మనష్షే, ఆమోనుల పాపకార్యములు

మనష్షే హిజ్కియా కార్యములను చెడగొట్టుట

33 1. మనష్షే తన పండ్రెండవయేట రాజై ఏబదియైదేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను.

2. అతడు యిస్రాయేలీయుల యెదుినుండి ప్రభువు తరిమివేసిన అన్యజాతుల వారి జుగుప్సా కరమైన కార్యములను అనుకరించెను. ప్రభువునకు ఇష్టముకాని దుష్కార్యములెల్లను చేసెను.

3. తన తండ్రి నిర్మూలించిన ఉన్నతస్థలములమీద బలిపీఠములను పునర్నిర్మాణము చేసెను. బాలుదేవతకు బలిపీఠములు క్టించెను. అషేరా దేవతకు స్తంభములు నాించెను. నక్షత్రములను పూజించిసేవించెను.

4. ప్రభువు తన నామమును శాశ్వతముగా ఆరాధించుటకుగాను ఎన్నుకొనిన దేవాలయమున అన్యదైవతములకు బలిపీఠములు నిర్మించెను.

5. దేవాలయపు రెండు ప్రాంగణములందు నక్షత్రములను పూజించుటకు బలిపీఠములు క్టించెను.

6. బెన్‌హిన్నోము లోయలో తన కుమారులను దహన బలిగా సమర్పించెను. అతడు సోదె చెప్పించుకొనెను. మాంత్రికులను సంప్రదించెను. జ్యోతిష్కులను, మృతుల ఆత్మలను ఆవాహనము చేయువారిని ప్రోత్సహించెను. ప్రభువునకు ఇష్టము కాని పనులింక అనేకములు చేసి ఆయన కోపమును రెచ్చగొట్టెను.

7-8. ”నా నామము సదా ఉండునట్లు యిస్రా యేలు తెగలన్నిలో ఈ యెరూషలేము పట్టణమును, ఈ దేవాలయమును నేను ఎన్నుకొింని. నేను నా భక్తుడైన మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రము నంతిని, దాని ఆజ్ఞలన్నిని, యిస్రాయేలీయులు పాింతురేని నేను వారి పితరులకిచ్చిన ఈ నేల మీదినుండి వారిని వెడలగొట్టను” అని ప్రభువు దావీదు సొలోమోను రాజులతో నుడివెనుగదా! అి్ట దేవాలయముననే మనష్షే విగ్రహమును నెలకొల్పెను.

9. అతడు యూదీయులను, యెరూషలేము పౌరులను పెడత్రోవప్టింపగా, వారు ప్రభువు కనాను మండ లమునుండి వెడలగ్టొిన అన్యజాతుల ప్రజలకంటెను ఎక్కువగా దుష్కార్యములు చేసిరి. 10. ప్రభువు ఆ రాజును అతని ప్రజలను హెచ్చరించెను గాని వారు ఆయన మాటవినలేదు.

మనష్షే మనస్సు మార్చుకొనుట

11. కనుక ప్రభువు అస్సిరియా సైన్యాధిపతులను యూదా మీదికి దాడిచేయించెను. వారు మనష్షేను బంధించి అతని శరీరములో కొక్కెములు గ్రుచ్చిరి. అతనిని గొలుసులతోక్టి బబులోనియాకు చెరగొని పోయిరి.

12. అతడు తన బాధలలో ప్రభువును శరణువేడెను. తన పితరుల దేవుడైన ప్రభువుముందు వినయమును ప్రదర్శించెను.

13. అతడు ప్రభువునకు మొరపెట్టగా ప్రభువు మనసుకరిగి అతనిని మరల యెరూషలేమునకు కొనివచ్చి రాజుగా కొనసాగ నిచ్చెను. అప్పుడుగాని అతడు ప్రభువే దేవుడని  అర్థము చేసికోలేదు.

14. అటుతరువాత రాజు గీహోనునకు పడమివైపున వున్న దావీదు నగరమువెలుపలి ప్రాకా రము ఎత్తును పొడిగించెను. లోయలోని గీహోను చెలమ దగ్గరినుండి ఉత్తరమున మత్స్యద్వారము వరకును, ఓఫేలు చుట్టునుకూడ ప్రాకారము ఎత్తును పెంచెను. అతడు యూదాలోని ప్రతి సురక్షిత పట్టణము లోను ఒక సైన్యాధిపతినిగూడ ఉంచెను.

15. దేవాలయ ములో నుండి అన్యదైవములను, పూర్వము తాను అచట నెలకొల్పిన విగ్రహములను తొలగించెను. దేవాలయమున్న కొండమీద, యెరూషలేము నగర మున తానునిర్మించిన బలిపీఠములను నిర్మూలించెను. వానినన్నిని నగరము వెలుపలకు త్రోయించెను.

16. ప్రభువు బలిపీఠమును పునర్నిర్మాణము చేయించి దానిమీద సమాధానబలులు, కృతజ్ఞతాబలులు అర్పించెను. యూదీయులెల్లరును యిస్రాయేలు దేవుడైన ప్రభువును ఆరాధింపవలెనని ఆజ్ఞ యిచ్చెను.

17. ప్రజలు ఉన్నతస్థలములమీద బలిపీఠములయొద్ద బలులర్పించుట కొనసాగించినను వానిని ప్రభువునకే అర్పించిరి.

18. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతడు ప్రభువునకు చేసిన ప్రార్థనలు, ప్రవక్తలు యిస్రాయేలు దేవుడైన ప్రభువుపేరిట అతనికి విన్పించిన సందేశము లన్నియు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి. 19. అతని ప్రార్థనము, ప్రభువు అతనిని క్షమించినతీరు, మనసు మార్చుకొనకముందతడు చేసిన దుష్కార్యములు అనగా ప్రభువు ఆజ్ఞలను మీరి అతడు చేసిన పాపకార్యములు, ఉన్నతస్థలముల మీద అతడు క్టిన బలిపీఠములు, నెలకొల్పిన విగ్రహ ములు, దేవతాస్తంభములు – మొదలైన అంశము లన్నియు ప్రవక్తలచరిత్రగ్రంథమున లిఖింపబడియే ఉన్నవి.

20. అంతట మనష్షే తన పితరులతో నిద్రించి, తన నగరునందు పాతిపెట్టబడెను. అటు తరువాత అతని పుత్రుడు ఆమోను రాజయ్యెను.

ఆమోను మూర్ఖత్వము

21. ఆమోను తన ఇరువది రెండవయేట రాజై రెండేండ్లపాటు యెరూషలేమునుండి పరిపాలన చేసెను.

22. తన తండ్రి మనష్షేవలె అతడు కూడ ప్రభువునకు నచ్చని దుష్కార్యములు చేసెను. తన తండ్రి కొలిచిన విగ్రహములను అతడుకూడ కొలిచెను.    

23. కాని అతడు తన తండ్రివలె దేవునియెదుట వినయము ప్రదర్శింపక ఆ తండ్రిని మించిన పాపి అయ్యెను.

24. ఆమోను ఉద్యోగులు అతనిమీద కుట్ర పన్ని ప్రాసాదముననే హత్యచేసిరి. యూదాప్రజలు రాజహంతకులను ప్టి వధించి ఆమోను కుమారుడు యోషీయాను రాజును చేసిరి.