ఎవరి క్రియలకు వారే బాధ్యులు
18 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కెను” అను సామెతను యిస్రాయేలీయుల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేల?
3. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నా జీవముతోడు. ఇక మీదట యిస్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు.
4. మనుష్యు లందరు నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారు లేమి అందరును నా వశములోనే ఉన్నారు. పాపము చేసినవాడే చచ్చును.
5. న్యాయపరుడుగాను, ధర్మపరుడుగాను జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకొందము.
6. అతడు యిస్రాయేలీయులు కొలుచు విగ్రహములను పూజింపడు. కొండలమీది దేవళములలోని వాని కర్పించిన నైవేద్య ములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ముట్టుతను కూడడు.
7. ఎవరిని పీడింపడు, ఎవరి సొమ్ము దొంగి లింపడు. అప్పు తీసికొన్న వాని కుదువసొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వారికి అన్నముప్టిె, బట్టలులేని వారికి బట్టలిచ్చును.
8. వడ్డీకి అప్పు ఈయడు. చెడుకు పాల్పడడు. తగవులలో పక్షపాతిగాక న్యాయమైన తీర్పుచెప్పును.
9. అి్టవాడు నా చట్టము లను, విధులను చిత్తశుద్ధితో పాించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు.
10. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడను కొందము. అతడు దొంగిలించుట, హత్యచేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇి్ట కార్యములు చేయలేదు.
11. కొండలమీది దేవళము లలో అర్పించిన నైవేద్యములు భుజించును. పరస్త్రీలను చెరచును.
12. పేదలను పీడించును, దొంగిలించును. కుదువసొమ్మును తిరిగి ఇచ్చివేయడు. విగ్రహములను సేవించి పూజించును.
13. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకునా? ఇి్ట దుష్టకార్యములకు పాల్పడెను కనుక చచ్చును. అతడి చావునకు అతడే బాధ్యుడు.
14. అి్టవానికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకొందము. అతడు తన తండ్రి చేసిన పాపములను తెలిసికొనును. తాను మాత్రము అి్టపనులను చేయడు.
15. అతడు యిస్రాయేలీయులు కొలుచు విగ్రహములను పూజింపడు. కొండలమీది దేవళ ములలో వానికర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు.
16. ఇతరులను పీడింపడు. పరుల సొమ్ము దొంగిలింపడు. అప్పుతీసికొన్నవాని కుదువ సొమ్ము తిరిగియిచ్చివేయును. ఆకలిగొనిన వారికి అన్నముప్టిె, బట్టలులేనివారికి బట్టలిచ్చును.
17. చెడును చేయడు. వడ్డీకి డబ్బీయడు. నా చట్టములను, విధులను పాించును. తన తండ్రి పాపములకుగాను అతడు చనిపోడు. తప్పక బ్రతుకును.
18. అతని తండ్రి పరులను మోసగించెను. ఇతరుల సొమ్ము దొంగిలించెను. ఎల్లరికి ని కీడు చేసెను. అతడు తన పాపములకు తానే చచ్చును.
19. కాని తండ్రి పాపములకు తనయుడేల శిక్ష పొందడని మీరడుగుదురు. కుమారుడు న్యాయసమ్మత మయిన మంచిపనులు చేసెను. నా చట్టములను జాగ్రత్తగా పాించెను. కనుక అతడు అవశ్యకముగ బ్రతుకును.
20. అపరాధము చేసినవాడే చచ్చును. తండ్రి పాపములకు తనయుడుకాని, తనయుని పాపములకు తండ్రి కాని శిక్షపొందరు. నీతివర్తనుడు తన సత్క్రియలకు బహుమతిని, దుష్టవర్తనుడు తన దుష్క్రియలకు శిక్షను పొందును.
21. దుష్టుడు తన పాపములనుండి వైదొలగి నా చట్టములను పాించెనేని, న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, చావును తప్పించుకొని బ్రతు కును.
22. అతని పాపములు పరిహరింతును. అతని పాపములలో ఒకియును నా జ్ఞాపకములోనికి రాదు. అతని మంచి పనులకుగాను అతడు బ్రతుకును.
23. దుర్మార్గుడు చనిపోవుటవలన నాకు సంతోషము కలుగునా? అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నా సంతోషముకదా! అని యావే ప్రభువు నుడువుచున్నాడు.
24. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడెనేని, దుష్టులు చేయు హేయమైనకార్యములు చేసెనేని, అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు జ్ఞాపకమునకు రావు. అతని ద్రోహములకును, పాపములకును అతడు చచ్చితీరును.
25. కాని మీరు ‘యావే ప్రభువు చేయునది సబబుకాదు’ అని పలుకుదురు. యిస్రాయేలీయులారా! వినుడు. నా మార్గము సబబైనదికాదా? మీ మార్గమే సబబైనదికాదు.
26. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయెనేని, తన దుష్కార్యములవలననే చనిపోయెను.
27. దుష్టుడు తన పాపకార్యములనుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, తన ప్రాణములను కాపాడు కొనును.
28. అతడు తన తప్పులను తెలిసికొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావునకు తప్పి బ్రతుకును.
29. యిస్రాయేలీయులారా! మీరు యావేప్రభువు చేయుపని న్యాయమైనది కాదని పలుకుదురు. నా మార్గము న్యాయమైనదికాదా? మీ మార్గమే న్యాయమైనది కాదు.
30. యిస్రాయేలీయులారా! యావే ప్రభుడనైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి తాను చేసిన పనులను బ్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశనము కావలదు.
31. మీరు చేయు పాపకార్యములనుండి వైదొలగి నూత్నహృదయమును, నూత్నఆత్మను పొందుడు. యిస్రాయేలీయులారా! మీరు చావనేల?
32. ఎవడును చనిపోవుటవలనను నాకు సంతోషము కలుగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”.