39 1. కొండమేకలు ఎప్పుడు పిల్లలను ఈనునో
నీ వెరుగుదువా? అడవి జంతువులు
పిల్లలనుపెట్టుట నీవు చూచితివా?
2. అవి ఎన్ని మాసములు చూలు మోయునో
ఎప్పుడు పిల్లలను పెట్టునో నీకేమైనా తెలియునా?
3. ఆ జంతువులు నేలకు మోకాళ్ళూని పిల్లలను
ఈను వివరము నీకేమైన తెలియునా?
4. ఆ పిల్లలు అడవిలో పెరిగి పెద్దవగును.
అవి తమ తల్లుల దగ్గరికి మరల తిరిగిరావు.
5. అడవి గాడిదలకు స్వేచ్ఛ నొసగి
అవి యథేచ్ఛగా తిరుగునట్లు చేసినదెవరు?
6. నేను వానికి ఎడారిని నివాసభూమిగా చేసితిని.
చవి నేలను వాసస్థలముగా నియమించితిని.
7. అవి రణగొణధ్వనిచేయు నగరముల చెంతకురావు
నరులకు లొంగి పనిచేయవు కూడ.
8. ఆ మృగములు కొండలలో మేయును.
అచట పచ్చని మొక్కల కొరకు గాలించును.
9. మనుబోతు నీకు పనిచేయునా?
అది రేయి నీ కొట్టమున నిల్చునా?
10. నీవు దాని మెడకు త్రాడుగ్టి
దానిచే పొలము దున్నింపగలవా?
11. అది మహాబలముగల జంతువైనను
దానిచే చాకిరి చేయించుకోగలవా?
12. అది నీ పొలమున పండినపంటను,
నీ కళ్ళమున త్రొక్కించిన ధాన్యమును
మోసికొని వచ్చునా?
13. నిప్పుకోడి రెక్కలు రెపరెప కొట్టుకొనిన
అది బెగ్గురు పక్షివలె ఎగురజాలదుగదా?
14. అది నేలమీదనే గ్రుడ్లను వదలివేయగా
భూమిలోని ఉష్ణమే వానిని పొదుగును.
15. ఏ ప్రాణి పాదమైన ఆ గ్రుడ్లను త్రొక్కివేయునని
గాని, ఏ వన్యమృగమైన వానిని
నలగద్రొక్కునని గాని ఆ పక్షికి తెలియదు.
16. అది ఆ గ్రుడ్లు తనవి కావు అన్నట్లు
క్రూరముగా ప్రవర్తించును.
తన శ్రమ వ్యర్థమగుచున్నదే అనియు విచారింపదు
17. నేనా పక్షికి విజ్ఞానము నీయనైతిని.
దానిని తెలివితక్కువ దానినిగా సృజించితిని.
18. కాని ఆ నిప్పుకోడి పరుగెత్తుటకు పూనుకొనినచో
గుఱ్ఱమును దాని రౌతులనుగూడ పరిహసించును
19. గుఱ్ఱములకు మహాబలమునొసగి
వాని మెడలమీద పొడుగాి జూలును
నిల్పినది నీవేనా?
20. అవి మిడుతలవలె ఎగిరి తమ సకిలింపులతో
నరులను భయపెట్టునట్లు చేసినది నీవేనా?
21. అవి ఉత్సాహముతో లోయలగుండ
కాలు దువ్వుచు పోవును.
బలముతో యుద్ధరంగమున ఎగిరి దూకును.
22. గుఱ్ఱములు భయమును
పరిహాసము చేయును.
అవి కత్తినిచూచి వెనుకకు మరలవు.
23. రౌతులు వానిమీద మోసికొనిపోవు బల్లెములు,
ఈటెలు తళతళ మెరయుచు,
ఒకదానితో నొకి ఒరసి కొనుచుండగా
24. అవి ఉద్రేకముతో పొంగిపోవుచు,
యోజనములు నడచును.
భేరీనాదము విన్పించినచో ఇక
అవి మనమాట వినవు.
25. బాకానాదము వినినపుడెల్ల అవి సకిలించి దూరమునుండే పోరును పసికట్టును.
సైన్యాధిపతుల ఆర్భాటమును ఆలించును.
26. రెక్కలు విప్పి దక్షిణదిక్కుగా ఎగురు డేగకు
ఆకాశగమనమును నేర్పినది నీవేనా?
27. గండభేరుండము పర్వతశిఖరములలో
గూడు కట్టుకొనునది నీ ఆజ్ఞను బ్టియేనా?
28. అది శిఖరాగ్రములపై గూడు కట్టుకొనును.
మొనలుదేరిన కొండకొమ్ములపై
నివాసము చేయును
29. అచినుండి అది యెరకొరకు పరికించి చూచును.
దాని దృష్టి చాల దూరము వరకు ప్రసరించును.
30. అది శవములపై వాలును,
తన పిల్లలను నెత్తుితో పోషించును.”