ప్రవాసిగా ప్రవక్త

12 1. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను: 2. ”నరపుత్రుడా! నీవు తిరుగుబాటుదారులనడుమ వసించు చున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కన్ను లున్నను చూడరు. చెవులున్నను వినరు.”

3. ”నర పుత్రుడా! నీవు ప్రవాసివలె నీ సామానులను మూట కట్టుకొని చీకిపడకమునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావువీడి మరియొకచోికి పోవుచున్నావని ప్రజలు గ్రహించునట్లు చేయుము. అపుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసికో వచ్చును.

4. చీకి పడకమునుపే, వారు చూచుచుండగా నీవు నీ సామానులు మూటకట్టుకొని ప్రయాణము కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసమునకు పోవు వానివలె సాయంకాలమున బయలుదేరుము.

5. వారు చూచుచుండగా మీ ఇంిగోడకు కన్నమువేసి నీ మూటను దానిగుండ బయికి కొనిరమ్ము.

6. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని, చీకిలోనికి వెళ్ళిపోవలెను. నీవు నేల కనబడ కుండ మొగము కప్పుకొని దానిని తీసుకొని పొమ్ము. నేను నిన్ను యిస్రాయేలీయులకు గుర్తుగానుంతును”.

7. నేను ప్రభువు చెప్పినట్లే చేసితిని. ప్రవాసివలె నా సామానులను మూటకట్టుకొింని. సాయంకాలము నా చేతులతోనే గోడకు కన్నమువేసి, ఆ రంధ్రము గుండ వెలుపలికి పోతిని. ఎల్లరును చూచుచుండగా చీకి పడినపుడు నా మూటనెత్తి భుజములపై పెట్టు కొని బయలుదేరితిని.

8. మరునాి ఉదయము ప్రభువువాణి నాతో ఇట్లు అనెను: 9. ”నరపుత్రుడా! తిరుగుబాటుదారులైన యిస్రాయేలీయులు ‘నీవు చేయునదేమి’ అని ప్రశ్నించుచున్నారుగదా!

10. వారికి యావే ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము: ‘ఈ సందేశము యెరూషలేమున పరిపాలనచేయు రాజునకును, అచట వసించు ప్రజలకును వర్తించును.’

11. నీవు వారికి సూచనగానుందువు. నీవు ఇపుడు చేసినట్లుగానే వారికి కూడ జరుగును. వారు బందీలై ప్రవాసమునకు పోవు దురు.

12. వారిని పాలించురాజు రేయి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడలో త్రవ్విన కన్నము గుండ వెడలిపోవును. అతడు మొగమును కప్పుకొని నేల చూడజాలకుండును.

13. నేను వలపన్ని అతనిని పట్టుకొందును. అతనిని బబులోనియాకు కొనిపోవు దును. అతడు ఆ ఆ నగరమును కింతో చూడకుండ అచటనే చనిపోవును.

14. నేను అతని కొలువు కాండ్రను, అంగరక్షకులను నలుదిక్కులకు చెదరగొట్టు దును. జనులు వారిని పట్టుకొని చంపగోరుదురు.

15. నేను వారిని అన్యజాతుల నడుమను, అన్య దేశములందును చెల్లాచెదరుచేసినపుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.

16. నేను వారిలో కొందరిని పోరు, కరువు, అంటురోగములనుండి తప్పింతును. వారు జాతుల మధ్య వసించుచు తాము చేసిన కార్యములెంత హేయమైనవో గుర్తింతురు. నేను ప్రభుడనని అర్థము చేసికొందురు.”

గడగడవణకువాడుగా ప్రవక్త

17. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను: 18. ”నీవు భోజనము చేయునపుడు గడగడవణకుము. నీళ్ళుత్రాగునపుడు భీతితో కంపింపుము.

19. తమ సొంతదేశముననే వసించు యెరూషలేము ప్రజలకు ప్రభువు ఈ సందేశమును వినిపించుచున్నాడని నీవు ఎల్లరితోను చెప్పుము. వారు భోజనము చేయునపుడు వణకుదురు. నీళ్ళు త్రాగునపుడు భీతితో కంపింతురు. అచట వసించు వారందరును హింసకు పాల్పడిరి గాన ఆ దేశము నాశనమగును.

20. ఇపుడు ప్రజలతో క్రిక్కిరిసియున్న నగరములు నాశనమగును. దేశము పాడగును. అపుడు నేను ప్రభుడనని వారు అర్థము చేసికొందురు.”

సామెత, దైవసందేశము

21. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను: 22. ”నరపుత్రుడా! ‘రోజులు గతించుచున్నవి కాని ప్రవచన ములు నెరవేరుటలేదు’ అన్న సామెతను యిస్రాయేలీ యులు మాిమాికి వాడుచున్నారేల?”

23. యావే ప్రభుడనైన నా మాటలుగా వారితో నీవు ఇట్లు చెప్పుము. ”నేను ఆ సామెతను తుదమ్టుింతును. యిస్రాయేలు దేశమున జనులు దానిని ఇక వాడ బోరు. ప్రవచనములు నెరవేరు కాలము ఆసన్నమైన దని నీవు వారితో చెప్పుము.

24. యిస్రాయేలీయులలో ఇకమీదట అనృత దర్శనములుకాని, అసత్య ప్రవచనములుగాని ఉండ బోవు.

25. ప్రభుడనైన నేను వారితో మాటలాడుదును. నా పలుకులు నెరవేరితీరును. ఇక జాప్యము జరుగదు. తిరుగుబాటు దారులారా! మీ జీవితకాలములోనే నేను చేయుదునన్న కార్యమును చేసితీరెదను. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

26. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 27. ”నర పుత్రుడా! యిస్రాయేలీయులు నీవెప్పుడో జరుగనున్న సంగతుల గూర్చి దర్శనములు కనుచున్నావనియు, ప్రవచనములు చెప్పుచున్నావనియు తలంచుచున్నారు.

28. కనుక యావే ప్రభుడనైన నా పలుకులను వారికి తెలియజేయుము. ఇక ఆలస్యము జరుగదు. నా వాక్కు నెరవేరి తీరును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”