పుస్తకపుచుట్టను గూర్చిన దర్శనము
2 1. ఆ వాణి నాతో, ”నరపుత్రుడా! నీవు లేచి నిలు చుండుము. నేను నీతో మ్లాడవలయును” అనెను.
2. ఆ వాణి నాతో మ్లాడుచుండగా దేవునిఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకిలేపి నిలువబెట్టెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను: 3. ”నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటుచేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులుకూడ అటులనే చేసిరి.
4. వారు మొండి వారు. నన్ను లెక్కచేయనివారు. యావే ప్రభుడనైన నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును.
5. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను, వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడనియైనను గ్రహింతురు.
6. కాని ”నరపుత్రుడా! నీవు వారికిని, వారి మాటల కును భయపడవలదు. వారు నిన్నెదిరింతురు. నిన్ను నిరాకరింతురు. నీకు ముళ్ళపొదలలో తిరుగుతున్న ట్లుండును. నీకు తేళ్ళమీద కూర్చున్నట్లుగా నుండును. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకును, వారి మాటలకును భయపడవలదు.
7. వారు విన్నను, విన కున్నను నీవు నా పలుకులను వారికి తెలియచేయుము. వారు తిరుగుబాటు చేయువారు.
8. నరపుత్రుడా! నా మాటలు వినుము. నీవు వారివలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము.”
9. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపుచుట్టను పట్టుకొనిన చేయి నా చెంతకు చాపబడెను.
10. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులను మహావిలాపము, రోదనము, దుఃఖములతోగూడిన మాటలు వ్రాయ బడియుండెను.