యెరూషలేము దోషి

11 1. ప్రభుని ఆత్మ నన్ను పైకిలేపి దేవాలయపు తూర్పుద్వారము వద్దకు కొనిపోయెను. అచట ద్వారము నొద్ద ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడిరి. వారిలో అస్సూరు కుమారుడైన యాజన్యాయు, బెనాయా కుమారుడగు పెల్యాయు నుండిరి. వీరిద్దరును ప్రజా నాయకులు.

2. ప్రభువు నాతో ”నరపుత్రుడా! ఈ నగరము వంటపాత్రమువలెను, మనము దానిలోని మాంసము వలెను ఉన్నామనియు, సమయము ఇంకనూ ఆసన్నము కాలేదు కావున ఇండ్లు కట్టుకొనుదము అని చెప్పుచూ, 3. వీరు కుతంత్రములుపన్ని నగరమునకు దుష్టోప దేశము చేయుచున్నారు.

4. కనుక నరపుత్రుడా! నీవు వారికి వ్యతిరేకముగా ప్రవచనము చెప్పుము” అని అనెను.

5. ప్రభువు ఆత్మ నన్ను ఆవేశించెను. ”ఆయన నన్నిట్లు చెప్పుమనెను: యిస్రాయేలీయులారా! మీ మాటలును, మీ ఆలోచనలును నాకు తెలియును.

6. మీరు ఈ నగరమున పెక్కుమందిని చంపితిరి. వీధులను శవములతో నింపితిరి.

7. కనుక ప్రభువైన యావే మీతో ఇట్లు అను చున్నాడు: ”ఈ నగరము వంటపాత్రము. మీరు చంపిన వారి శవములే మాంసము. నేను మిమ్మిచి నుండి బయికి గిెంవేయుదును.

8. మీకు ఖడ్గము లన్న భయముకదా! నేను మీ మీదికి ఖడ్గమునే రప్పింతును.

9. మిమ్ము నగరమునుండి వెలుపలికి గొనివచ్చి అన్యజాతి ప్రజలకు అప్పగింతును. మిమ్ము శిక్షకు గురిచేయుదును.

10. మీరు మీ దేశముననే కత్తివాత పడుదురు. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు.

11. వంటపాత్ర నిప్పునుండి మాంస మును రక్షించినట్లుగా ఈ నగరము మిమ్ము రక్షింప జాలదు. మీరు యిస్రాయేలు దేశమున ఎచటున్నను నేను మిమ్ము శిక్షింతును.

12. నేను ప్రభుడనని మీరు గుర్తింతురు. మీరు మీ ఇరుగుపొరుగు జాతుల ఆచార వ్యవహారములను పాించుచున్నారు. కాని నా ఆజ్ఞలను, విధులను నిర్లక్ష ్యము చేయుచున్నారు.”

13. నేను ఈ రీతిగా ప్రవచించుచుండగా పెల్యా చనిపోయి నేలపైబడెను. నేను నేలపై బోరగిలపడి ”యావే ప్రభూ! నీవు యిస్రాయేలీయులలో మిగిలి యున్నవారిని అందరినీ తుడిచిపెట్టుదువా?” అని పెద్దగా అరచితిని.

ప్రవాసులకు వాగ్ధానము

14. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 15. ”నర పుత్రుడా! యెరూషలేమున వసించు ప్రజలు మిమ్మును గూర్చియు, ప్రవాసముననున్న మీ తోడి యిస్రాయేలీ యులను గూర్చియు ‘ఈ ప్రవాసులు దేశమునకు దూరముగానున్నారు. ప్రభువు దేశమును మనకే వదలి వేసెను’ అని చెప్పుచున్నారు.

16. కనుక నీవు నీ తోడి యిస్రాయేలీయులకు నా మాటలుగా ఇట్లు చెప్పుము: నేను వారిని దూర ప్రాంతములందలి జాతుల నడుమను, అన్యదేశముల లోను చెల్లాచెదరు చేసితిని. అయినను నేను కొంత కాలమువరకు వారు పోయిన దేశమున వారి మధ్యన నెలకొనిఉందును.

17. నీవు యావే ప్రభుడనైన నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశమునుండి వారిని ప్రోగుచేయుదును. యిస్రాయేలు దేశమును వారికి మరల ఇత్తును.

18. వారు తిరిగి వచ్చినపుడు దేశములోని హేయమైన, జుగుప్సాకరమైన విగ్రహముల తొలగింపవలెను.

19. నేను వారికి ఏకహృదయమును అనుగ్రహించి వారిలో నూత్నఆత్మను ఉంచుదును. వారిలోని రాతిగుండెను తీసివేసి, దానిస్థానమున మాంసపుగుండెనిత్తును.

20. అప్పుడు వారు నా చట్టములను, విధులను పాింతురు. వారు నా ప్రజలగుదురు, నేను వారి దేవుడనగుదును. 21. కాని హేయములును, జుగుప్సాకరములునైన విగ్రహములను కొలుచువారిని నేను వారి క్రియలకు తగినట్లుగా శిక్షింతును. యావే ప్రభుడనైన నా పలుకులివి.”

ప్రభువు తేజస్సు యెరూషలేమును విడనాడుట

22. అప్పుడు ఆ జీవులు రెక్కలుచాచి ఎగిరిపోవు టకు ఉపక్రమించెను. చక్రములు వానితోపాటు కద లెను. యిస్రాయేలుదేవుని తేజస్సు వానిపైనుండెను.

23. అటుపిమ్మట ప్రభునితేజస్సు నగరమును వీడి దానికి తూర్పుననున్న కొండపై నిలిచెను.

24. అంతట దర్శనమున దేవుని ఆత్మ నన్ను పైకిలేపి బబులోనియా లోని ప్రవాసులవద్దకు కొనివచ్చెను. అటుతరువాత ఆ దృశ్యము మరుగయ్యెను.

25. ప్రభువు నాకు చూపించిన విషయములెల్ల నేను ప్రవాసులకు వివరించితిని.