యెరూషలేము ప్రజల పాపములను గూర్చిన దర్శనము

8 1. అంతట ఆరవయేడు ఆరవనెల ఐదవరోజున యూదానాయకులు మా ఇంట నా ప్రక్కన కూర్చుండి యుండిరి. దిఢీలున ప్రభువు హస్తము నన్నావేశించెను.

2. నేను పైకిచూడగా అగ్నిమయమైన నరాకృతి కనిపించెను. ఆయన నడుము నుండి క్రింది వరకును అగ్నివలెనుండెను. నడుమునకు పైభాగము తోమిన కంచువలె మెరయుచుండెను.

3. ఆయన చేతి విం దానిని చాచి నా శిరోజములను పట్టుకొనెను. ఆ దర్శనమున దేవుని ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్ను పైకి లేపి యెరూషలేమునకు కొనిపోయెను. నన్ను  లోపలి ఆవరణమున ఉత్తరదిక్కునకు చూచు ద్వారపు లోపలి తలుపు వద్దకు చేర్చెను. అచట దేవునికి కోపము రప్పించు విగ్రహము ఒకటున్నది.

4. అచట నేను పూర్వము లోయలో చూచినట్లే, యిస్రాయేలు దేవుని తేజస్సును చూచితిని.

5. ఆయన నాతో ”నరపుత్రుడా! నీవు ఉత్తర దిక్కుకు చూడుము” అని అనెను. నేనట్లే చూడగా ఉత్తరము వైపున బలిపీఠమున్న ద్వారములోపల దేవునికి కోపము రప్పించు విగ్రహము కనిపించినది.

6. ఆయన నాతో ”నరపుత్రుడా! ఈ ప్రజలేమి  చేయుచున్నారో చూచితివా! యిస్రాయేలీయులు ఇచటెంత హేయమైన పనులు చేయుచున్నారో గమ నింపుము. వారు నా మందిరమునుండి నన్ను తరిమి వేయజూచుచున్నారు. నీవింకను ఘోరమైన కార్య ములు చూతువు” అనెను.

7. ఆయన నన్ను ఆవరణ ద్వారమువద్దకు కొని పోయెను. అచట గోడలో ఒక రంధ్రము కన్పించెను.

8. ఆయన నరపుత్రుడా! నీవు ఈ గోడలో కన్నము వేయుము అనెను. నేనట్లే చేయగా అచట ఒక ద్వారము కనిపించెను.

9. ఆయన నీవు లోనికి వెళ్ళి ప్రజలు చేయు దుష్కార్యములు, హేయపు పనులు చూడుము అనెను.

10. నేనట్లే లోనికి వెళ్ళిచూచితిని. అచట గోడపై ప్రాకెడి జంతువులు, హేయమైన మృగములు, యిస్రాయేలీయులు పూజించు విగ్రహములు మొదలైన చిత్రములు గీయబడియుండెను.

11. అచట యిస్రా యేలు పెద్దలు డెబ్బదిమందిమధ్య షాఫాను కుమారు డగు యాసన్యా నిలిచియుండెను. ప్రతివాడు ధూప కలశము పట్టుకొనియుండెను. సాంబ్రాణి పొగ చిక్కి మేఘమువలె పైకి లేచుచుండెను.

12. ఆయన నాతో ”నరపుత్రుడా! యిస్రాయేలు పెద్దలు రహస్యముగా ఏమి చేయుచున్నారో చూచితివా! వారు చీకిలో తమ విగ్రహపు గదులలో పూజలు చేయుచున్నారు. ప్రభువు మనలను చూడడు. ఆయన ఈ దేశమును పరి త్యజించెను అని చెప్పుకొనుచున్నారు” అని అనెను.

13. ఆయన నాతో నీవు ఇంకను ఘోరమైన కార్యములు చూతువు అని చెప్పెను.

14. ఆయన నన్ను దేవాలయము ఉత్తరద్వారమునొద్దకు కొని పోయెను. అచట స్త్రీలు తమ్మూసు దేవరమృతికిగాను శోకించుచు కూర్చుండియుండిరి.

15. ఆయన నాతో ”నరపుత్రుడా! నీవాకార్యము చూచితివికదా! అంతకంటె ఘోరమైన కార్యమును కూడ చూతువు” అని చెప్పెను.

16. అంతట ఆయన నన్ను దేవాలయము లోపలి ఆవరణములోనికి కొని పోయెను. అచట ఆలయద్వారముచెంత వసారాకు, బలిపీఠమునకు మధ్య ఇరువది ఐదుగురు నరు లుండిరి. వారు తమ వీపులను దేవాలయము వైపున కును, మొగములను తూర్పునకు త్రిప్పి సూర్యుని ఆరాధించుచుండిరి.

17. అంతట ఆయన నాతో ”నీవు ఆ కార్యమును చూచితివికదా! యూదీయుల్టి హేయమైన కార్య ములు చేయుటతోను, దేశమును హింసతో నింపుట తోను సంతృప్తి చెందుటలేదు. ఈ కార్యములను ఈ దేవాలయములోనే చేసి నా కోపమును రెచ్చగొట్టు చున్నారు. కొమ్మను1 ముక్కుముందు పెట్టుకొని నన్ను అవమానించుచున్నారు.

18. కావున నా కోపము పెచ్చుపెరుగుచున్నది. నేను వారిని వదలను. వారిపై దయచూపను. ఎంత పెద్దగా అరచినను నేను వారి మొరలు ఆలింపను” అనెను.