దక్షిణదేశ తెగలు

యూదా, షోబాలు

4 1. యూదా వంశజులు పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, షోబాలు. 2. షోబాలు కొడుకు రెయాయా. అతని పుత్రుడు యహతు. అతని పుత్రులు అహూమయి, లహదు. వీరు సోరాతీయుల వంశజులు.

హూరు

3-4. కాలేబువలన ఎఫ్రాతాకు ప్టుిన పెద్ద కొడుకు హూరు. బేత్లెహేము హూరు వంశమునకు చెందినవాడు. హూరు వంశజులు అబీయేతాము, యెస్రేలు, ఈష్మా, ఇద్బాషు, వారి సోదరి హస్సెలెల్పోని. పెనూవేలు వంశజుడు గెదోరు. ఎజేరు వంశజుడు హూషా.

అష్షూరు

5. తెకోవా తండ్రియైన అష్షూరునకు హేలా, నారా అను ఇద్దరు భార్యలుండిరి.

6. అతనికి నారా వలన అహూస్సాము, హెఫెరు, తెమెని, హహస్తారీ అను కుమారులు కలిగిరి.

7. హేలా వలన సెరెతు, ఇస్హారు, ఎత్నాను ప్టుిరి.

8. కోసు కుమారులు అనూబు, సోబేబా. హరుము కుమారుడైన అహర్హేలు వలన కలిగిన జాతులకు కోసు వంశకర్త.

9. యాబేసు అతని సోదరుల అందరిలో సుప్రసిద్ధుడు. యాబేసుతల్లి తీవ్రమైన ప్రసవవేదనతో అతనిని కనెను. కనుక అతనిని ఆ పేరు పెట్టెను.

10. అతడు యిస్రాయేలు దేవుని ప్రార్థించి ”ప్రభూ! నన్ను దీవింపుము. నాకు భూమిని సమృద్ధిగా దయచేయుము. నీవు నాకు బాసటగానుండుము. ఎి్ట కీడును కలుగకుండ నన్ను కాపాడుము” అని మనవి చేసెను. దేవుడు అతని మొర ఆలించెను.

కెలూబు

11. షూవా సోదరుడైన కెలూబునకు మెహీరు, అతనికి ఎష్టోను జన్మించిరి.  

12. ఎష్టోను తనయులు బెత్రాఫా, పాసెయా, తెహిన్నా. తెహిన్నా కుమారుడు ఈర్నహషు. వీరు రెకా మండల నివాసులు.

13-14. కనసు కుమారులు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు పుత్రులలో హతాతు ఒకడు. ఓఫ్రా తండ్రి మెయోనొతాయి మరియొకడు. సెరాయా కుమారుడు యోవాబు. ఈ యోవాబు లోయలోని చేతి వృత్తుల వారికి మూలపురుషుడు.

15. యెఫున్నె కుమారుడగు కాలెబు తనయులు ఈరు, ఏలా, నాము. ఏలా కుమారుడు కనసు.

16. యహల్లేలు పుత్రులు సిపు, సిఫా, తీర్యా, అసరేలు.

17. ఎస్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏపేరు, యాలోను. మెరెదు ఐగుప్తు రాజుపుత్రిక బిత్యాను పెండ్లియాడి మిర్యాము అను కుమార్తెను, షమ్మయి, ఈష్బా అను కుమారులను కనెను. ఈష్బా ఎస్తెమోవాను కనెను.

18. మెరెదు యూదా తెగకు చెందిన మరియొక వనితను గూడ పెండ్లియాడి ముగ్గురు కుమారులను కనెను. వారు గెదోరు తండ్రియైన యెరెదు, సోకో తండ్రియైన హెబెరు, సనోవా తండ్రియైన యెకూతీయేలు.

19. హోదీయా నాహాము సోదరిని పెండ్లి యాడెను. అతనికి గార్మి వంశమునకు చెందిన కెయిలా, మాకతి వంశ మునకు చెందిన ఎష్టెమోవా జన్మించిరి.

20. షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు: సోహేతు, బెంసోహేతు.

