యోబు అహంకారము

33 1.      యోబూ! నీవు శ్రద్ధతో నా పలుకులు

                              ఆలింపుము. నా అభిప్రాయములను

                              సాంతముగా వినుము.

2.           నేను నోరువిప్పి నా మనసులోని భావములు,

               వెలిబుచ్చుటకు సంసిద్ధముగా ఉన్నాను.

3.           నేను చిత్తశుద్ధితో మ్లాడెదను.

               సత్యవాక్యములనే పలికెదను.

4.           మహోన్నతుని ఆత్మ నన్ను సృజించినది.

               నాకు ప్రాణమొసగినది ఆ ఆత్మయే.

5.           నీకు చేతనైనచో

               నా పలుకులను ఖండింపుము.

               నీ వాదములు సిద్ధము చేసికొనుము.

6.           నీవును నేనును దేవుని యెదుట సరిసమానమే.

               మనమిరువురము ఒక్క మ్టినుండియే ప్టుితిమి.

7.            కనుక నీవు నన్ను చూచి భయపడనక్కరలేదు.

               నేను వంచనతో నిన్ను ఓడించువాడను కాను.

8.           నీ మాటలు నేను వింని.

               నీ పలుకులు నా చెవినబడినవి.

9.           ‘నేన్టెి పాపము ఎరుగని నిరపరాధిని.

               నిర్మలమైన జీవితము గడపు నిర్దోషిని.

10.         అయినను దేవుడు నా మీద తప్పులు మోపి

               నన్ను తన శత్రువుగా భావించుచున్నాడు.

11.           నా పాదములను గుదిబండతో బంధించి,

               నా చేతలన్నిని జాగ్రత్తగా

               గమనించుచున్నాడు’ అని నీవింవి.

12.          నా మాటలు వినుము. నీవిట్లు పలుకుట తప్పు.

               దేవుడు నరుని కంటె గొప్పవాడు.

13.          దేవుడు నీ ఫిర్యాదులకు జవాబు చెప్పలేదని

               నీవు ఆయనమీద తప్పు మోపుదువా?

14.          ప్రభువు నరులతో మాిమాికి

               మ్లాడుచునే యుండును.

               కాని ఆయన  పలుకులనెవడు విన్పించుకోడు.

15.          రాత్రిలో నరుడు పడకమీద పరుండి

               నిద్రించునపుడు కలలు,

               దర్శనముల ద్వారా దేవుడు మ్లాడును.

16.          అవును, దేవుడు తన హెచ్చరికలను విన్పించును.

               ఆయన మందలింపు లాలించి నరులు

               భయపడుదురు.

17.          నరులను పాపమునుండి వారించుటకును

               వారి పొగరు అణచుటకును

               దేవుడు వారితో సంభాషించును.

18.          చావు వాతబడి మృతలోకము

               చేరుకొనుటయను దుస్థితి నుండి నరుని

               కాపాడవలెననియే అతని కోరిక.

19.          దేవుడు నరుని వ్యాధిపాలు గావించి,

               అతని శరీరమును బాధతో నింపి

               అతనికి బుద్ధిచెప్పును.

20.        రోగికి ఆకలిచెడును.

               మధురాహారముగూడ రుచింపదు.

21.          అతని శరీరము కృశింపగా

               ఎముకల గూడు బయటపడును.

22.         అతడు మృతలోకము చేరుటకు సంసిద్ధుడగును.

23.         అప్పుడు నరులకు వారి బాధ్యతలను జ్ఞప్తికితెచ్చు

               వేలాది దేవదూతలలో ఒకడు మధ్యవర్తిగా

               విచ్చేసి ఆ రోగిచెంత జేరి అతనికి సహాయపడును

24.         ఆ దేవదూత రోగిపై జాలిబూని

               ”ఇతనిని శిక్షనుండి విడిపింపుము.

               మృతలోక యాత్రనుండి ఇతనిని తప్పింపుము.

               ఇతనిని విడిపించుటకు వలసిన

               ప్రాయశ్చిత్తము నాయొద్ద ఉన్నది”

               అని ప్రభువునకు మనవి చేయును.

25.         అప్పుడు ఆ రోగి మరల యవ్వన ప్రాభవమును

               బడసి యువకునివలె దృఢగాత్రుడగును.

26.        అప్పుడు దేవుని ప్రార్థింపగా ప్రభువతని

               మొరవినెను.

               సంతోషముతో దేవుని సేవింపగా

               ప్రభువు అతనికి అభ్యుదయము దయచేసెను.

27.         ఆ రోగి ‘నేను ధర్మమును విడనాడి

               పాపము చేసితిని

               అయినను ప్రభువు నన్ను

               మన్నించి వదలివేసెను.

28.        దేవుడు నన్ను మృతలోకము నుండి తప్పించెను

               గనుక నేనింకను బ్రతికి బట్టక్టి

               తిరుగుచున్నాడను’ అని

               బహిరంగముగా చాిచెప్పుకొనును.

29.        నరునిక్టి ఉపకారమును దేవుడు

               మాిమాికి చేయును.

30.        ప్రభువు నరుని చావునుండి తప్పించి

               తన జీవనజ్యోతిని అతనిపై ప్రకాశింపజేయును.

31.          యోబూ! నా పలుకులను

               సావధానముగా వినుము.

               మధ్యలో నాకు అడ్డురాక జాగ్రత్తగా ఆలింపుము.

32.         కాని నీవేమైన చెప్పదలచుకొన్నచో చెప్పుము.

               నిన్ను నిరపరాధిగా గణించుటకు

               నేను సిద్ధముగనే  యున్నాను.

33.         కాని అి్టదేదియు లేనిచో మౌనముగా

               నా మాటలు వినుము.

               నేను నీకు విజ్ఞానము బోధింతును.