40 1.      యావేదేవుడు యోబుతో మరియు

                              ఇట్లనెను:

2.           ”ఆక్షేపణలు చేయుజూచువాడు

               సర్వశక్తిమంతుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు

               ఇపుడు ప్రత్యుత్తరమీయవలయును.”

3.           అంతట యోబు ప్రభువుతో ఇట్లనెను:

4.           ”చిత్తగించుము, నేను నీచుడను,

               నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను?

               నా నోిమీద నా చేతిని ఉంచుకొందును.

5.           నేనొకసారి మాడితిని మరల మ్లాడను.

               ఒక్కసారి కంటె అధికముగా సంభాషింపను.”

రెండవ సంభాషణము

దేవుడు దుష్టత్వమును 

తన ఆధీనమున ఉంచుకొనును

6.           ప్రభువు సుడిగాలిలోనుండి యోబుతో ఇట్లు పలికెను

7.            ”ఓయి! నీవు ధైర్యముతో నిలిచి

               నా ప్రశ్నలకు జవాబు చెప్పుము.

8.           నేను న్యాయము పాింపలేదని

               నీవు రుజువు చేయుదువా? నాది తప్పని,

               నీది ఒప్పని నిరూపింతువా?

9.           నీవు నాయంతి బలాఢ్యుడవా?

               నీ వాక్కు నా వాక్కువలె గర్జింపగలదా?

10.         అట్లయినచో గౌరవప్రతిష్ఠలతో నిలువుము.

               నీ వైభవప్రాభవములను చూపింపుము.

11.           నీ కోపమును ప్రజ్వలింపజేసి,

               గర్వాత్ములను మన్ను గరపింపుము.

12.          వీక్షణ మాత్రమున వారి పొగరు అణగింపుము.

               దుష్టులను ఉన్నవారినున్నట్లు నాశనము చేయుము

13.          ఆ దుర్మార్గులనందరిని నేలలో పాతిపెట్టుము

               వారినెల్లరిని మృతలోకమున

               బంధించియుంచుము

14.          నీ దక్షిణహస్తమే నిన్ను రక్షించినదని,

               నీవే స్వయముగా విజయము

               సాధించితివని నేను ఒప్పుకొందును.

15.          నీి గుఱ్ఱమును అవలోకింపుము.

               అది ఎద్దువలె గడ్డిమేయును.

16.          దాని శక్తి దాని నడుములో ఉన్నది.

               దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది.

17.          దాని తోక దేవదారు కొయ్యవలె బిరుసుగానుండును

               దాని తొడలనరములు దిట్టముగా

               సంధింపబడి యున్నవి.

18.          దాని ఎముకలు ఇత్తడివలె గ్టిగానుండును.

               కాళ్ళు ఇనుప కడ్డీలవలె నుండును.

19.          అది దేవుడు సృష్టించిన ప్రాణులలో గొప్పది.

               దానిని సృష్టించిన దేవుడే ఖడ్గమును దానికి

               ఇచ్చుటలో దేవుని సృష్టిలోని

               వైవిధ్యమునకు నాంది అయ్యెను.

20.        పర్వతములలో దానికి మేత లభించును.

               అరణ్య జంతువులన్ని అచట ఆడుకొనును.

21.          కనుక అది నీిలోని ముండ్లపొదలలో

               ఉండిపోవును.

               మడుగులలోని తుంగల మరుగున దాగుకొనును.

22.         జలములలోని ముండ్లపొదలు దానికి నీడనిచ్చును

               నీి ఒడ్డున ఎదుగు చెట్లనీడ దానిని కాపాడును.

23.         నదులు పొంగి పారినను దానికి భయము లేదు.

               యోర్దానునది తన నెత్తిన విరుచుకొనిపడిన

               అది జంకదు.

24.         ఆ మృగము కనులుగప్పి దానిని ఎవరైన

               పట్టగలరా?

               దాని ముట్టెనెవరైన బోనులో బంధింపగలరా?