సర్వశక్తిమంతుడైన ప్రభువును గూర్చి గీతము

25 1. తరువాత షూహా దేశీయుడు

               బిల్దదు ఇట్లనెను:

2.           ”మహాశక్తిమంతుడైన ప్రభుని చూచి ఎల్లరును

               కంపింతురు.

               ఆయన ఉన్నతస్థలములో శాంతిని నెలకొల్పెను.

3.           ఆయన దూతగణముల నెవడు లెక్కింపగలడు?

               అతని జ్యోతి ప్రకాశింపని స్థలమెందైనగలదా?

4.           దేవుని దృష్టిలో ఏ నరుడైన

               పుణ్యాత్ముడుగా గణింపబడునా?

               నారికి జన్మించిన నరుడెవడైన

               విశుద్ధుడుగా పరిగణింపబడునా?

5.           ఆ ప్రభువు దృష్టిలో చంద్రునకు

               ప్రకాశము చాలదు.

               చుక్కలకు నిర్మలత్వము చాలదు.

6.           అి్టచో క్రిమియు, కీటకమునైన దుర్బల మానవుడు

               దేవుని దృష్టిలో ఏపాివాడు?”