యోబు కోపము న్యాయమును ఎదిరింపజాలదు
18 1. తరువాత షూహా నివాసి బిల్దదు ఇట్లనెను:
2. ”ఓయీ! ఈ మాటలిక చాలింపరాదా?
నీవు మౌనముగానున్నచో
మేము మాటలాడుదుము.
3. మేమేమి జ్ఞానములేని పశువులమనుకొింవా?
మ్లాడలేని మూగ గొడ్డులమనుకొింవా?
4. కోపముతో నిన్ను నీవు ముక్కలు ముక్కలుగా
చీల్చుకొనినను నీ కొరకు
ఈ ప్రపంచము నిర్మానుష్యము కాబోదు.
దేవుడు నీ కొరకు కొండలను కదలింపబోడు.
5. దుష్టుని దీపము మాత్రము ఆరిపోవును.
దానిని మరల మ్టుింప సాధ్యముకాదు.
6. అతని గుడారములోని దీపము మసకలు కమ్మును
అతనికి వెలుగునిచ్చు వత్తి ఆరిపోవును.
7. అతడు బలము కూడగట్టుకొని అడుగులు
వేసినను కూలి పడిపోవును.
అతని కపటమే అతనికి వినాశము తెచ్చిపెట్టును.
8. అతడు నడిచి తనకుతానే ఉరులలో తగుల్కొనును.
స్వయముగా వెళ్ళి వలలో చిక్కుకొనును.
9. అతని మడమ వలలో తగుల్కొనగా
ఉచ్చు బిగుసుకొనిపోవును.
10. అతనిని పట్టుకొనుటకుగాను
కింకి కన్పింపని రీతిగా
నేలమీద ఉచ్చు పన్నుదురు.
అతని త్రోవలో బోనును అమర్తురు.
11. భయము అతనికి ఎల్లవైపుల పొంచి ఉండును. అది అడుగడుగున అతనిని వెన్నిం వెళ్ళును.
12. అతడు ఆకలితో అలమించును. వినాశనము
అతని దరిదాపులలోనే కాచుకొని ఉండును.
13. అతని దేహము రోగముచే క్షీణించగా
కాలుసేతులు పడిపోవును.
14. అతడు నమ్ముకొన్న తన ఇంట
సురక్షితముగా వసించుచుండగా
అచినుండి ఈడ్చుకొనిపోయి
క్రూరరాజైన మృత్యువు ఎదుట నిల్పుదురు.
15. అతని నింని గంథకముతో శుద్ధిచేసిన పిమ్మట
దానిలో అన్యులెవరైన వసింతురు.
16. అతని క్రింది వ్రేళ్ళు ఎండిపోవును,
పై కొమ్మలు వాడిపోవును.
17. భూమిమీద అతని పేరు మాసిపోవును.
ఆ మీదట అతని నామమెవరును స్మరింపరు.
18. అతనిని వెలుగునుండి చీకిలోనికి
న్టెివేయుదురు.
జీవవంతుల లోకమునుండి గిెంవేయుదురు.
19. అతని సంతానము నిలువదు.
అతని ఇంట అతని వారుసులెవరును
వసింపజాలరు.
20. తూర్పు దేశీయులు, పశ్చిమ దేశీయులు గూడ
అతడి దుర్గతినిగూర్చి విని భయముతో కంపింతురు
21. దేవుని లక్ష్యము చేయని దురాత్ముల్టి
అధోగతి పాలగుదురు.”