షేలా

21-22. యూదా కుమారుడు షేలా. అతని తనయులు వీరు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా. బెతషేబాయలోని నేతపనివారికి ఈ లద్దాయే మూలపురుషుడు. యోకీము, కోసేబా నగరవాసులు, యోవాషు, మోవాబు వనితను పెండ్లి యాడి బేత్లెహేమున స్థిరపడిన సారఫు. ఇవి పురాతన చరిత్రలు.

23. ఈ ప్రజలు మ్టిపాత్రలు చేయువారు. రాజునకు కుండలు చేయుచు నెతాయీము, గెదేరా అను పట్టణములందు వసించిరి.

షిమ్యోను

24. షిమ్యోను కుమారులు నెమూవేలు, యామీను, యారీబు, సెరా, షావూలు.

25-26. షావూలు వంశజులు క్రమముగా షల్లూము, మిబ్షాము, మిష్మా, హమ్మూవేలు, సక్కూరు, షిమీ.

27. షిమీకి పదునారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలరు. కాని అతని సోదరులకు సంతానము అంతగా కలుగలేదు. కనుక షిమీ తెగ, యూదా తెగ వలె వృద్ధి చెందలేదు.

28-33. షిమ్యోను తెగలు దావీదు పాలనా కాలము వరకు బేర్షెబ, మొలదా, హజర్షువాలు, బిల్హా, ఏసేము, తొలాదు, బెతూవేలు, హోర్మా, సిక్లాగు, బేత్మర్కా బోతు, హసర్సూసీము, బెత్బీరీ, షారీము అను నగరములలో వసించిరి. మరియు వారు ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అను ఐదునగరములందు, బాలు వరకు  ఆ నగరములకు చుట్టుపట్ల వ్యాపించియున్న పల్లెలలో వసించిరి. తమ కుటుంబములనుగూర్చి, తాము వసించిన పట్టణ ములనుగూర్చి వారు పదిలపరచిన వివరములివి.

34. వారి వంశములకు నాయకులు ఈ క్రిందివారు: మెషోబాబు, యమ్లేకు, అమస్యా కుమారుడైన యోషా, 35. యోవేలు, మరియు అసియేలు మునిమనుమడు, సెరాయా మనుమడు, యోషిబ్యా కుమారుడైన యెహూ. 36. ఎల్యోయేనయి, యాకోబా, యెషోహాయా, అసాయా, అదీయేలు, యెసీమీయేలు, బెనాయా, 37. సీసా, ఇతని మూలపురుషులు క్రమముగా షిఫి, అల్లోను, యెదాయా, షిమ్రి, షెమాయా.

38. ఈ నాయ కులెల్లరు వారివారి కుటుంబములతో, వంశములతో వచ్చి బాగుగా వృద్ధిచెందిరి.

39. వారు పశువుల మేతకొరకు గెదోరు కనుమనుండి లోయ తూరుపు కొనవరకును ప్రయాణము చేసిరి.

40. అచట వారికి మంచి గడ్డిమైదానములు కనిపించెను. ఆ ప్రదేశము సువిశాలముగా శాంతియుతముగా యుండెను. అచట పూర్వము హాము వంశజులు వసించిరి.

41. యూదా రాజయిన హిజ్కియా కాలమున షిమ్యోను వంశజులు అచట పూర్వమునుండి నివ సించుచున్న మెయినీము వారిని, వారి గుడారములను గుడిసెలను కూలద్రోసిరి. ఆ ప్రజలను పూర్తిగా నాశనముచేసి అచట స్థిరనివాసములు ఏర్పరచుకొని, తమ పేరు నమోదు చేసుకొనిరి. ఆ తావున వారికి పశుగ్రాసము సమృద్ధిగా లభించెను.

42. షిమ్యోను వంశమునకు చెందినవారు ఐదు వందలమంది సేయీరు కొండకువెళ్ళిరి. వారి నాయకులు ఈషి కుమారులైన పెల్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు.

43. వారు అచట అమాలెకు వంశమున తప్పించుకుని మిగిలియున్న వారినెల్లవధించిరి. వారు నేివరకు అచటనే వసించుచున్నారు.