20 1. ద్రాక్ష సారాయమువలన మత్తెక్కి
వదరుబోతుతనము కలుగును.
మూర్ఖులు దానిని మితిమీరి సేవించుదురు.
2. రాజు ఆగ్రహము సింహగర్జనమువలె ఉండును.
రాజు కోపమును రెచ్చగొట్టువాడు
తనచావును తానే తెచ్చుకొనును.
3. అల్పుడెవడైన జగడము లాడగలడు.
తగాదాకు దూరముగా ఉండువాడే ఘనుడు.
4. ఋతువు వచ్చినను సేద్యము చేయనివాడు
పంటకాలమున ఏమియు కోసికోజాలడు.
5. నరుని హృదయములోని ఆలోచనలు
లోతుననున్న నీళ్ళవింవి.
కాని వివేకి వానిని వెలికి తీయగలడు.
6. ఎల్లరును మేము నమ్మదగిన వారలమనియే
చెప్పుకొందురు.
కాని యథార్ధముగా విశ్వసనీయులైన వారెందరు?
7. ధర్మవర్తనుడైన పుణ్యపురుషుని బిడ్డలు
నిక్కముగా ధర్మాత్ములు.
8. రాజు ధర్మాసనముమీద కూర్చుండి
దౌష్ట్యమును నిర్మూలనము చేయును.
9. నా హృదయమును శుద్ధిచేసికొింని,
నా పాపములు వదిలించుకొింనని
ఏ నరుడు చెప్పగలడు.
10. దొంగ తూకములకు, దొంగ కొలతలకు
పాల్పడువారిని ప్రభువు అసహ్యించుకొనును.
11. పసిబాలుడుకూడ తన చర్యలద్వారానే
తాను మంచివాడగునో కాదో తెలియజేయును.
12. వినెడి చెవిని, కనెడి కింని ప్రభువే ప్రసాదించెను.
13. నిద్రాప్రియుడు దరిద్రుడగును.
మేల్కొని పనికి పూనుకొనువానికి
కడుపునిండ తిండిదొరకును.
14. కొనువాడు అమ్మువానితో అయ్యా!
దీని వెల అధికమనును.
కాని అతడే నేను లాభసాి బేరముచేసితినని
పదిమందితో గొప్పలు చెప్పుకొనును.
15. బంగారమున్నది, ముత్తెములున్నవి.
కాని జ్ఞానవాక్కే సుభూషణము.
16. అన్యునికి హామిగా ఉన్నవాని బట్టలువిప్పి
ఆ అన్యుని తరపున కుదువసొమ్ముగా
ఉంచుకోవలెను.
17. అన్యాయముగా సంపాదించిన సొమ్ము
మొదట తీయగానే ఉండును.
కాని అటుతరువాత అది
ఇసుకను నమలినట్లుగానుండును.
18. నీ ప్రణాళికనుగూర్చి ఇతరులతో సంభాషింపుము. ముందుగా పథకము వేసికొనిగాని
యుద్ధమునకు పోరాదు.
19. వాచాలుడు రహస్యములను దాచలేడు.
వదరుబోతుకు దూరముగా ఉండుము.
20. తల్లిదండ్రులను శపించువాని దీపము
కిక చీకిలో ఆరిపోవును.
21. సులువుగా ఆర్జించినసొమ్ము కడన వంటబట్టదు.
22. అపకారికి ప్రత్యపకారము తలపెట్టవలదు.
ప్రభుని నమ్మినచో అతడే నిన్ను కాపాడును.
23. దొంగతూకములకు, దొంగ కొలతలకు
పాల్పడువారిని ప్రభువు అసహ్యించుకొనును.
24. నరుని నడిపించువాడు ప్రభువే!
కానిచో మనుజునికి త్రోవ ఎట్లు తెలియును.
25. దేవునికి కానుకలిత్తునని
బాస చేయకమునుపే జాగ్రత్త పడవలెను.
లేనిచో ప్రమాణముచేసి
పిదప చింతింపవలసివచ్చును.
26. తెలివిగల రాజు దుష్టులను సజ్జనులనుండి
వేరుపరచి కఠినముగా దండించును.
27. మనలోని అంతరాత్మ దేవుడు ప్టిెన దీపము.
అది మన అంతరంగమును పరిశీలించిచూచును
28. దయ విశ్వసనీయత రాజును కాపాడును.
అతని సింహాసనము దయమీదనే నిల్చును.
29. యువకులకు గౌరవము బలము.
వృద్ధులకు గౌరవము తలనెరపు.
30. తప్పు చేసినవానికి దెబ్బలు మంచిశిక్ష.
దెబ్బలవలన నరుల మనసులోని
బుద్ధులు మారును.