27 1. రేపి దినమునుగూర్చి
ప్రగల్భములు పలుకవలదు.
నేడేమి జరుగనున్నదో నీకు తెలియదు.
2. ఇతరులు నిన్ను పొగడవచ్చు.
కాని నిన్ను నీవే పొగడుకోగూడదు.
పరులు నిన్ను స్తుతింపవచ్చును.
కాని ఆత్మస్తుతి పనికిరాదు.
3. రాయి బరువు, ఇసుక భారము.
కాని మూర్ఖునివలన కలుగు బాధ
మరింత ఎక్కువ బరువు ఉండును.
4. కోపము, క్రూరత్వము వినాశప్రదమైనవి.
కాని అసూయ వానికంటె ఘోరమైనది.
5. బయికి కన్పింపనీయని ప్రేమకంటె
బహిరంగముగా మందలించుట మెరుగు.
6. మిత్రుడు క్టొి, గాయపరచినను పరవాలేదు. కాని శత్రువు ముద్దుప్టిెనను నమ్మకూడదు.
7. కడుపు నిండిన తరువాత తేనె కూడ సహింపదు. ఆకలిగా ఉన్నపుడు చేదు కూడ తీయగా ఉండును.
8. ఇంినుండి ఎక్కడికైన వెళ్ళినవాడు
గూినుండి ఎగిరిపోయిన పక్షితో సమానము.
9. సుగంధ ద్రవ్యములు, పరిమళతైలము
ముదము చేకూర్చును.
కాని ఆపదలు హృదయశాంతిని నాశనముచేయును.
10. నీ స్నేహితునిగాని, నీ తండ్రి స్నేహితునిగాని
విస్మరింపవలదు.
అపదలు వచ్చినపుడు
నీ సోదరునివద్దకు పరుగెత్తవలదు.
దూరమున ఉన్న సోదరునికంటె
దగ్గరున్న మిత్రుడు మెరుగు.
11. నాయనా! నీవు విజ్ఞానము నార్జించినచో
నా హృది సంతసించును.
నన్ను విమర్శించువారికి
ధైర్యముగా జవాబు చెప్పగలుగుదును.
12. జ్ఞాని ఆపదను ముందుగానే పసిక్టి
దానినుండి తప్పుకొనును.
కాని మూర్ఖుడు ఆపదలో కాలుబ్టెి
నాశనము తెచ్చుకొనును.
13. అన్యునికి హామీగా ఉన్నవాని బట్టలువిప్పి,
ఆ అన్యుని తరపున
కుదువసొమ్ముగా ఉంచుకోవలెను.
14. ప్రాతఃకాలమున బిగ్గరగా పొరుగువానిని
దీవించువాని దీవెన
వానికి శాపముగా యెంచబడును.
15-16. గయ్యాళి భార్య సణుగుడు,
వానరోజున ఎడతెగక
చినుకులు పడినట్లుగా ఉండును.
గాలిని ఆపుటగాని, చమురును గుప్పిట పట్టుటగాని
ఎంత కష్టమో ఆమె నోరు మూయించుటయు
అంత కష్టము.
17. ఇనుమునకు ఇనుముతో పదును ప్టిెనట్లే
నరుడు తోడినరుని పరిచయము వలన
సునిశితుడగును.
18. అత్తిచెట్టును పెంచినవాడు
దానిపండ్లను ఆరగించును.
యజమానుని సేవించు బంటుకు
ఘనత చేకూరును.
19. నీిలో ముఖము ఎట్లు ప్రతిబింబించునో
అట్లే ఒకని మనస్సు
ఎదుివాని మనస్సునకు కనబడును.
20. పాతాళలోకమునకు, నాశనమునకు తృప్తిలేదు.
నరుని ఆశలకును అంతములేదు.
21. వెండి బంగారములను కుంపిలో పరీక్షింతుము.
నరుని పొగడ్తద్వారా పరీక్షింతుము.
22. మూర్ఖుని రోిలోప్టిె దంచినను
వాని మూర్ఖత్వము తొలగింపజాలము.
23-27. నీ గొఱ్ఱెల మందలను జాగ్రత్తగా
చూచుకొనుము.
నీ పశులమందలను చక్కగా కాపాడుకొనుము.
సంపదలు కలకాలము నిలువవు.
రాజ్యములుకూడా శాశ్వతముగా కొనసాగవు.
మొదట నీ పొలములోని గడ్డి కోసికొనుము.
అది మరల పెరుగుచుండగా
కొండ ప్రక్కనున్న గడ్డి కోసుకొనుము.
గొఱ్ఱెల ఉన్నినుండి నీవు బట్టలు నేసికోవచ్చును.
కొన్ని మేకలను అమ్మి పొలము కొనవచ్చును.
మిగిలిన మేకల పాలు నీకును,
నీ కుటుంబమునకును,
నీ పనికత్తెలకునుగూడ సరిపోవును.