యోషీయా మత సంస్కరణములు
పరిపాలనా సంగ్రహము
34 1. యోషీయా యెనిమిది యేండ్ల యీడున రాజై యెరూషలేము నుండి ముప్పది ఒక్కయేండ్లు పరిపాలించెను.
2. అతడు ధర్మబద్ధముగా ప్రవర్తించి ప్రభువునకు ఇష్టుడయ్యెను. తన పితరుడైన దావీదువలె ధర్మశాస్త్రనియమములను పూర్తిగా పాించెను.
తొలి సంస్కరణలు
3. ఆ రాజు తన పరిపాలనాకాలము ఎనిమిదవ యేట, తానింక చిన్నవాడుగా ఉన్నప్పుడే, తన పితరుడైన దావీదు యొక్క దేవుని సేవింపమొదలిడెను. అటు పిమ్మట నాలుగేండ్ల తరువాత ఉన్నతస్థలముల మీది బలిపీఠములను తీసివేసెను. దేవతాస్తంభము లను, విగ్రహములను కూలద్రోయించెను.
4. యోషీయా పర్యవేక్షణక్రింద అతని సేవకులు బాలు బలిపీఠములను పడగ్టొిరి. వానిచెంతనేయున్న సాంబ్రాణిపొగ వేయు వేదికలనుగూడ కూలద్రోసిరి. అషేరా దేవతాస్తంభములను, బాలు విగ్రహములను పగులగ్టొి పొడి చేసి, ఆ పొడిని ఆ దేవతలకు బలు లర్పించినవారి సమాధులపై చల్లిరి.
5. అన్యదేవత లను కొలిచిన పూజారుల ఎముకలను వారు బలు లర్పించిన బలిపీఠములపైనే కాల్చివేసిరి. ఈ రీతిగా అతడు యెరూషలేమునకును, యూదాకును శుద్ధి చేయించెను.
6. మనష్షే, ఎఫ్రాయీము, షిమ్యోను, దూరముననున్న నఫ్తాలితెగలలోని నగరములందును, ఆ నగరములచుట్టు పాడుపడియున్న మండలములందు గూడ అతడు ఆ రీతిగానే సంస్కరణలు చేయించెను.
7. ఆ తావులలోని బలిపీఠములను, అషేరాదేవత స్తంభములను పడగ్టొించెను. విగ్రహములను పగుల గ్టొించి పిండిచేయించెను. సాంబ్రాణిపొగ వేయు పీఠములను కూలద్రోయించెను. అటుపిమ్మట అతడు యెరూషలేమునకు తిరిగివచ్చెను.
దేవాలయము మరమ్మతు
8. యోషీయా దేశమును, దేవాలయమును శుద్ధి చేసిన తరువాత తన పరిపాలనాకాలము పదు నెనిమిదియవయేట, ముగ్గురిని దేవాలయమును మరమ్మతు చేయుటకు పంపెను. వారు అసల్యా కుమారు డగు షాఫాను, యెరూషలేము పట్టణాధిపతియైన మాసెయా, యోవహాసు కుమారుడును, చరిత్ర లేఖకుడు నైన యోవా.
9. లేవీయులు తాము దేవాలయమున వసూలుచేసిన సొమ్మును ప్రధానయాజకుడైన హిల్కీయాకు ముట్టజెప్పిరి. ఎఫ్రాయీము మనష్షే తెగలనుండియు, యిస్రాయేలు రాజ్యములోని ఇతర భాగములనుండియు, యూదా బెన్యామీను యెరూషలే ముల నుండియు లేవీయులు ఆ సొమ్మును వసూలు చేసిరి.
10. ఈ ధనము ప్రధానయాజకుని నుండి దేవాలయము మరమ్మత్తులను చూచుకొను పై ముగ్గురికి చేరెను.
11. వారు దానిని అప్పికే యూదా రాజుల అశ్రద్దవలన కట్టడముల దూలములు పాడైపోవుచు న్నందున, దూలములను కొనుటకును, వడ్రంగులకును, తాపీపనివారు రాళ్ళను కొనుటకును వినియోగించిరి.
12. పనివారందరు చిత్తశుద్ధితో కృషిచేసిరి. నలుగురు లేవీయులు ఆ పనివారిమీద పర్యవేక్ష కులుగా ఉండిరి. వారు మెరారి వంశమునకు చెందిన యాహాతు, ఓబద్యా, కోహాతు వంశమునకు చెందిన జెకర్యా, మెషుల్లాము అనువారు. వారెల్లరును సంగీతమున నేర్పరులు.
13. ఇంకను ఇతర లేవీయులు వస్తువు లను సరఫరా చేయువారిమీదను, వివిధములైన పనులు చేయువారిమీదను పర్యవేక్షకులుగా నుండిరి. కొందరు లేవీయులు లేఖకులుగాను, మరికొందరు దేవాలయ ద్వార సంరక్షకులుగాను పనిచేసిరి
ధర్మశాస్త్ర గ్రంథమును కనుగొనుట
14. దేవాలయమునందలి బొక్కసములోనుండి ధనము తీయునపుడు మోషేద్వారా ప్రభువు దయచేసిన ధర్మశాస్త్రము లిఖింపబడిన గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.
15. అతడు లేఖకుడైన షాఫానుతో తనకు దేవాలయమున ధర్మశాస్త్రగ్రంథము దొరకినదని చెప్పి ఆ గ్రంథమును అతనికిచ్చెను.
