యిస్రాయేలు ద్రోహములు

20 1. అది ఏడవయేడు, ఐదవనెల, పదియవ రోజు. యిస్రాయేలు పెద్దలు కొందరు ప్రభువును సంప్రతింపగోరి నా చెంతకువచ్చి నా యెదుట కూర్చుండియుండిరి.

2. అంతట ప్రభువువాణి నాతో ఇట్లనెను: 3. ”నరపుత్రుడా! నీవు పెద్దలతో ఇట్లు చెప్పుము. ప్రభువు పలుకులివి: మీరు నన్ను సంప్ర తింపవచ్చితిరా? నా జీవముతోడు. నా నుండి ఎి్ట ఆలోచనయు మీకు లభింపదు. ఇవి యావే ప్రభుడనైన నా పలుకులు”.

4. ”నరపుత్రుడా! నీవు వారికి తీర్పుచెప్పుటకు సిద్ధముగానున్నావా? ఉన్నచో వారికి తీర్పు విధింపుము. వారి పితరులు చేసిన ఘోరకార్యములను వారికి జ్ఞప్తికితెమ్ము.

5. యావే ప్రభుడనైన నా పలు కులను వారికి ఇట్లు వినిపింపుము. నేను యిస్రాయేలీ యులను ఎన్నుకొనినపుడు వారికొక ప్రమాణము చేసితిని. ఐగుప్తున నన్ను నేను వారికి ఎరుకపరచుకొని నేను మీ దేవుడనైన యావేనని చెప్పితిని.

6. అపుడు నేను వారిని ఐగుప్తునుండి తోడ్కొని వత్తునని బాస చేసితిని. వారిని నేనెన్నుకొనిన దేశమునకు చేర్చెద నింని. అది మిగుల పాలు తేనెలు జాలువారు నేల, అది శ్రేష్ఠమైన భూమి.

7. నేను తమకు ప్రీతి కలిగించు హేయమైన విగ్రహములను విడనాడవలెనని వారికి చెప్పితిని. నేను వారి ప్రభుడనైన దేవుడను గనుక, వారు ఐగుప్తు విగ్రహములను కొలిచి అపవిత్రులు కారాదని నుడివితిని.

8. కాని వారు నాకెదురుతిరిగి, నా మాటలు పాింపరైరి. తమ హేయమైన విగ్రహ ములనుగాని, ఐగుప్తు దైవములనుగాని విడనాడరైరి. వారు ఐగుప్తీయుల దేశములో ఉండినపుడే వారిపై  నేను నా కోపమును క్రుమ్మరించి, నా ఆగ్రహమును తీర్చుకోనెంచితిని.

9. కాని నేనట్లు చేసిన యెడల నా నామమునకు అపకీర్తి వచ్చెడిది. యిస్రాయేలీయులు అన్యజాతుల మధ్య వసించుచుండిరికదా! నేనా జాతుల యెదుట యిస్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించి నన్ను నేను తెలియజేతుననుకొింని. కనుక నేను తలప్టిెన పనిని చేయనైతిని.

10. కావున వారిని ఐగుప్తు నుండి ఎడారిలోనికి తోడ్కొనివచ్చితిని.

11. వారికి నా చట్టములను, న్యాయ నిర్ణయములను దయచేసితిని. వానిని పాించినవారు జీవమును బడయుదురు.

12. వారిని పవిత్రపరుచు వాడను నేనేయని వారు తెలుసుకొనునట్లు నాకును, వారికిని మధ్య విశ్రాంతిదినమును సూచనగా నేను నియమించితిని.

13. కాని ఎడారిలోనే వారు నాకు ఎదురుతిరిగిరి.  తాము అనుసరించి బ్రతుకవలెనని నేను ఇచ్చిన నా చట్టములను, న్యాయనిర్ణయములను మీరిరి. వాిని పాించువారికి అవి జీవము నొసగు నవి. వారు విశ్రాంతిదినమును అపవిత్రము చేసిరి. నేను ఎడారిలోనే వారిపై నా కోపమును క్రుమ్మరించి వారిని నాశనము చేయగోరితిని.

14. కాని అటుల చేసినచో జాతుల యెదుట నా నామమునకు అపకీర్తి వాిల్లెడిది. వారు నేను యిస్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చుట చూచిరి. కనుక నేను సంకల్పించు కొన్నట్లు చేయనైతిని. 15. కాని నేను వారిని వారి కిచ్చిన నేలకు తోడ్కొనిపోనని ఎడారిలోనే శపథము చేసితిని. అది పాలుతేనెలు జాలువారు నేల, శ్రేష్ఠమైన భూమి.

16. వారు నా న్యాయనిర్ణయములను, చట్ట ములను మీరిరి. విశ్రాంతిదినమును అపవిత్రము చేసిరి. విగ్రహములకు అంిపెట్టుకొనిరి. కనుక నేనట్లు ప్రతిన బూనవలసి వచ్చెను.

17. నేను వారిని కరుణించి నాశనము చేయ నైతిని. ఎడారిలో వారిని చంపివేయనైతిని.

18. నేను వారిలోని యువతరమును హెచ్చరించి ”మీరు మీ పెద్దలు చేసినట్లు చేయకుడు. వారి ఆచారములను అనుకరింపకుడు. వారి విగ్రహములను కొలిచి, మీరు అపవిత్రులు కావలదు.

19. నేను మీ దేవుడనైన ప్రభుడను. మీరు నా చట్టములను, న్యాయనిర్ణయ ములను పాింపుడు.

20. మీరు నా విశ్రాంతిదిన మును పవిత్రము చేయుడు. అది మన ఇరువురి ఒప్పందమునకు గుర్తుగా ఉండును. నేను మీ ప్రభుడనైన దేవుడనని మీరు జ్ఞప్తియందుంచుకొనునట్లు చేయును” అని చెప్పితిని.

21. కాని ఆ తరమువారుకూడ, నాకెదురుతిరిగి, నా చట్టములను, విధులను మీరిరి. అవి వాిని పాించువారికి జీవమునొసగునవి. వారు నా విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. నేను వారిపై నా ఆగ్రహమును క్రుమ్మరించి ఎడారిలోనే వారిని చంపి వేయగోరితిని.

22. కాని అన్యజనులమధ్య నా నామమునకు అపకీర్తి కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో, ఆ జనులు చూచు చుండగానే వారిని చంపివేయు ