యూదా-యిస్రాయేలు కుమారులు
2 1-2. యిస్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, యిస్సాఖారు, సెబూలూను, దాను, యోసేఫు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
యూదా వంశజులు
3. యూదాకు కనానీయ వనితయైన బాత్షూవ వలన ఏరు, ఓనాను, షేలా అను ముగ్గురు కుమా రులు కలిగిరి. వారిలో పెద్దవాడైన ఏరు దుష్టుడై నందున ప్రభువు వానిని వధించెను.
4. యూదాకు అతని కోడలైన తామారు వలన పెరెసు, సెర అను పుత్రులు కలిగిరి. కనుక యూదా తనయులు మొత్తము ఐదుగురు.
5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు.
6. సెర కుమారులు సిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార అను ఐదుగురు.
7. కర్మీ కుమారులలో ఆకోను ఒకడు. ఇతను ఆకోరునందు శాపగ్రస్తమైన వస్తువులు దొంగిలించి యిస్రాయేలు నకు తిప్పలుతెచ్చెను.
8. ఏతాను కుమారుడు అసర్యా.
దావీదు వంశకర్తలు
9. హెస్రోను కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబయి.
10-12. కెలూబయి నుండి యిషాయి వరకును గల వంశవృక్షమిది: రాము, అమ్మినాదాబు, యూదీయులలో ప్రముఖుడైన నహషోను, సల్మా, బోవజు, ఓబేదు, యిషాయి.
13-15. యిషాయి ఏడుగురు కుమారులు క్రమముగా వీరు: ఏలీయాబు, అబీనాదాబు, షిమ్యా, నెతనేలు, రద్దయి, ఓసెము, దావీదు.
16. ఈ సోదరులకు సెరూయా, అబీగయీలు అను తోబుట్టువులు కలరు. సెరూయా కుమారులు అబీషయి, యోవాబు, అసాహేలు.
17. అబీగయీలు యిష్మాయేలు వంశ జుడైన యేతేరును పెండ్లియాడి అమాసాను కనెను.
కాలెబు
18. హెస్రోను కుమారుడు కాలెబు అసూబాను పెండ్లియాడి యెరియోతును కనెను. ఈమె కుమారులు వీరు: యేషేరు, షోబాబు, అర్దోను.
19. అసూబా గతించిన తరువాత కాలెబు ఎఫ్రాతాను పెండ్లియాడి హూరును కనెను.
20. హూరు కుమారుడు ఊరి. అతని పుత్రుడు బెసలేలు.
21. హెస్రోను అరువది యేండ్ల ఈడున మాకీరు పుత్రిక, గిలాదు సోదరియైన ఆడుపడుచును పెండ్లియాడి సెగూబును కనెను.
22. ఇతని కుమారుడు యాయీరు. ఈ యాయీరు గిలాదు మండలమున ఇరువదిమూడుపట్టణములను ఏలెను.
23. కాని గెషూరు, ఆరాము రాజులు, యాయీరు మండలము నుండి అరువది పట్టణములు గెలిచిరి. యాయీరు, కెనాతు మరియు వాని సమీప నగర ములు ఆ రాజులు గెలిచిన పట్టణముల లోనివే. అచి ప్రజలెల్లరు గిలాదు తండ్రియైన మాకీరు వంశమునకు చెందిన వారే.
24. కాలెబుదైన ఎఫ్రాతాలో హెస్రోను మరణించిన పిదప అతని భార్య అబియా అతనికి అష్షూరును కనెను. ఇతని కుమారుడే తెకోవ.
యెరహ్మయేలు
25. హెస్రోను జ్యేష్ఠపుత్రుడు యెరహ్మయేలు కుమారులు రాము, బూనా, ఓరెను, ఓసెము, అహీయా.
26. యెరహ్మయేలునకు అతారా అను మరియొక భార్యవలన ఓనాము కలిగెను.
27. రాము కుమా రులు మాసు, యామీను, ఏకెరు.
28. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు.
