యోషీయా రాజు, మతసంస్కరణలు

యోషీయా పరిపాలన (640-609)

ధర్మశాస్త్రగ్రంథము కంటబడుట

22 1. యోషీయా ఎనిమిదవ యేట రాజయ్యెను. అతడు ముప్పదియొక్క యేండ్లు యెరూషలేము నుండి పరిపాలించెను. బొస్కత్తు నగరవాసి అదాయా కుమార్తె యెదీదా అతని తల్లి.

2. అతడు ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను. తన పితరుడైన దావీదును అనుసరించెను. ప్రభువు ఆజ్ఞలన్నిని నిష్ఠతో పాించెను.

3. యోషీయా రాజు తన యేలుబడి పదునెనిమిదియవ యేట మెషుల్లాము మనుమడు, అసల్యా కుమారుడునగు షాఫాను అను కార్యదర్శిని దేవాలయమునకు పంపి, 4. ”నీవు ప్రధానయాజకుడైన హిల్కీయావద్దకు పోయి దేవాలయ ప్రాంగణమున నుండు ద్వారపాలకులు భక్తులనుండి ఎంత సొమ్ము వసూలుచేసిరో వివరములు తెలిసికొని రమ్ము.

5. ఆ సొమ్మును దేవాలయమున మరమ్మతులు చేయించు అధికారులకు ముట్టజెప్పుమనుము.

6. వారు వడ్రంగులకును, రాళ్ళను చెక్కువారికిని, తాపీపనివారికిని వేతనములీయవలయును. మర మ్మత్తులకు వలయు కలపను, రాళ్ళను కొనుటకు ఈయవలయును.” అని చెప్పెను.

7. మరమ్మత్తు చేయు అధికారులు నమ్మదగినవారు. వారియొద్ద నుండి జమాఖర్చుల లెక్క అడుగకయుండిరి.

8. అంతట ప్రధానయాజకుడైన హిల్కీయా యావే దేవళమున ధర్మశాస్త్రగ్రంథమును కనుగొిం నని శాస్త్రియైన షాఫానుతో చెప్పెను. షాఫాను అతని యొద్దనుండి గ్రంథమునందుకొని చదివెను.

9. అతడు రాజునొద్దకు వెళ్ళి ”యాజకులు దేవళములోని సొమ్మును లెక్కించి మరమ్మతు చేయించు అధికారులకు ముట్టజెప్పిరి.

10. ఇదిగో, నాకు ఈ గ్రంథమును యాజకుడైన హిల్కీయా ఇచ్చెను” అని ధర్మశాస్త్రగ్రంథ మును విప్పి రాజునెదుట ఆ గ్రంథమును బిగ్గరగా చదివెను.

ప్రవక్తి హుల్దాను సంప్రతించుట

11. ధర్మశాస్త్రగ్రంథమును చదువుచున్నప్పుడు అందులోగల మాటలు వినినపుడు రాజు పశ్చాత్తాప ముతో బట్టలు చించుకొనెను.

12. యోషీయారాజు ప్రధాన యాజకుడగు హిల్కీయాను, షాఫాను కుమారు డగు అహీకామును, మీకాయా కుమారుడగు అక్బోరును, శాస్త్రియైన షాఫానును, రాజపరిచారకుడైన అసాయాను పిలిపించి, 13. ”మీరు వెళ్ళి నా తరపునను, యూదా ప్రజల తరపునను ప్రభువును సంప్రదింపుడు. ఈ గ్రంథభావమేమో తెలిసికొనిరండు. మన పూర్వులు ఈ గ్రంథమునందలి బోధల ప్రకారము జీవింపలేదు గనుక ప్రభువు మనమీద మిక్కిలి కోపించెను” అని చెప్పెను.

14. కావున యాజకుడైన హిల్కీయా, షాఫాను, అహీకాము, అక్బోరు, అసాయా ప్రవక్తియైన హుల్దా వద్దకు వెళ్ళిరి. ఆమె యెరూషలేము నగరము క్రొత్త భాగమున వసించుచుండెను. ఆమె హర్హాషు మను మడును తిక్వా కుమారుడైన షల్లూము భార్య. ఈ షల్లూము దేవాలయ వస్త్రాగారమునకు అధిపతి. దూతలు తాము వచ్చిన పనిని ప్రవక్తితో చెప్పగా ఆమె, 15. ”మీరు పోయి రాజుతో ఇట్లు నుడువుడు.

16. ప్రభువు సందేశమిది. రాజు గ్రంథమున చదివినట్లు గనే నేను యెరూషలేమును ఆ నగరవాసులను శిక్షింతును.

17. వారు నన్ను నిరాకరించి అన్యదైవము లకు బలులర్పించి నా కోపమును రెచ్చగ్టొిరి. ఈ నగరముపై రగుల్కొను కోపాగ్ని ఇక చల్లారదు.

18. మిమ్ము పంపిన యూదారాజును గూర్చి ప్రభుడనైన నా వాక్కు ఇది: నీవు ఆ గ్రంథములోని సందేశమును ఆలించితివి.

19. నేను యెరూషలేమును శిక్షింతు నింని. ఆ పట్టణము బీడుపడిపోవుననియు, దాని నామము శాపవచనముగా పరిణమించుననియు పలికితిని. ఆ మాటలాలించి నీవు నా సమ్ముఖమున వినయమును ప్రదర్శించితివి. బట్టలుచించుకొని కన్నీరుకార్చితివి. నేను నీ మొరాలించితిని.

20. నేను ఈ నగరమును నాశనము చేయుటను నీవు కింతో చూడవు. దానికిముందే నీవు ప్రశాంతముగా కన్ను మూయుదువు” అని చెప్పెను. దూతలు ఆ సందేశమును ఆలించి రాజు నొద్దకు తిరిగివచ్చిరి.