యోబు తాను నిర్దోషినని ఒట్టు పెట్టుకొనుట
31 1. నేను కామదృష్టితో ఏ యువతిని
వీక్షింపగూడదని, నా నయనములతో
నేను నియమము చేసికొింని.
2. ప్రభువు మనకేమి బహుమతిని ఇచ్చును?
మన కార్యములకు ఆయనేమి
ప్రతిఫలము నొసగును?
3. దుర్మార్గులను నాశనముచేసి దుష్టులను
కడగండ్లపాలు చేయుటయేగదా ఆయన పని!
4. నేను చేయు కార్యములన్నిని ప్రభువు చూచును.
నేను వేయు అడుగులన్నిని
ఆయన పరిశీలించును.
5. నేను అసత్యబాటలు త్రొక్కితినా?
మోసమునకు ఒడిగ్టితినా?
6. ప్రభువు నన్ను నిర్దిష్టమైన తులాభారముతో
తూచెనేని నేను నిర్దోషినని తేలిపోవును.
7. నేను ధర్మమార్గమునుండి వైదొలగితినేని,
నా హృదయము చెడ్డను కోరుకొని యుండెనేని,
నా చేతులు పాపకార్యములకు పాల్పడెనేని,
8. నేను వేసిన పైరులు నాశనమగుగాక!
నేను పండించిన పంటను
ఇతరులు అనుభవింతురుగాక!
9. నేను పొరుగువాని భార్యను ఆశించి,
వాని గుమ్మము కడ పొంచియుింనేని,
10. నా భార్య పరునికి కూడు వండి,
వాని పడకమీద పండుకొనునుగాక!
11. నేను అి్ట హేయమైనపనికి పాల్పడియుింనేని, అది మహాదుష్టకార్యమై
నన్ను మరణశిక్షకు పాత్రునిచేసెడిది.
12. అది వినాశము తెచ్చిపెట్టు మహాగ్నియై
నా పైరులన్నిని తగులబెట్టెడిది.
13. నా సేవకుడుగాని, సేవకురాలుగాని
తమ గోడును విన్పించుకోగా,
నేను వారి మొరను ఆలించితిని.
14. లేదేని, నేను ప్రభువు ఎదుట ఎట్లు నిలువగలను?
ప్రభువు నాకు న్యాయము తీర్చునపుడు
నేను ఆయనకేమి జవాబు చెప్పగలను?
15. దేవుడు నన్ను ప్టుించినట్లే వారినికూడ ప్టుించెను
ఆయనే అందరిని మాతృగర్భమునుండి
ప్టుించుచున్నాడు.
16. నేను పేదలను ఏనాడును అనాదరము చేయలేదు
వితంతువును ఏనాడును కంటతడి పెట్టనీయలేదు
17. అనాథలకు పెట్టకుండ ఒంిగా భుజింపలేదు.
18. అనాథలు చిన్ననాినుండి నన్ను తండ్రివలె
భావింపగా నేను వారిని ఎల్లవేళల ఆదరముతో
చూచుచు వచ్చితిని.
19. పేదలు బట్టలులేక బాధపడుచుండగా,
కప్పుకొనుటకేమియు లేక వేదన పడుచుండగా,
20. నా మందలనుండి తయారయిన ఉన్ని బట్టలను
నేను వారికిచ్చెడివాడను.
వారు నన్ను హృదయపూర్వకముగా దీవించెడివారు
21. న్యాయసభలో సభ్యులు
నన్నే సమర్థింతురన్న ధీమాతో
నేను తండ్రిలేని వారికి అపకారము చేసి
యుింనేని,
22. నా ముంజేతులు మోచేతి కడకు విరిగిపోవుగాక!
నా భుజములు జారిపడునుగాక!
23. దేవుని శిక్షకు వెరచువాడను గనుక,
నేన్టి చెయిదమునకు పాల్పడి ఉండను.
24. నేను బంగారమును నమ్ముకోలేదు.
మేలిమి బంగారముమీద ఆధారపడలేదు.
25. నా చేతులు కూడబ్టెిన మహాసంపదలుచూచి
నేను ఏనాడును మురిసిపోలేదు.
26. దీప్తిమంతముగా మెరయు
సూర్యబింబమును జూచిగాని,
సుందరముగా వెలుగు
చంద్రబింబమును గాంచిగాని
27. హృదయ ప్రలోభమునకు గురియై
వాికి నేను చేతులెత్తి దండము పెట్టలేదు.
28. అట్లు చేయుట క్షమింపరాని నేరము
అది సర్వోన్నతుడైన ప్రభువును
నిరాకరించు చెయిదము.
29. నా విరోధుల కడగండ్లు చూచి
నేను సంతసింపలేదు.
వారికి కీడు వాిల్లగా పొంగిపోలేదు.
30. వారు చావవలెనని శాపవచనములు పలికి
నా నాలుకతో పాపము మూటగట్టుకోలేదు.
31. నేను ఎల్లప్పుడు అతిథులకు ఆతిథ్యము
ఇచ్చెడివాడనని ‘నేను ప్టిెన భోజనము తిని
తృప్తినొందని అతిథులు లేరు’ అని
వారికెల్లరికిని తెలియును.
32. వీధులలో రేయి విడిది చేయవలసిన అవసరము
లేకుండ బాటసారులను ఏ ప్రొద్దు అయినను
నా ఇంికి ఆహ్వానించెడివాడను.
33. నేను ఇతరులవలె నా దోషములను
కప్పిపెట్టుకోలేదు.
నా పాపములను నా యెదలోనే
పదిలముగా దాచుకోలేదు.
34. ఇతరులు ఏమనుకొందురో అని భయపడలేదు.
జనుల అపవాదమునకు వెరచి మౌనము
వహింపనులేదు.
ఇల్లు కదలక ఉండనులేదు.
35. నా పలుకులు ఆలించువారెవరును లేరా?
ఇదిగో నా చేవ్రాలు.
ఇదిగో నా ప్రత్యర్థికి
వ్రాయవలసిన ఫిర్యాదు పత్రము,
ప్రభువు నాకు బదులు చెప్పును గాక!
36. నా ప్రత్యర్థి నా నేరములను వ్రాసి చూపెనేని,
నేను నిశ్చయముగా వానిని
నా భుజములకు కట్టుకొందును.
తలపాగావలె నా శిరస్సునకు చుట్టుకొందును.
37. నేను చేసిన కార్యములెల్ల
నా ప్రతిపక్ష వ్యక్తికి ఎరిగింతును.
తన ఎదుట ధైర్యముతో తలయెత్తుకొని
ఠీవితో నిల్తును.
381. నేను ఇతరుల పొలమును ఆక్రమించుకోగా,
ఆ పొలము నన్ను త్టిపోసి,
కన్నీితో తన నాగిచాళ్ళను నింపుకొనెనేని,
39. ఆ పొలమున పండిన పంటను నేను అనుభవించి
దానిని పండించిన రైతుల కడుపు క్టొితినేని,
40. ఆ పొలమున నేడు గోధుమలకు మారుగా
ముళ్లపొదలును, యవపైరుకు మారుగా
కలుపు మొక్కలు ఎదుగునుగాక!
(ఇంతితో యోబు పలుకులు ముగిసినవి)