చివరి రోజులలో యూదారాజ్యము
యెహోవాహాసు
36 1. ప్రజలు యోషీయా కుమారుడైన యెహోవాహాసును యెరూషలేమున రాజుగా అభి షేకించిరి.
2. రాజగునప్పికి యెహోవాహాసునకు ఇరువదిమూడేండ్లు. అతడు యెరూషలేమునుండి మూడునెలలు పరిపాలించెను.
3. ఐగుప్తురాజు నెకో యెహోవాహాసును తొలగించి అతనిని బందీగా కొని పోయెను. యూదా రాజ్యమునకు రెండువందల మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును కప్పముగా నిర్ణయించెను.
4. నెకో యెహోవాహాసు సోదరుడైన యెల్యాకీమును యూదాకు రాజును చేసి అతని పేరును యెహోయాకీముగా మార్చెను. నెకో యెహోవాహాసును బందీగా ఐగుప్తునకు కొనిపోయెను.
యెహోయాకీము
5. రాజగునప్పికి యెహోయాకీమునకు ఇరువదియైదేండ్లు. అతడు యెరూషలేమునుండి పదునొకండేండ్లు పరిపాలించెను. అతడు ప్రభువునకు నచ్చని దుష్కార్యములు చేసెను.
6. బబులోనియా రాజగు నెబుకద్నెసరు అతనిమీదికి దాడిచేసి, బబులోనియాకు బందీగా కొనిపోవుటకై అతనిని బంధించెను.
7. నెబుకద్నెసరు దేవాలయములోని పరికరములనుగూడ కొనిపోయి బబులోనియాలో తన ఆలయములో ఉంచుకొనెను.
8.యెహోయాకీము జీవితములోని ఇతరాంశములు, అతడు చేసిన దుష్కార్యములు, జుగుప్సాకరమైన చెయిదములు యూదా యిస్రాయేలురాజులచరితమున లిఖింప బడియేయున్నవి. అతని తరువాత అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను.
యెహోయాకీను
9. రాజగునప్పికి యెహోయాకీనునకు ఎనిమిదియేండ్లు1. అతడు యెరూషలేము నుండి మూడునెలల పదిరోజులు పరిపాలన చేసెను. అతడు యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.
10. సంవత్స రాంతమున నెబుకద్నెసరు అతనిని బబులోనియాకు బందీనిగా కొనిపోయెను. అతనితోపాటు దేవాలయ ములోని విలువగల పరికరములనుగూడ కొని పోయెను. ఆ రాజు యెహోయాకీను పినతండ్రియైన సిద్కియాను యూదా యెరూషలేములకు రాజుగా నియమించెను.
సిద్కియా
11. రాజగునప్పికి సిద్కియాకు ఇరువదియొక్క యేండ్లు. అతడు యెరూషలేమునుండి పదునొక్క యేండ్లు పరిపాలించెను.
12. అతడు ప్రభువు ఒల్లని దుష్కార్యములు చేసెను. ప్రభువు పలుకులను విన్పించిన ప్రవక్త యిర్మీయా మాటలను వినయముతో ఆలింపడయ్యెను.
13. అతడు నెబుకద్నెసరుకు విధేయు డనై ఉందునని దేవుని పేరుమీదుగా ప్రమాణము చేసికూడ అతనిపై తిరుగబడెను. తన మొండితనము చేత హృదయము కఠినపరచుకొని యిస్రాయేలు దేవుడైన ప్రభువును శరణు వేడడయ్యెను.
ప్రజలు
14. ఇంకను యాజకులును, జనులును, అధిపతు లగువారును చుట్టుపట్లగల ఇతర జాతులను అను కరించి విగ్రహములను పెట్టుకొని మిక్కిలి ద్రోహులై, ప్రభువు పవిత్రముచేసిన మందిరమును అమంగళము చేసిరి.
15. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనెంచెను.
16. కాని వారు ప్రభువు ప్రవక్తలను గేలిచేసిరి. వారిని ఎగతాళిచేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆయన కోపమునుండి తప్పించుకోజాలరైరి.
పతనము
17. ప్రభువు కల్దీయుల రాజును తీసికొనిరాగా అతడు యూదా యువకులనుప్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలనేమి, పిన్నలేమి, వృద్ధుల నేమి, యువతులనేమి ఏ తారతమ్యము లేకుండ అందరిని నిర్దయగా వధించెను. ప్రభువు అందరిని అతని చేతికప్పగించెను.
18. ఇంకను బబులోనియా రాజువచ్చి యథేచ్ఛగా దేవాలయ ఉపకరణములను, దేవాలయ కోశాగారమును, రాజనిధులను, రాజోద్యో గుల నిధులను దోచుకొని ఆ సొత్తునంతిని బబులోని యాకు కొనిపోయెను.
19. అతడు దేవాలయమును తగులబెట్టెను. నగర ప్రాకారములను పడగ్టొి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్ల ధ్వంసము చేసెను.
20. చావును తప్పించుకొని బ్రతికియున్న వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. వారు పారశీకరాజ్యము తలయెత్తిన వరకు నెబుకద్నెసరునకును, అతని వంశజులకును దాసులై సేవలు చేయుచువచ్చిరి.
21. ”ఈ దేశము విశ్రాంతి దినములను పాింపలేదు, కనుక ప్రాయశ్చిత్తముగా డెబ్బదియేండ్లదాక పాడుపడి యుండును” అని ప్రభువు యిర్మీయా ప్రవక్తద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతిదినము లను అనుభవించెను.
22. పారశీకదేశరాజైన కోరెషు ఏలుబడి మొదియేట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితరూపమైన చట్టమును జారీచేసి దానిని తన రాజ్యము నలు మూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మీయాద్వారా పలికినపలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను.
23. ”పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. ఆకాశమందలి దేవుడు నన్ను ఈ భూలోకమంతికిని అధిపతిని చేసెను. ఆయన యూదా దేశమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని ఆజ్ఞను ఇచ్చెను. మీలో ఎవరు ఆ ప్రభువు ప్రజలైయున్నారో వారు బయలు దేరవచ్చును. వారి దేవుడైన యావే వారికి తోడుగా నుండునుగాక.