సంభాషణల పర్యవసానము యోబు శోకగీతము
1. పూర్వపు భాగ్యస్థితి
29 1. యోబు ఇట్లు పలికెను:
2. ”ప్రభువు నాకు సంరక్షకుడై ఉండిన
ఆ పూర్వకాలము మరల వచ్చిన
ఎంత బాగుండును!
3. నాడు ప్రభువు జ్యోతి నా ముందట ప్రకాశించి,
చీకిలో నాకు త్రోవ చూపినది.
4. ప్రభువు నా ఇంికి సంరక్షకుడై ఉండి
నన్ను వృద్ధిలోనికి తెచ్చిన శుభదినములవి.
5. నాడు ప్రభువు నాకు బాసటయై ఉండగా,
నా బిడ్డలు నాచుట్టు తిరుగాడెడి వారు.
6. నా పశువులనుండి పాలు సమృద్ధిగా లభించెడివి
కొండలలోని నా ఓలివుతోటలనుండి
నూనె విస్తారముగా లభించెడిది.
7. నేను నగరద్వారము చెంతకుపోయి
పట్టణపాలకుల సభలో కూర్చుండినపుడు,
8. నన్ను చూడగనే యువకులు
గబగబ దాగుకొనెడివారు.
వృద్ధులు లేచి నిలుచుండెడివారు.
9. పుర ప్రముఖులు తమలోతాము
మాటలాడుట చాలించి
పెదవులను చేతితో కప్పుకొనెడి వారు.
10. నగరనాయకులు సంభాషణలు మాని
నోరు కదపక ఉండెడివారు.
11. నన్ను గూర్చి వినిన వారెల్లరు నన్ను కొనియాడిరి.
నన్ను గాంచిన వారెల్లరు నన్ను సన్నుతించిరి.
12. ఎందుకన నేను పేదలగోడు విని
వారిని ఆదరించితిని.
ఆదరువులేని అనాథలను ఆదుకొింని.
13. నాశనమునకు గురియైన వారు
నా చేయూతకు గాను నన్ను దీవించిరి.
నేను చేసిన మేలువలన వితంతువుల
హృదయము ఉల్లసించినది.
14. నేను న్యాయమునే వస్త్రముగా తొడిగితిని.
కనుక అది నన్ను ధరించినది.
ధర్మమునే చొక్కాయిగ, తలపాగగా ధరించితిని.
15. నేను గ్రుడ్డి వారికి కన్నులైతిని,
కుింవారికి కాళ్ళయితిని.
16. పేదసాదలకు తండ్రినయితిని.
అపరిచితుల మొరలు ఆలించితిని.
17. దుష్టుల కోరలు ఊడబెరికి,
వారి చేతికి చిక్కిన వారిని విడిపించితిని.
18. నేను దీర్ఘకాలము జీవించి, కడన నా ఇంటనే
సుఖశాంతులతో కన్ను మూయుదును అనుకొింని
కాని హంసవలె నేను దీర్ఘాయువు
కలవాడనగుదును.
19. నేను నీరందినదాక లోతుగా వ్రేళ్ళు జొన్పి
మంచున తడిసిన కొమ్మలతో అలరారు
మహావృక్షము విం వాడనైతిని.
20. నాకు ఎడతెగని ఘనత కలుగును.
నా చేతిలో నావిల్లు ఎప్పికిని
బలముగా వుండును.
211. సభలో నేను సలహాను ఇచ్చుచుండగా
సభ్యులెల్లరు మౌనము వహించి
సావధానముగా వినెడివారు.
22. నేను మ్లాడి ముగించిన పిదప
ఇకనెవ్వరు నోరెత్తిడి వారు కారు.
వాన చినుకులకువలె నా పలుకులకు
వారి యెడదలు నానెడివి.
23. వేసవిలో వానకొరకువలె ఎల్లరు నా పలుకుల కొరకు
కనిపెట్టుకొని ఉండెడివారు.
24. నిరుత్సాహముగానున్నవారు నేను
మందహాసము చేయగా,
నా ముఖకాంతిని కాంచి
ఉత్సాహము తెచ్చుకొనెడివారు.
25. నేను నాయకత్వము వహించి నిర్ణయములు చేసితిని
రాజు సైన్యమువలె,
నేనును ప్రజలను నడిపించితిని.
నిరాశ చెందినవారికి ఆశలు చేకూర్చిప్టిెతిని.