పాస్క ఉత్సవమునకు ప్రజలు ప్రోగగుట
30 1-3. ప్రజలు పాస్క ఉత్సవమును మొది నెలలో జరపుకోజాలరైరి. శుద్ధిచేసికొనిన యాజకులు చాలినంతమంది లేరైరి. ప్రజలు ఎక్కువమంది యెరూషలేమున ప్రోగుగారైరి. కావున హిజ్కియా, అతని ఉద్యోగులు, యెరూషలేము పౌరులు ఉత్సవ మును రెండవనెలలో జరుపుకొందమనుకొనిరి. యిస్రాయేలు, యూదాపౌరులకు ఆ సంగతిని తెలియ జేయుచు రాజు వార్తపంపెను. పైపెచ్చు అతడు ఎఫ్రాయీము, మనష్షే తెగలకుకూడ లేఖలు వ్రాయించెను. వారు యెరూషలేము దేవాలయమునకు వచ్చి పాస్కఉత్సవమున పాల్గొని తమ పితరుల దేవుడైన ప్రభువును కీర్తింపవలయునని కోరెను.
4. రాజు, ప్రజలు గూడ తమ ప్రణాళికను గూర్చి సంతృప్తి చెందిరి. అప్పికి పాస్కఉత్సవమును గూర్చిన విధు లను ఎల్లరును పాించుటలేదు.
5. కనుక ప్రజలెల్లరు యెరూషలేము దేవాలయ మునకు వచ్చి ఉత్సవమున పాల్గొని ప్రభును కీర్తింప వలయునని బేర్షెబానుండి దానువరకు గల యిస్రాయేలు ప్రాంతములంతట యెరూషలేముననున్న ప్రభువు చెంతకువచ్చి తప్పక పాస్కాను ఆచరింపవలెను అని చాింపు వేయింతమనుకొనిరి.
6. వార్తావహులు రాజునుండి అతని ఉద్యోగులనుండి తాకీదులు తీసికొని యూదా, యిస్రాయేలు రాజ్యములలోని అన్ని ప్రాంతములకు వెళ్ళిరి. వారు రాజు పేరుమీదుగా ఇట్లు చెప్పిరి. ”యిస్రాయేలీయులారా! ఇప్పుడు మీరెల్లరు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడైన ప్రభువువైపు తిరుగుడి. అప్పుడు ఆయన మీలో అస్సిరియా రాజుల చేతిలోనుండి తప్పించుకొని మిగిలినవారి వైపు తిరుగును.
7. మీ పితరులును మీతోడి యిస్రాయేలీయు లును తమ దేవుడైన ప్రభువును లక్ష్యము చేయరైరి. ప్రభువు వారిని దారుణముగా శిక్షించెనని మీరెరుగుదురు. మీరు వారివలె ప్రవర్తింపరాదు.
8. వారివలె మీరు గుండె రాయిచేసికొనకుడు. ప్రభువునకు విధేయులు కండు. మీరెల్లరును ప్రభువు శాశ్వతముగా పవిత్రము కావించిన యెరూషలేము దేవాలయమునకువచ్చి ఆయనను సేవింపుడు. అప్పుడు ఆయన మీ మీది ప్రచండకోపమును ఉపసంహరించుకొనును.
9. మీరు ప్రభువుచెంతకు వత్తురేని మీ తోడి యిస్రాయేలీయులను బందీలనుగా కొనిపోయిన పాలకులు వారిమీద జాలి గొని వారిని స్వదేశమునకు పంపుదురు. మీ దేవుడైన ప్రభువు దయాసముద్రుడు. మీరు అతనిచెంతకు వత్తురేని అతడు మిమ్ము అంగీకరించితీరును.”
10. వార్తావహులు ఎఫ్రాయీము, మనష్షే, సెబూలూను మండలములలోని ప్రతి నగరమునకు వెళ్ళిరి. ప్రజలు వారినిచూచి నవ్విరి. వారిని గేలి చేసిరి.
11. అయినను ఆషేరు, మనష్షే, సెబూలూను తెగలనుండి కొందరు మాత్రము వినయముతో యెరూషలేమునకు వచ్చుటకు అంగీకరించిరి.
12. ప్రభువు యూదీయుల హృదయములనుగూడ ఐక్యము చేసి వారు రాజాజ్ఞలను, అతని ఉద్యోగుల ఆదేశము లను పాించునట్లుచేసెను.
