షూనేము ధనవంతురాలు తిరిగివచ్చుట
8 1. షూనేమున వసించు ధనవంతురాలి బిడ్డను ఎలీషా జీవముతో లేపెనుగదా! ఒకనాడు అతడామెతో ”ప్రభువు ఈ నేలమీద ఏడేండ్ల పాటు కరువు రప్పించును. కనుక నీవు నీ కుటుంబము ఇక్కడినుండి వెడలిపోయి ఎక్కడనైన తలదాచుకొనుడు” అని చెప్పెను.
2. ప్రవక్త చెప్పినట్లే ఆమె ఫిలిస్తీయా దేశము నకు వలసపోయి అచట ఏడేండ్లు తలదాచుకొనెను.
3. ఏడేండ్లు గడచిన తరువాత ఫిలిస్తీయా దేశమునుండి ఆ ఇల్లాలు, పరివారము యిస్రాయేలు దేశమునకు తిరిగివచ్చి తన పొలమును, ఇంిని స్వాధీనము చేయింపుమని మనవి చేసికొనుటకై రాజువద్దకు వెళ్ళెను.
4. ఆమె వెళ్ళునప్పికి రాజు ఎలీషా శిష్యుడైన గేహసీతో మ్లాడుచు ప్రవక్తచేసిన అద్భుతకార్యము లను వినిపింపుమని అడుగుచుండెను.
5. అతడు ఎలీషా ఒక మృతుని జీవముతో లేపెనని చెప్పుచుండగనే ఆ ఇల్లాలుకూడ వచ్చి తన ఇంిని పొలమును తిరిగి ఇప్పింపుమని రాజును వేడుకొనెను. అప్పుడు గేహసీ ”ప్రభూ! ఎలీషా జీవముతో లేపినది ఈమె బిడ్డనే” అని తల్లిని, కుమారుని చూపించెను.
6. రాజు ”నిజమేనా” అని ఆ స్త్రీని ప్రశ్నింపగా ఆమె ”అవును” అని రాజుతో జరిగిన సంగతంతయు వివరించెను. రాజు ఒక ఉద్యోగిని పిలిపించి ”ఈమె ఆస్తినంతిని ఈమె పరముచేయుడు. అంతేకాదు. ఏడేండ్లలో ఈమె పొలమున పండిన పంటకు వెలక్టి ఆ సొమ్ముకూడ ముట్టజెప్పుడు” అని ఆజ్ఞాపించెను.
ఎలీషా – హసాయేలు
7. ఎలీషా దమస్కునకు వచ్చెను. అప్పుడు సిరియా రాజగు బెన్హెదదునకు జబ్బుగానుండెను. అతడు ఎలీషా ప్రవక్త వచ్చెనని వినెను.
8. తన ఉద్యోగియైన హసాయేలును పిలిచి ”నీవు కానుకలు తీసికొని ప్రవక్త యొద్దకు వెళ్ళుము. ప్రభువును సంప్రతించి నా వ్యాధి నయమగునో లేదో తెలియ చెప్పుమని అతనిని అడుగుము” అని ఆదేశించెను.
9. కనుక హసాయేలు దమస్కున లభించు మేలివస్తువులన్నిని సేకరించుకొని ఆ బహుమతు లను నలువది ఒంటెలమీద ఎక్కించుకొని ఎలీషా వద్దకు వచ్చెను. అతడు ”నీ దాసుడు బెన్హెదదు తన వ్యాధి నయమగునో లేదో తెలియజెప్పుమని వేడుకొను చున్నాడు” అని మనవి చేసెను.
10. ఎలీషా అతనితో ”ప్రభువు అతడు చనిపోవుననియే తెల్పుచున్నాడు. అయినను నీవు రాజుతో అతని వ్యాధి కుదురునని చెప్పుము” అనెను.
11. అంతట ఎలీషా మొగము బిగిసికొనిపోగా హసాయేలు మొగము చిన్నబోవు నంతగా అతనిని తదేకముగా చూచుచూ కన్నీరు కార్చెను.
12. హసాయేలు ”అయ్యా! నీవెందుకు విలపించుచున్నావు?” అని అడిగెను. ప్రవక్త ”ఓయీ! నీవు యిస్రాయేలునకు మహాపకారము చేయుదువు. నీవు వారి కోటలు కాల్చివేయుదువు. వారి పసి కందులను నేలపైమోది నజ్జునజ్జు చేయుదువు. వారి చూలాలుల కడుపులు నిలువున చీల్చివేయుదువు” అనెను.
