ఉపోద్ఘాతము:

పేరు: యిస్రాయేలు ప్రజలకు దేవుని వాక్కు పలురూపములలో అందినది. తోరా, చారిత్రక గ్రంథాలలో అది విదితమైనది. ప్రవక్తల గ్రంథములు, జ్ఞానగ్రంథములు దానికి సాక్ష్యమిచ్చినాయి.  సామెతల గ్రంథము  జ్ఞానసాహిత్యమునకు చెందినది. హీబ్రూ బైబులులో దీనిపేరు ”మిషెల్‌ షెలోమొహ”. దీనిని సొలోమోను సామెతలుగా కూడా గుర్తించారు (1:1). ఇదే తెలుగులో సామెతలు గ్రంథముగా రూపుదిద్దుకున్నది.

కాలము: ఈ సామెతలలో అధిక భాగము సొలోమోను కాలము (970-930) నాివైనను, ”సామెతలు” తుదికూర్పు బబులోనియా ప్రవాసానంతరము క్రీ.పూ. 5వ శతాబ్దములో జరిగినది.

రచయిత:   సొలోమోను రాజు.  సొలోమోను జ్ఞానవంతుడు అని ప్రతీక. (1 రాజు 3:5-9; 4:29-31,34; 10:1-13, 24).

చారిత్రక నేపథ్యము: సామెతలు ప్రజల నానుడులు. అవి జీవితానుభవము, అవగాహన సమ్మేళనముతో రూపుదిద్దుకొన్నవి.  గనుక వాిలో కొంత చారిత్రకత వుంటుంది. యిస్రాయేలీయుల నమ్మకము ప్రకారము దేవుని వాక్కు మూడు విధములుగా ప్రత్యక్షము గావించబడినది. యాజకులు చట్టరూపములో అందించిరి. ప్రవక్తలు వారి బోధనలద్వారా, సూచికక్రియల ద్వారా, ప్రవచనాల ద్వారా, దర్శనాల రూపేన తెలియజేసినారు. జ్ఞానులు, పెద్దలు ప్రజలకు జీవితరహస్యాలను బోధించారు. ఈ చివరికోవకు చెందినవి సామెతలు. ముఖ్యాంశములు: ఇది ప్రధానముగా నీతి, న్యాయము, నిజాయితీలను దైనందిన జీవితములో ఆచరణీయము చేయమని బోధించును. (1:2-6). నిత్య సమీక్ష, విజ్ఞతావశ్యకతను సూచిస్తుంది (1:3-5). జీవితములో అనేక రకాల పరిస్థితులు, సమస్యలను ఎదుర్కొనుటలో పాించాల్సిన నియమాలను తెలుపుతుంది. విజ్ఞానులు, నీతిమంతులుగా దేవుని యెదుట నిలుస్తారు. వివేకము, దైవ, మానవసంబంధాలు, మాటలవైవిధ్యము, పని, కర్తవ్యము,  విజయాలు మున్నగువానిని ఈ గ్రంథము విపులీకరించును. దేవుని పట్ల భయభక్తిని బోధించడము ఈ గ్రంథము ప్రధానాంశము.  జ్ఞానరాహిత్యమే పాపకారణమని నుడువుతుంది.

క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములో జ్ఞానము ఒక మానవీకరణము పొంది, సంపూర్ణ గుణాతిశయములు కలిగిన మనుష్యునిగా చిత్రీకరింపబడినది. జ్ఞానము దేవుని వరము (8:35,3:18), నీతి, న్యాయముల పొందిక (8:8-9). ఈ జ్ఞానమే క్రీస్తుగా శరీరరూపంలో అవతరించినది. (కొలొస్సీ 2:3). క్రీస్తు ద్వారా మానవులకు జ్ఞానము లభించినది (1 కొరి. 1:22-24,30).