యూదానందు యోవాషు పరిపాలన

(క్రీ.పూ. 835-796)

12 1. యిస్రాయేలు రాజ్యమున యెహూ పరిపాలనాకాలము ఏడవయేట యోవాషు యూదా రాజ్యమునకు పాలకుడై నలువదియేండ్లు పరి పాలించెను. అతని తల్లి పేరు సిబ్యా. బేర్షెబా నగర మునకు చెందినది.

2. యోవాషు యాజకుడైన యెహోయాదా ఉపదేశించిన కాలమంతయు యావే దృష్టిలో సరిగానే ఉండెను.

3. అయినను ఉన్నత స్థలములు నిర్మూలింపబడక నిలిచియుండెను. ప్రజలు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచునే ఉండిరి.

4. యోవాషు యాజకులను పిలిపించి యావే ఆలయములోనికి తేబడు నివేదిత కానుకల విలువను అనగా తలపన్నును, వంతుచొప్పున ప్రతివానికి నిర్ధేశింపబడిన సొమ్మును, స్వేచ్ఛాపూరిత అర్పణ సొమ్మును అి్టపెట్టవలయునని ఆజ్ఞాపించెను.

5. ప్రతి యాజకుడును తాను పరిచర్య చేయునపుడు ఆలయమునకు వచ్చు ప్రజలు సమర్పించిన డబ్బును జాగ్రత్తగా జమక్టి ఆ సొమ్మును దేవాలయ మర మ్మతులకు వాడవలయునని ఆజ్ఞ ఇచ్చెను.

6. కాని యోవాషు పరిపాలనాకాలము ఇరువది మూడవ ఏి వరకు యాజకులు గుడి మరమ్మత్తులకు పూనుకోరైరి.

7. కనుక అతడు యెహోయాదాను ఇతర యాజకు లను పిలిపించి ”మీరు మందిరమును బాగుచేయు టకు పూనుకొనరైతిరేల? అర్పించు వారివద్దనుండి ఇక సొమ్ము ఏమాత్రమును అంగీకరింపక, దేవాలయ ములో శిధిలమైన స్థలములను బాగుచేయుటకై ఇంత వరకు మీరు పుచ్చుకున్న సొమ్మును అప్పగించుడు” అని ఆజ్జనిచ్చెను.

8. కనుక యాజకులు ఇకను జనులు అర్పించు సొమ్ము పుచ్చుకొనుటకుగాని, దేవాలయ మరమ్మత్తులు చేయుటకుగాని అంగీకరించరైరి.

9. అంతట యెహోయాదా పెద్ద పెట్టెను గొనివచ్చి దానిమూతకు కన్నము తొలిపించి యావే ఆలయ మున ప్రవేశించువారి కుడివైపున బలిపీఠము చెంత దానినుంచెను. దేవాలయ ద్వారమువద్ద నుండు యాజకులు భక్తులు కొనివచ్చిన సొమ్మునంతిని ఆ పెట్టెలో వేసెడివారు.

10. దేవళమునున్న పెట్టె నిండగనే రాజ ప్రధానలేఖీకుడును, ప్రధానయాజకు డును వచ్చి నాణెములను లెక్కించి, సంచులు కట్టెడి వారు.

11-12. రాబడినంతిని లెక్కచూచి, ఆ సొమ్మును దేవాలయము మరమ్మతులు చేయించు వారికి ముట్టజెప్పెడివారు. వారు దానిని దేవాలయ మున పనిచేయు వడ్రంగులకు తాపీపనివారికి రాళ్ళు చెక్కువారికి చెల్లించెడివారు. కలపను, రాళ్ళను, కొనుటకు ఇతర మరమ్మతు ఖర్చులకు ఆ సొమ్మునే వినియోగించెడివారు. 13. కాని ప్రభు మందిరమునకు వలయు వెండిగిన్నెలు, పాత్రలు, బాకాలు, దీపముల పనిముట్లు చేయించుటకుగాని, మరి ఏ ఇతరములైన వెండిబంగారు పాత్రములను తయారు చేయించుటకు గాని ఆ ద్రవ్యమును వాడెడివారుకారు.

14. మరమ్మ తుకు సంబంధించిన పనివారికి, వస్తుసామగ్రికి మాత్రమే ఆ సొమ్మును వాడిరి.

15. మరమ్మతులు చూచుకొను అధికారులు మిగుల చిత్తశుద్ధి కలవారు. కనుక వారినుండి లెక్కలు అడుగవలసిన అవసరము కలుగదయ్యెను.

16. జనుల దోషపరిహారబలులకు గాని, పాపపరిహారబలులకు గాని సమర్పించిన సొమ్మును ప్రభు మందిరములోనికి తేబడలేదు. ఆ డబ్బును యాజకులే తీసికొనెడివారు.

17. ఆ కాలమున సిరియారాజు హసాయేలు గాతును ముట్టడించి పట్టుకొనెను. అతడు యెరూషలే మును గూడ ఆక్రమింపగోరెను.

18. యోవాషు రాజు, తన పితరులైన యెహోషాఫాత్తు, యెహోరాము, అహస్యా అను యూదారాజులు దేవాలయమునకు సమర్పించిన కానుకలను, తాను స్వయముగా అర్పించిన కానుకలను, దేవాలయములోని, ప్రాసాదములోని భాండాగారములందున్న బంగారమును గైకొని హసాయేలునకు కానుకగా పంపెను. ఆ బహుమతులు స్వీకరించి హసాయేలు యెరూషలేమును ముట్టడింపక వెడలిపోయెను.

19. యోవాషు చేసిన ఇతరకార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.

20. యోవాషు ఉద్యోగులు అతనిమీద కుట్రపన్నిరి.  యెరూషలేమునకు తూర్పున పల్లమునుపూడ్చి, మిల్లో క్టిన తావున, సిల్లాకు పోవు త్రోవప్రక్కన వారు రాజును హత్యచేసిరి.

21. షిమాతు కుమారుడగు యోసాకారు, షోమేరు కుమారుడగు యెహోసాబాదు అను అతనిసేవకులు అతనిని చంపిరి. జనులు అతనిని దావీదు నగరమున అతని పితరుల సమాధులలో పాతిప్టిెరి. అతని తరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యెను.