13. హసాయేలు ”అయ్యా! నేను అల్పుడను. నేనెక్కడ, నీవు పేర్కొనిన ఈ కార్యములన్నిని చేయు టెక్కడ?” అని అడిగెను. ప్రవక్త ”నీవు సిరియాకు రాజువు అగుదువని ప్రభువు నాకు తెలియజేసెను” అనెను.
14. అంతట ఎలీషాను విడచివెళ్ళి హసాయేలు రాజునొద్దకు వెళ్ళగా అతడు ప్రవక్త నీతో ఏమిచెప్పెనని ప్రశ్నించెను. అతడు ”ప్రవక్త నీ వ్యాధి కుదురునని పలికెను” అని బదులు చెప్పెను.
15. కాని మరునాడు హసాయేలు రాజు ముఖమును తడిసిన జమకాణముతో కప్పిపెట్టగా అతడు ఊపిరాడక చనిపోయెను. అంతట బెన్హెదదుకు మారుగా హసాయేలు సిరియాకు రాజయ్యెను.
యూదానందు యెహోరాము పరిపాలన (క్రీ.పూ.848-841)
16. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమారుడు యెహోరాము పరిపాలనాకాలము ఐదవయేట, యెహోషాఫాత్తు కుమారుడు యెహోరాము యూదా రాజ్యమునకు రాజయ్యెను.
17. యెహోరామునకు అప్పికి ముప్పదిరెండేండ్లు. అతడు యెరూషలేము రాజధానిగా ఎనిమిదేండ్లు పరిపాలించెను.
18. ఆ రాజు అహాబు కుమార్తెను పెండ్లియాడెను. అహాబు కుటుంబమువలె, యిస్రాయేలు రాజులవలె అతడును దుష్టుడై యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.
19. ప్రభువు దావీదునకు నీ వంశస్తులు కలకాలము రాజ్యము పాలింతురని మాటఇచ్చెను గనుక అతడు యూదా రాజ్యమును నాశనము చేయలేదు.
20. యెహోరాము పరిపాలనాకాలమున ఎదోము తిరుగుబాటుచేసి స్వతంత్ర రాజ్యమయ్యెను.
21. యెహోరాము రథములతో సేయీరునకు వెళ్ళగా ఎదోమీయులు అతనిని చుట్టుమ్టుిరి. కాని రాత్రివేళ అతడును అతని రథాధిపతులును శిబిరమునుండి తప్పించుకొని పారిపోయిరి. అతని సైనికులును పారి పోయి తమ నివాసములు చేరుకొనిరి.
22. నాి నుండి నేివరకు ఎదోము స్వతంత్ర రాజ్యముగనే ఉన్నది. ఇదే సమయమున లిబ్నా పట్టణము కూడ తిరుగబడెను.
23. యెహోరాము చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.
24. యెహోరాము తన పితరులతో నిద్రించగా, దావీదు నగరమున పితరుల సమాధిలోనే పూడ్చిపెట్ట బడెను. అతని తరవాత అతని కుమారుడు అహస్యా రాజయ్యెను.
అహస్యా యూదాను పరిపాలించుట
(క్రీ.పూ. 841)
25. యిస్రాయేలు రాజ్యమున అహాబు కుమా రుడు యెహోరాము పరిపాలనాకాలమున పండ్రెండవ యేట, యెహోరాము కుమారుడు అహస్యా యూదా రాజ్యమునకు రాజయ్యెను.
26. అప్పికి అతని వయస్సు ఇరువది రెండేండ్లు. అతడు యెరూషలేము నుండి ఒక యేడు పరిపాలించెను. అతని తల్లి అతల్యా. ఆమె యిస్రాయేలు రాజగు ఒమ్రీ కుమార్తె.
27. అహస్యా అహాబు కుటుంబములోని పడుచును పెండ్లి యాడెను గనుక అతడును వారివలెనే యావే ఒల్లని నీచపనులు చేసెను.
28. అహస్యా యిస్రాయేలురాజు యెహోరాముతో కూడి సిరియారాజు హసాయేలుతో యుద్ధముచేసెను. ఇరుపక్షముల సైన్యములు రామోతుగిలాదు వద్ద పోరాడెను. ఆ పోరున యెహోరాము గాయపడెను.
29. అతడు యెస్రెయేలు నగరమునకు తిరిగివచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా యెహోరాము రాజును చూడబోయెను.