ప్రభువు తేజస్సు దేవాలయమును విడనాడుట
10 1. నేను ఆ కెరూబుల తలపై గల విశాల మండలము విందానివైపు చూచితిని. వానిపై నీలమణి సింహాసనము వింది ఒకి కనిపించెను.
2. ఆయన నారబట్టలు తాల్చిన వ్యక్తితో ”నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి ఆ కెరూబుల నడుమనున్న నిప్పుకణికలను నీ చేతుల నిండా తీసికొని నగరముపై చల్లుము” అని చెప్పెను. నేను చూచుచుండగనే అతడు లోనికివెళ్ళెను.
3. అతడు వెళ్ళినపుడు ఆ కెరూబులు దేవాలయ మునకు దక్షిణదిక్కున నిలిచియుండెను. లోపలి ఆవరణమును మేఘము క్రమ్మియుండెను.
4. అంతట ప్రభువు తేజస్సు ఆ కెరూబుల మీదినుండి లేచి దేవాలయ ప్రవేశస్థలము వద్దకు వెళ్ళెను. అపుడు మేఘము దేవాలయమును క్రమ్మెను. ఆవరణము ప్రభువు తేజస్సుతో నిండిపోయెను.
5. ఆ కెరూబులు తమ రెక్కలతో చేసిన చప్పుడు వెలుపలి ఆవరణము వరకు వినిపించెను. ఆ చప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువువాక్కుల ధ్వానమువలె ఉండెను.
6. ప్రభువు నారబట్టలు ధరించిన వ్యక్తిని ”నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల నడుమనుండి అగ్నికణములను తీసికొనుము” అని చెప్పగా అతడు వెళ్ళి చక్రములచెంత నిలుచుండెను.
7. అప్పుడు ఆ కెరూబులలో ఒకడు చేయిచాచి తమ మధ్యనున్న నిప్పుకణికలను తీసికొని నారబట్టలు తాల్చిన వ్యక్తికి ఇచ్చెను. అతడు వానిని తీసికొని బయలుదేరెను.
8. ప్రతి కెరూబు రెక్కల క్రింద మనుష్య హస్త ముల వింవి ఉండుటను నేను చూచితిని.
9-10. ప్రతి కెరూబు ప్రక్కన ఒక్కొక్కి చొప్పున సమానా కారము గల చక్రములు నాలుగు కన్పించెను. అవి గోమేధికమువలె మెరయుచుండెను. అవి ఒక దానిలో ఒకి ఇమిడియున్నట్లుగా ఉండెను.
11. ఆ ప్రాణులు కదలినప్పుడు ప్రక్కకు తిరుగకయే ఏ దిక్కునకైన సాగిపోవుచుండెను. అవి అన్నియు కలిసి ప్రక్కకు తిరుగకయే తల ఏ తట్టుతిరుగునో అవి ఆ తట్టునకే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక కదలు చుండెను.
12. వాని దేహములు, వీపులు, చేతులు, రెక్కలు, చక్రములు కన్నులతో నిండియుండెను.
13. ఆ చక్రములధ్వని నా చెవులలో రింగున మ్రోగెను.
14. ఒక్కొక్క జీవికి నాలుగు మొగములుండెను. మొదిది కెరూబుముఖము, రెండవది మనుష్య ముఖము, మూడవది సింహముఖము, నాలుగవది గరుడముఖము.
15. అవి నేను కెబారు నదిచెంత చూచిన ప్రాణులే.
16. అవి పైకిలేచి ముందునకు కదలినపుడు చక్రములు కూడ వానితోపాటు కదలు చుండెను. అవి పైకి లేచుటకు రెక్కలు విప్పినపుడు చక్రములును వానితోపాటు కదలుచుండెను.
17. ఆ జీవులు ఆగినపుడు చక్రములు ఆగెను. అవి కదలినపుడు చక్రములుకూడ కదలెను. అవి వానిని నడిపించు చుండెను.
18. ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థాన మును వదలి ఆ జీవుల మీదికి వచ్చెను.
19. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీది నుండి పైకిలేచెను. చక్రములును వానితోపాటు కదలెను. అవి దేవాలయపు తూర్పుద్వారము వద్ద ఆగెను. ప్రభువు తేజస్సు వానిపైనుండెను.
20. పూర్వము కెబారునది చెంత యిస్రాయేలు దేవుని క్రింద నాకు కనిపించిన జీవి ఇదియేనని నేను గ్రహించి తిని. అవి కెరూబులని గుర్తుప్టితిని.
21. వానిలో ప్రతిదానికి నాలుగు మొగములు నాలుగు రెక్కలు ఉండెను. ప్రతి రెక్కక్రింద మనుష్య హస్తము వింది ఉండెను.
22. వాని మొగములు నేను కెబారు నదిచెంత చూచిన మొగాలవలె ఉండెను. అవి తిన్నగా ఆయా ముఖములతట్టు ముందునకు నడచి పోవుచుండెను.