిసికోజాలని వారు నిక్కముగా

                              మందమతులు.

                              వారు తమ చుట్టునున్న సృష్టి వస్తువులను

                              గాంచియు సజీవుడైయున్న

                              దేవుని గుర్తింపకున్నారు.

                              ఆ శిల్పి చేసిన వస్తువులను చూచియు

                              ఆయనను ఎరుగకున్నారు.

2.           వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్రరాశి,

               ప్రవాహజలము, గగన జ్యోతులు

               ఈ లోకమును పరిపాలించు దేవతలని యెంచిరి.

3.           వారు ఆ వస్తువుల సౌందర్యమునకు ముగ్ధులై

               అవి దేవతలని తలపోసిరి.

               కాని ఆ వస్తువులను కలిగించిన ప్రభువు

               వానికంటె అధికుడనియు సౌందర్యకారకుడైన

               ప్రభువే వానిని సృజించెననియు

               వారు గ్రహించియుండవలసినది.

4.           ఆ వస్తువుల శక్తిని, అవి పనిచేయు తీరును చూచి

               ఆ జనులాశ్చర్యపడినచో,

               వానిని చేసిన దేవుడు వానికంటెను శక్తిమంతుడని

               వారు గ్రహించి యుండవలసినది.

5.           సృష్టి వస్తువుల మహత్త్వమును

               సౌందర్యమును చూచి

               సృష్టికర్త య్టెివాడో గ్రహింపవచ్చును.

6.           కాని ఆ ప్రజలు దేవుని మక్కువతో వెదకుటలోనే

               తప్పు త్రోవప్టి యుండవచ్చును.

               గనుక వారినంతగా నిందింపనవసరములేదేమో.

7.            వారు తమ చుట్టునుగల సృష్టి

               వస్తువుల మధ్య జీవించుచు,

               వానిని మాిమాికి పరిశీలించి చూచుచు,

               వాని అందమునకు భ్రమసి,

               వెలుపలి ఆకారము వలననే మోసపోయిరి.

8.           అయినను ఆ ప్రజల అవివేకమును మన్నింపరాదు

9.           వారు లోకస్వభావమును గూర్చి

               సిద్ధాంతములు చేయగలిగియు,

               లోకనాథునెన్నికిని తెలిసికొనకుండుటకు

               కారణమేమి?

విగ్రహముల కొలువు

10.         కాని నిర్జీవములైన ప్రతిమలను నమ్మువారు

               నిక్కముగా దౌర్భాగ్యులు.

               వారు నరులు చేసిన వస్తువులను

               దైవములని పిల్తురు.

               అవి వెండి  బంగారములతో అందముగా మలచిన

               మృగముల రూపములు,

               లేదా పూర్వమెవడో చెక్కిన నికృష్ట శిలలు.

11.           నిపుణుడైన వడ్రంగి అనువైన చెట్టును నరికి

               దాని బెరడునంతిని ఒలిచివేసి

               దాని మొండెము నుండి రోజువారి పనులకు

               ఉపయోగపడు పనిముట్టు నొకదానిని

               నేర్పుతో తయారుచేయును.

12. మిగిలిన ముక్కలను వంటచెరకుగా వాడుకొని

               అన్నము వండుకొని ఆరగించును.

13. కాని ఆ మిగిలిన వానిలోనే పనికిమాలిన ముక్క

               యొకి అతని కంట బడును.

               అది వరకరపోయి ముళ్ళతో నిండియుండును.

               అతడు దానిని తీసికొని తీరిక వేళలలో

               నేర్పుతో చెక్కును, నిదానముగా మనుష్యాకృతిగల

               బొమ్మగా మలచును.

14.          లేదా నీచమైన మృగముగా తయారుచేయును.

               ఆ బొమ్మకు ఎఱ్ఱరంగు పూసి,

               దాని నెఱ్ఱెలను కప్పివేయును.

15.          తరువాత గోడలో ఒక గూడు తయారుచేసి

               ఆ గూిలో ఇనుపచీలలతో దానిని

               గ్టిగా బిగగొట్టును.

16.          అది జారిపడకుండునట్లు జాగ్రత్తపడును.

               అది వ్టిబొమ్మ కనుక తనంతటతాను

               నిలువజాలదనియు,

               ఇతరులు దానిని ఆదుకోవలెననియు

               అతనికి తెలియును.

17. అయినను ఈ నిర్జీవ ప్రతిమకు ప్రార్థనచేయుటకు

               అతనికి సిగ్గులేదు.

               తన పెండ్లి, పిల్లలు, సంపదలనుగూర్చి

               అతడు దానికి మనవిచేయును.

               ఆ బొమ్మ సామర్థ్యము లేనిది.

               అయినను ఆరోగ్యముకొరకు

               అతడు దానికి మనవిచేయును.

18.          అది నిర్జీవమైనది, అయినను జీవముకొరకు

               అతడు దానికి మనవి చేయును.

               అది శక్తిలేనిది, అయినను సహాయముకొరకు

               అతడు దానికి మనవి చేయును.

               అది పాదమునైనను కదపజాలనిది,

               అయినను ప్రయాణ సాఫల్యము కొరకు

               అతడు దానికి మనవి చేయును.

19. ఆ బొమ్మ చేతులకు శక్తిలేదు,

               అయినను తనకు లాభము కలుగవలెనని,

               తాను డబ్బు చేసికోవలెనని,

               తన వృత్తి సఫలము కావలెనని

               అతడు దానికి మనవి చేయును.