దేవుడు చేయి విడచినను భక్తుని విశ్వాసము

19 1. తరువాత యోబు ఇట్లనెను:

2.           ”ఎంతకాలము మీరు నన్నిట్లు హింసింతురు?  మీ పలుకులతో నన్నెంత దనుక వేధింతురు?

3.           తేపతేపకు మీరు నన్ను అవమానపరుచుచున్నారు

               నన్ను వేధించుచున్నామన్న

               ఇంకితజ్ఞానముకూడ మీకు లేదు.

4.           ఒకవేళ నేను తప్పు చేసిన

               ఆ తప్పు నాదేకాని మీది కాదుగదా?

5.           మీరు నాకంటె పుణ్యపురుషులము అనుకొనుచు,

               నా అపరాధముకుగాను

               నాకు ఈ గతి ప్టినదని ఎంచినచో

6.           నన్ను అణగద్రొక్కినవాడు దేవుడేనని తెలిసికొనుడు

               నన్ను బంధించుటకు వలపన్నినవాడు ఆయనే.

7.            నేను ఆయన దౌర్జన్యముగూర్చి మొరప్టిెనను, 

               వినువాడు లేడు.

               న్యాయముకొరకు ఆక్రోశించినను

               ఆలించువాడు లేడు.

8.           ఆయన నా త్రోవకు అడ్డము కల్పించెను.

               నా మార్గమును చీకితో కప్పివేసెను.

9.           నా పరువు మంటగలిపి,  

               నా పేరు ప్రఖ్యాతులు నాశనము చేసెను.

10.         నలువైపుల నుండి నన్నెదిరించి కూలద్రోసెను.

               నా ఆశను మొక్కనువలె పెరికివైచెను.

11.           ఆయన కోపము నా మీద రగుల్కొనినది.

               ఆయన నన్ను తన శత్రువుగా భావించెను.

12.          ఆయన సైన్యము నా మీదికి ఎత్తివచ్చి,

               నా నివాసమును ముట్టడించినది.

13.          ఆయన నా సోదరులు నన్ను

               వీడిపోవునట్లు చేసెను.

               ఇరుగుపొరుగువారు

               నన్ను పరిత్యజించునట్లు చేసెను

14.          నా బంధుమిత్రులు నన్ను విడనాడిరి.

15.          నా అతిథులు నన్ను విస్మరించిరి.

               నా పనికత్తెలు నన్ను పరునివలెను,

               అన్యదేశీయునివలెను చూచుచున్నారు.

16.          నా సేవకుని పిలిచినను పలుకుటలేదు.

               బతిమాలినను, నా మాట వినుటలేదు.

17.          నా భార్య నా శ్వాసములోని

               దుర్గంధమును భరింపజాలకున్నది.

               నా సొంత సోదరులే నన్ను చీదరించుకొనుచున్నారు

18.          నా పిల్లలే నన్ను అనాదరముతో చూచుచున్నారు.

               నేను కన్పించినపుడెల్ల

               కొంటెతనముతో నవ్వుచున్నారు.

19.          నా ఆప్తమిత్రులు నన్ను అసహ్యించుకొనుచున్నారు

               నేను అనురాగముతో చూచినవారు

               నాకెదురు తిరుగుచున్నారు.

20.        నా ఎముకలు నా చర్మమును,

               నా మాంసమును అంియున్నవి.

               పింబిగువున నా ప్రాణము నిలిచిఉన్నది.

21.          ప్రభువు హస్తము నన్ను దారుణముగా

               శిక్షించినది.

               జాలిచూపుడు మిత్రులారా!

               మీరు నా మీద జాలిచూపుడు.

22.         ప్రభువువలె మీరుకూడ

               నన్ను హింసింపవలయునా?

               ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా?

23-24. ఎవరైన నా ఈ పలుకులను

               గ్రంథమున వ్రాసి ఉంచినచో, 

               లేదా వానిని ఉలితో రాతిపై

               చెక్కి పదిలపరచినచో, ఎంత బాగుండును?

25.1 అయినను, నా విమోచకుడు సజీవుడనియు,

               తరువాత ఆయన భూమిమీద

               నిలుచుననియు నేనెరుగుదును.

26.        ఈ నా దేహము క్షీణించిపోయిన

               ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును.

27.         నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును.

               నాలో నా అంతర్యింద్రములు కృశించినవి.

28.        నాకు జరిగిన ఈ విషయములకు కారణము

               నాలోనే ఉన్నదనుకొని,

               మీరు ఆయనను ఎలా వెాండెదము?

               అని తలంచినయెడల

29.        మీరు ఖడ్గమునకు భయపడుడు.

               దేవుని శాపము మీపై రగుల్కొనినది.

               మీకు తీర్పుతీర్చువాడొకడున్నాడని

               మీరు గుర్తింపుడు.”

Previous                                               Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము