గ్రంథ ఉద్దేశము
1 1. యిస్రాయేలు రాజును, దావీదు కుమారుడునగు సొలోమోను చెప్పిన సామెతలు.
2. విజ్ఞానమును, ఉప దేశమును ఆర్జించుటకును, నిశితదృష్టికి సంబంధించిన విషయములను ఎరుగుటకును, 3. తెలివితేటలతో మెలగు టకును, నీతిన్యాయములతో ప్రవర్తించుటకును, 4. జ్ఞాన ములేనివారికి తెలివిగరపుటకును, యువకులకు విజ్ఞాన విచక్షణ నేర్పుటకును, 5. జ్ఞానులు మరింత అధికముగా విజ్ఞానము బడయుటకును, వివేకవంతులు హితోపదేశము పొందుటకును, 6. ఉపమానములు, నీతికథలు అర్థము చేసికొనుటకును, సుభాషితములను, పొడుపు కథలను గ్రహించుటకును ఈ సామెతలు ఉద్దేశింపబడినవి.
7. దేవునిపట్ల భయభక్తులు కలిగియుండుటయే
విజ్ఞానమునకు మొదిమెట్టు.
కాని మూఢులు విజ్ఞానోపదేశములను లెక్కచేయరు
ప్రారంభ వచనములు
విజ్ఞాన స్తోత్రము
దుర్మార్గుల పొత్తుకూడదని జ్ఞానిబోధ
8. కుమారా! నీ తండ్రి ఉపదేశము నాలింపుము.
నీ తల్లి బోధను అనాదరము చేయకుము.
9. వారి బోధలు నీ తలకు సొగసైన పాగాగను,
నీ కంఠమునకు హారముగను శోభిల్లును.
10. కుమారా! దుర్మార్గులు నిన్ను మభ్యప్టిెనచో
నీవు వారి ప్రలోభములకు లొంగవలదు
11. వారు నిన్ను చూచి ”నీవును మాతో రమ్ము,
మనమెవరినైన హత్య చేయుదము.
అమాయకులకెవరికైన ఉచ్చులు పన్నుదము.
12. పాతాళలోకము ఉన్నవారిని
ఉన్నట్లుగా కబళించినట్లే
మనమును వారిని సజీవులుగా మ్రింగివేయుదము
13. వారిని మట్టుప్టిెనచో
మనకు బహుసంపదలు దక్కును.
కొల్లసొమ్ముతో మన యిండ్లను నింపుకోవచ్చును.
14. రమ్ము, నీవును మాతో కలియుము.
మనమందరమును కలిసియే
దొంగసొమ్మును పంచుకొందము”
అని అనినచో,
15. కుమారా! నీవు వారి మార్గమున నడువకుము.
వారి త్రోవనుండి వైదొలగుము.
16. వారు దుష్టపథమున పోవువారు,
ఎల్లపుడును హత్యకు పాల్పడువారు.
17. పక్షి చూచునప్పుడు వలపన్నినచో
ఫలితము దక్కదుకదా!
18. దుర్మార్గులు తమకు తామే వలపన్నుకొందురు.
తమ ఉరులలో తామే చిక్కుకొందురు.
19. ఆశబోతుల అందరి గతి అి్టదే.
దానిని స్వీకరించు ప్రాణమును అది తీయును.
శ్రద్ధాసక్తులు లేనివారికి
విజ్ఞానముచేయు బోధ
20. విజ్ఞానము వీధులలో బిగ్గరగా అరచుచున్నది.
సంత వీధులలో పెద్దగా కేకలిడుచున్నది.
21. త్రోవ మలుపులలో గొంతెత్తి అరచుచున్నది.
కూడలిలో ఇట్లు కేకలిడుచున్నది:
22. ”అజ్ఞానులారా! ఎంత కాలము
మీ అజ్ఞానమున మునిగియుందురు?
ఎంతకాలము విజ్ఞానమునపహసింతురు?
మందమతులారా!
మీరు తెలివి తెచ్చుకొనునదెప్పుడు?
23. మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు.
నా ఉపదేశమును వినుడు.
నా విజ్ఞానమును గ్రహింపుడు.
24. నేను పిలిచినను మీరు విన్పించుకొనుటలేదు.
నా పలుకులను మీరు ఆలకించుటలేదు.
25. మీరు నా హిత వచనములను త్రోసిపుచ్చితిరి. నా హెచ్చరికలను పాింపరైతిరి.
26. కనుక నేను మీ ఆపదలను చూచి నవ్వుదును.
మీ భయములనుగాంచి మిమ్ము వెక్కిరింతును.
27. ఇడుములు తుఫానువలె
మీ మీదికి దిగివచ్చినపుడు,
సుడిగాలివలె మిమ్మును కూలద్రోసినపుడు,
మీరు కష్టములలో చిక్కి దుఃఖార్తులయినపుడు
28. నా వద్దకు వత్తురుగాని
నేను మీ మొరను ఆలింపను.
నన్ను వెదకుదురుగాని నేను మీకు దొరకను.
29. మీరు విజ్ఞానమును ఆదరింపరైతిరి.
దేవునిపట్ల భయభక్తులు చూపరైతిరి.
30. నా ఉపదేశమును లెక్కచేయరైతిరి.
నా హెచ్చరికల పాింపరైతిరి.
31. కనుక మీరు మీ దుష్కార్యముల
ఫలమును అనుభవింతురు.
మీ దుష్టచేష్టలనే,
కుత్తుక నిండినవరకు భుజింతురు.
32. బుద్ధిహీనుల వెఱ్ఱిపనులు
వారికి మరణము తెచ్చిపెట్టును.
మూఢుల అవివేకము వారిని నాశనము చేయును
33. నా పలుకులు ఆలకించువాడు
సురక్షితముగా జీవించును.
కీడును తప్పి శాంతిసౌఖ్యములతో అలరారును”.