ఉపోద్ఘాతము:
పేరు: గ్రంథములోని ప్రధాన పాత్రధారుడు యోబు. యోబు అనగా ”నా తండ్రి/దేవుడు ఎక్కడ?” అని అర్థము. ఊజు దేశములో భక్తుడుగా, నీతిమంతుడుగా, సర్వసంపదలతో జీవించినాడు. విశ్వాసమునకు నాయకుడు (యెహెజ్కె. 14:14,20).
రచయిత: ఇతమిద్దముగా తెలియదు.
కాలము: బబులోను ప్రవాసానంతరము క్రీ.పూ. 5-4 శతాబ్దములలో వ్రాయబడినదని పండితుల అభిప్రాయము.
చారిత్రక నేపథ్యము: హీబ్రూ బైబులు గ్రంథములలో యోబు ప్రస్తావన పురాతనమైనదని భావిస్తారు. ఇందుకు కారణము యోబు ప్రస్తావన యెహెజ్కేలు (14:14,20) గ్రంథములో వుండడమే. యోబు 2:11 వచనములో యోబు ముగ్గురి స్నేహితులలో ఒకరైన తేమానువాసియైన ఎలీఫసు, ఆదికాండము 36:15-16, 33-34 వచనములలో సెరా కుమారుడగు యోబాబుకు మరియు ఎలీఫసుకున్న సంబంధమును బ్టి ఈ గ్రంథములోని ప్రధానపాత్రధారి యోబు మరియు యోబాబు ఒకరేయని కొందరు పండితుల ఊహాజనితమైన అభిప్రాయము. ఈ గ్రంథము హీబ్రూ జ్ఞానసాహిత్య గ్రంథక్రమములో మొదిది. మానవజీవితములో శ్రమ విడదీయరానిది. కావున అనాదికాలము నుంచి ప్రస్తుత కాలమువరకు ఈగ్రంథము అజరామరముగా ఆదరణ పొందు గ్రంథము. ఇది అతిప్రాచీన పదజాలముతోకూడిన ఉత్క ృష్టపద్యకావ్యము.
ముఖ్యాంశములు: ఈ గ్రంథములో ప్రధానాంశము అనాదిగా మానవమదిని తొలుచుచున్న -నీతిమంతునికి శ్రమలేల ప్రాప్తించును? అను సందేహనివృత్తికి సమాధానమును వెదకు ప్రయత్నము. పాతనిబంధన ముగింపు థలో పునరుత్థాన సిద్ధాంతము ఇంకను వికసించని థలో దేవుని యెడల భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలమని తేల్చిచెప్పెడి గ్రంథము. జీవము, మరణము మరియు మేలు, కీడు అన్నియు దేవునియొద్ద నుండే వచ్చునను పాతనిబంధన ఆలోచనాసరళిని ఆధారము చేసుకొని మానవుడు ఎి్ట స్థితిలోనైనను దేవుని వీడక ఆయనపైనే ఆధారపడి సహనము, ఓర్పు కలిగి బ్రతుకవలయుననియు, సర్వజ్ఞియు, సర్వశక్తిమంతుడును, సర్వాంతర్యామియును అయిన దేవుని ప్రాబల్యాన్ని మిడిమిడి జ్ఞాన సంపత్తుడైన మానవుడు గ్రహించలేడని కాబ్టి వినయముతో ఈ సమాజములో మెలగుటయే ఉత్తమమని ఈ గ్రంథము బోధించును. మానవుడు అన్ని శ్రమలను ఎదుర్కొనే స్థాయికి ఎదగాలని సూచిస్తుంది. శ్రమకు ఓర్పు ముఖ్య లక్షణము. కష్టాలు, శ్రమలు యెవరికైనా రావచ్చు. ఆర్థికస్తోమత, వయస్సు శ్రమలకు మినహాయింపుకాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుని దృష్టిలో యే మానవుడు కూడ నీతిమంతుడు కాడు. శ్రమ అనేది పాపఫలితమేకాక, ప్రాయశ్చిత్తముగా కూడా గణింపవచ్చును. మానవుల సహాయం దేవుని రక్షణకు ఎి్ట పరిస్థితుల్లోను సరితూగలేదు. కష్టాలలో, నిస్సహాయతలో దేవుని వైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతం.
క్రీస్తుకు అన్వయము: పునరుత్థానము గూర్చి లేదా మరణానంతరము ఏమి అనే ప్రశ్నలకు సంబంధించిన అంశమును చర్చించి (14:14) క్రీస్తు తెలిపిన పరమసత్యాలకు నాంది పలుకుతుంది. (చూడుము. యోహాను 11:25-26 – ”నాయందు విశ్వసించువారు చనిపోయినను జీవిస్తారు”) . యోబు చూపించిన మధ్యవర్తి (9:33), విమోచకుడు (19:25-27) క్రీస్తు. బాధలు, మరణం (హెబ్రీ 4:15) అనేవి దేవుని దృష్టితో చూస్తే అవి అవమానాలు, అపజయాలు కావు. దేవుడు మానవజీవితంలో అదృశ్యమవడము అంటూ వుండదు.