13. పొంగనిరొట్టెల పండుగను చేసికొనుటకు గాను రెండవనెలలో చాలమంది ప్రజలు యెరూషలే మున ప్రోగైరి. 14. వారు బలులు అర్పించుటకు సాంబ్రాణిపొగ వేయుటకు పూర్వము యెరూషలేమున నిర్మింపబడిన బలిపీఠములు, ధూపపీఠములు అన్నింని తొలగించి కీద్రోను లోయలో పడవేసిరి.
పాస్క, పొంగని రొట్టెల పండుగలు
15. రెండవనెల పదునాలుగవ దినమున పాస్క బలికొరకు గొఱ్ఱెపిల్లలను వధించిరి. అప్పివరకు శుద్ధిపొందని యాజకులు, లేవీయులు సిగ్గుపడి శుద్ధి చేసికొనిరి. కనుక వారు దేవాలయమున దహనబలులు అర్పించుటకు యోగ్యులైరి.
16. దైవభక్తుడు మోషే ఆదేశించినట్లే వారెల్లరును దేవాలయమున తమతమ స్థానములందు నిలిచిరి. లేవీయులు బలిపశువుల రక్తమును అందీయగా యాజకులు దానిని పీఠముపై చిలుకరించిరి.
17. ప్రజలలో చాలమంది శుద్ధిని పొందలేదు. కనుక వారు పాస్క గొఱ్ఱెపిల్లలను వధింప జాలరైరి. కనుక వారికి బదులుగా లేవీయులే వానిని వధించి ప్రభువునకు అర్పించిరి.
18. పైపెచ్చు ఎఫ్రాయీము, మనష్షే, యిస్సాఖారు, సెబూలూను తెగలనుండి వచ్చినవారిలో చాలమంది శుద్ధిచేసి కోలేదు. కనుక వారు నియమములను పాింప కుండనే పాస్కవిందును భుజించిరి. అందుచేత హిజ్కియా వారి తరఫున దేవుని ప్రార్థించెను.
19. ”పవిత్ర స్థలముయొక్క శుధ్ధీకరణము చొప్పున తనను పవిత్రపరచకొనకయే తన పితరులదేవుడైన యావేను ఆశ్రయింప హృదయాభిలాషగల ప్రతివారినిమిత్తము దయగల ప్రభువు ప్రాయశ్చిత్తము చేయునుగాక” అని ప్రార్ధించెను.
20. ప్రభువు రాజు మొర ఆలించి ఆ ప్రజలను శిక్షింపడయ్యెను.
21. ప్రజలు ఏడుదినములపాటు అమితా నందముతో యెరూషలేమున పొంగని రొట్టెల పండుగ చేసికొనిరి. లేవీయులు, యాజకులు తమ శక్తికొలది ప్రతిదినము దేవుని స్తుతించిరి.
22. లేవీయులు ఆరాధన నిర్వహణలో చూపిన నైపుణ్యమునకుగాను హిజ్కియా వారితో ఉల్లాసముగా మ్లాడెను. వారు ఏడుదినములపాటు తమ పితరుల దేవుడైన ప్రభువును స్తుతించుచు బలులర్పించిరి. నైవేద్యములను భుజించిరి.
23. అటుపిమ్మట ఎల్లరును మరి ఏడుదినములు ఉత్సవము చేసికొనుటకు అంగీకరించిరి. తాము అంగీకరించినట్లే ఆనందముతో పండుగను కొన సాగించిరి.
24. హిజ్కియా ప్రజలు భుజించుటకు గాను వేయికోడెలను, ఏడువేల గొఱ్ఱెలను కానుకగా ఇచ్చెను. రాజోద్యోగులుకూడ వేయికోడెలను, పదివేల గొఱ్ఱెలనిచ్చిరి. చాలమంది యాజకులు శుద్ధిని పొందిరి.
25. అపుడు యాజకులును, లేవీయులును, యూదానుండియు, యిస్రాయేలునుండియు వచ్చిన వారును, యిస్రాయేలు దేశమునుండి వచ్చిన అన్యు లును మరియు యూదాలో నివసించుచున్న అన్యులును మిగుల సంతసించిరి.
26. యెరూషలేము నగరమున ఆనందము మిన్నుముట్టెను. దావీదు కుమారుడైన సొలోమోను ఏలుబడి తరువాత ఆ పట్టణమున ఈ విధమున ఉత్సవము ఎన్నడును జరుగలేదు.
27. కడన లేవీయులైన యాజకులులేచి ప్రజలను దీవించిరి. వారి ప్రార్ధన ఆకాశముననున్న పవిత్ర నివాసమును చేరెను.