ప్రస్తుత దైన్య స్థితి

30 1.     కాని నాకంటె చిన్నవారే నన్నిపుడు

                              ఎగతాళి చేయుచున్నారు.

                              వారి తండ్రులెంతి అల్పులనగా,

                              నా మందలను గాసిన కుక్కలకు కూడా

                              వారు సాిరారు.

2.           వారి చేతుల బలము నాకేల ఉపయోగపడును?

               వారి పౌరుషము పోయినది.

3.           ఆకలితో నకనకలాడుచు,

               అడవుల వెంటబడి దుంపలేరుకొని తినినవారు,

4.           అడవిలోని పిచ్చిమొక్కలు పీకుకొని తిని,

               ఆహారమునకు ఉపయోగింపని

               వెఱ్ఱిగడ్డలతో కడుపు నింపుకొనినవారు.

5.           కేకలిడి దొంగలను తరిమివేసినట్లుగా

               ఎల్లరు వారిని తరిమిక్టొిరి.

6.           వారు కొండగుహలలోను

               శిఖరములచెంత త్రవ్విన బొరియలలోను వసించిరి

7.            అడవిలో మృగములవలె అరచిరి.

               పొదలలో గుంపులుగా దాగుకొనిరి.

8.           వారు ఊరు పేరు లేని బికారులు,

               చిల్లిగవ్వచేయని వారు.

               స్వదేశమునుండి తరిమివేయబడినవారు.

9.           అి్టవారిప్పుడు నన్ను గేలిచేయుచు పాటలు

               పాడుచున్నారు.

               నన్ను చులకనచేసి ఆడిపోసికొనుచున్నారు.

               నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను.

10.         వారు నన్ను అసహ్యించుకొని దూరముగా

               తొలగిపోవుచున్నారు.

               నా మొగము మీద ఉమ్మి వేయుచున్నారు.

11.           ప్రభువు నా బలము తగ్గించి నన్ను శిక్షించెను

               గనుక వారు రౌద్రముతో నా మీదికి వచ్చుచున్నారు

12.          గుంపుగా నా మీదికివచ్చి నన్ను తరుముచున్నారు

               నన్ను బెదిరించుటకై నా మీదికి ఎత్తివచ్చుచున్నారు

13.          ఇక నేను తప్పించుకొను మార్గము లేదు.

               వారిని అడ్డగించువారును లేరు.

14.          వారు నా కోటలో గండి పొడిచి లోనికి

               వచ్చుచున్నారు.

               ఇల్లు కూలినట్లుగా నా మీద పడుచున్నారు.

15.          భయములు నన్నావరించినవి.

               నా ధైర్యము గాలివలె ఎగిరిపోయినది.

               నా భద్రత మేఘము వలె తేలిపోయినది.

16.          నా ప్రాణము అవసానథకు వచ్చినది.

               నా బాధకు ఉపశమనము లేదు.

17.          రేయి నా ఎముకలలో నొప్పి పుట్టుచున్నది.

               నన్ను తొలిచివేయు వేదనకు అంతమే లేదు.

18.          ప్రభువు నా చొక్కాయి మెడప్టీ పట్టుకొని

               నా బట్టలను చిందరవందర చేసెను.

19.          ఆయన నన్ను బురదలోనికి పడద్రోసెను.

               నేను ధూళితో సమానమైతిని.

20.        ప్రభూ! నేను ఆర్తనాదము చేయగా నీవు పలుకవు

               నేను ప్రార్థన చేయగా నీవు ఆలింపవు.

21.          నీవు నా యెడల క్రూరముగా ప్రవర్తించుచున్నావు

               ద్వేషముబూని నన్ను ఘోరముగా

               హింసించుచున్నావు.

22.         నేను గాలికి కొట్టుకొని పోవునట్లు చేయుచున్నావు

               పెనుగాలిలో అల్లాడి పోవునట్లు చేయుచున్నావు.

23.         నేనును ఎల్లప్రాణులకు గమ్యస్థానమైన

               మృత్యువువాత పడవలెననికదా నీ కోరిక.

24.         పేదలు న్యాయము కొరకు ఆక్రోశించినపుడు, నేను వారికి అపకారము తలప్టిెతినా?

25.         బాధితులను చూచి నేను కన్నీరు కార్చలేదా?

               పేదలను చూచి కంటతడి పెట్టలేదా?

26.        నాకు ఆనందము చేకూరుననుకొనగా

               శ్రమలెదురైనవి

               నేను వెలుగును కాంతుననుకొనగా

               చీకట్లు అలముకొనినవి.

27.         నేను బాధలతో క్రుంగిపోవుచున్నాను,

               నాకు ఉపశాంతి లేదు.

               ప్రతిదినము వేదనలు అనుభవించుచున్నాను.

28.        నేను దుఃఖించుచున్నా ఎవరును

               నన్ను ఓదార్చుటలేదు.

               సభలో నిలుచుండి సాయముకొరకు

               చేతులు చాచుచున్నాను.

29.        నా ఆక్రందన నక్కల అరుపువలె

               విచారసూచకమైనది

               ఎడారిలోని ఉష్ట్రపక్షి యేడ్పులవలె

               నావి ఏకాకి యేడ్పులైనవి.

30.        నా చర్మము నల్లబడి,

               నా మీదనుండి ఊడిపోవుచున్నది.

               కాకతో నా ఎముకలు కాగిపోవుచున్నది.

31.          నా వీణ శోకగీతములకు సంసిద్ధమైనది.

               నా పిల్లనగ్రోవి విలాపగీతములకు ఆయత్తమైనది