16. షాఫాను దానిని రాజునొద్దకు తీసికొని వెళ్ళి ”మేము నీవు చెప్పిన పనులెల్లచేసితిమి.
17. దేవాలయ ములోని సొమ్మును తీసికొనివెళ్ళి పనివారిమీద పర్యవేక్షకులుగానున్న వారికిని, పనివారికిని చెల్లించి తిమి” అని చెప్పెను.
18. అటుతరువాత అతడు రాజుతో హిల్కీయా నాకు ఈ గ్రంథమును ఇచ్చెనని చెప్పి దానిలోని భాగములను చదివి విన్పించెను.
19. రాజు ఆ పుస్తకవాక్యములను విని విచార ముతో బట్టలుచించుకొనెను.
20. అతడు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అబ్దోనును, లేఖకుడైన షాఫానును, రాజునకు పరిచర్యచేయు అసాయాను ఇట్లు ఆజ్ఞాపించెను: 21. ”మీరు వెళ్ళి నా పక్షము నను, యూదా యిస్రాయేలు రాజ్యములలో ఇంకను మిగిలియున్న ప్రజల పక్షమునను దేవుని సంప్ర తింపుడు. ఈ గ్రంథములోని అంశముల భావ మేమిో తెలిసికొనుడు. మన పూర్వులు ఈ గ్రంథ బోధలను పాింపలేదు కనుక ప్రభువు ఆజ్ఞ మీరిరి. కావుననే ఆయన మనమీద మిక్కిలి కోపము తెచ్చు కొనెను.”
ప్రవక్తి హుల్దాను సంప్రతించుట
22. అప్పుడు యాజకుడైన హిల్కీయాయు, రాజో ద్యోగులును హుల్దా అను ప్రవక్తిని సంప్రదింపబోయిరి. జరిగినదంతయు ఆమెకు విన్నవించిరి. ఆమె యెరూషలేములోని క్రొత్తభాగమున వసించుచుండెను. ఆమె భర్త షల్లూము దేవాలయములోని వస్త్రశాలలకు అధిపతి. అతని తండ్రి తాతలు తోకాతు, హస్రా అను వారు.
23. ఆమె వారితో ఇట్లనెను: ”మిమ్ము పంపిన రాజునకు మీరు ఈ క్రింది సందేశము విన్పింపుడు. ప్రభువువాక్కిది.
24. నేను యెరూషలేమును, దానిలో వసించు పౌరులను శిక్షింతును. రాజు ఎదుట చదివిన గ్రంథము పేర్కొనుశాపముల ప్రకారమే ఈ ప్రజను దండింతును.
25. వీరు నన్ను త్యజించి అన్యదైవము లకు సాంబ్రాణి పొగవేసిరి. తాముచేసిన దుష్కార్యముల వలన నా కోపమును రెచ్చగ్టొిరి. యెరూషలేముపై నా కోపము రగుల్కొనుచున్నది. అది యిక చల్లారదు.
26. నన్ను సంప్రతించుటకు మిమ్ము పంపిన యూదా రాజుతో మీరిట్లు నుడువుడు. యిస్రాయేలు దేవుడనైన నా పలుకులివి. నీవు ఈ గ్రంథమునందు వ్రాయ బడిన సంగతులు వింవి.
27. నేను యెరూషలేమును దానిలో వసించు ప్రజలను శిక్షింతునని చెప్పగా నీవు పశ్చాత్తాపపడి, నా యెదుట వినయమును ప్రదర్శించి తివి. నీ బట్టలు చించుకొని బోరున యేడ్చితివి. కనుక నేను నీ మొరాలించితిని.
28. నేను యెరూషలేమునకు విధింపబోవు శిక్షలు నీ జీవితకాలమున సిద్ధింపవు. నీ మట్టుకు నీవు సమాధానముతో కన్నులు మూయు దువు.” దూతలు ఈ సందేశముతో రాజునొద్దకు తిరిగిపోయిరి.
నిబంధనమును నూత్నపరచుట
29. యోషీయా రాజు ఆ సందేశమును విని యూదా, యెరూషలేము నాయకులను ప్రోగుచేసెను.
30. రాజును, నాయకులును, యాజకులును, లేవీ యులును, యూదా యెరూషలేము ప్రజలలో పిన్నలు, పెద్దలందరును కూడి దేవళమునకు పోయిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధనగ్రంథమునంతిని వారియెదుట చదివెను.
31. రాజు స్తంభము ప్రక్క తన స్థలమందు నిలుచుండెను. ప్రభువుతో నిబంధనము చేసికొనెను. ‘నేను ప్రభువునకు విధేయుడనై ఆయన ఆజ్ఞలను, శాసనములను, చట్టములను పూర్ణహృద యముతోను, పూర్ణమనస్సుతోను పాింతును’ అని మాటయిచ్చెను.
32. అతని ప్రోత్సాహము వలన బెన్యామీనీయులును, యెరూషలేమున హాజరైయున్న ఇతర ప్రజలును నిబంధనమును పాింతుమని ప్రమాణము చేసిరి. కావున యెరూషలేము వాసులు తమ పితరుల దేవుడైన ప్రభువు నిబంధన ప్రకారము మెలగిరి.
33. యోషీయా యిస్రాయేలు దేశములోని రోతప్టుించు విగ్రహములనెల్ల నాశనము చేయించెను. అతడు జీవించినంతకాలము యిస్రాయేలీయులు తమ పితరుల దేవుడైన ప్రభువును మాత్రమే సేవించు నట్లు జాగ్రత్త వహించెను.