29. అబీషూరు అబీహాయిలును పరిణయమాడి అహ్బాను, మోలీదు అనువారిని కనెను.
30. నాదాబు కుమారులు సేలెదు, అప్పయీము. సేలెదునకు సంతానము కలుగలేదు.
31. అప్పయీము నకు ఇషీ, అతనికి షేషాను, అతనికి అహ్లాయి జన్మించిరి.
32. షమ్మయి సోదరుడు యాదాకు యెతెరు, యోనాతాను జన్మించిరి. యెతెరునకు సంతా నములేదు.
33. యోనాతాను పుత్రులు పేలెతు, సాస.
34-35. షేషానునకు కుమార్తెలు మాత్రమే కలిగిరి. అతనికి ఐగుప్తీయుడైన యర్హా అను బానిస కలడు. ఈ బానిసకు తన కుమార్తెలలో నొకతెనిచ్చి పెండ్లిచేయగా అత్తయి అను కుమారుడు కలిగెను.
36-41. అత్తయి నుండి ఎలీషామా వరకు గల వంశ వృక్షమిది: అత్తయి, నాతాను, సాబాదు, ఎఫ్లాలు, ఓబేదు, యెహూ, అసర్యా, హెలెసు, ఎల్యాసా, సిస్మాయి, షల్లూము, యెకమ్యా, ఎలీషామా.
కాలెబు
42. యెరహ్మయేలు సోదరుడు కాలెబు జ్యేష్ఠ కుమారుడు మెర్షా. ఇతని కుమారుడు సీపు. ఇతని తనయుడు మరేషా. ఇతని పుత్రుడు హెబ్రోను. 43. హెబ్రోను కుమారులు కోరా, తపూవా, రేకెము, షెమ. 44. షెమ కుమారుడు రహము. అతని తనయుడు యోర్కెయాము. షెమ సోదరుడగు రెకెము తనయుడు షమ్మయి. 45. షమ్మయి కుమారుడు మఓను. అతని తనయుడు బేత్సూరు. 46. కాలెబునకు అతని ఉంపుడు గత్తె అయిన ఏఫా వలన హారాను, మోసా, గాసేసు అను కుమారులు కలిగిరి. హారాను కొడుకు పేరు కూడ గాసేసు.
47.యహ్దాయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షాఫు.
48. కాలెబునకు మరియొక ఉంపుడుకత్తె మాకా వలన షెబెరు, తిర్హనా ప్టుిరి.
49. అటుపిమ్మట ఆమెకు మరి ఇద్దరు కుమారులు కలిగిరి. వారిలో షాఫు కుమారుడు మద్మన్నా. షేవా కుమారులు మక్బేనా, గిబియా, కాలెబు కుమార్తె పేరు అక్సా.
50. వీరందరు కాలెబు కుమారులు.
హూరు
51. హూరు కాలెబునకు పెద్దకొడుకు. హూరునకు ఎఫ్రాతా వలన ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో షోబాలు కిర్యత్యారీమునకు తండ్రి. సల్మా బేత్లెహేము నకు, హారేపు బేద్గాదేరునకు తండ్రులు.
52. కిర్యత్యారీము తండ్రి ఇతర కుమారులు: షోబాలునకు హరొయె, మనహోతీయులలో సగముమంది ఇతని వంశజులే.
53. కిర్యత్యారీము కుటుంబీకులు వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీ యులు షోబాలు వంశజులే. సోరా, ఎష్టావోలు ప్రజలును ఇతని సంతతివారే.
54.షల్మావంశజులు బేత్లెహేము, నెోతీయులు, అోత్బెత్మోహెబు, బేతు, మరియు మనహతీయు లందు సోరాయీయులందు సగభాగము ప్రజలు అతనివంశజులే.
55. తిరాతీయులు, షిమ్యాతీయులు, సుకోతీయులను లేఖకుల జాతులు యాబేసున వసించిరి. వీరు హమ్మతు నుండి వచ్చిన కేనీయులు. వారి వంశకర్త రేకాబు.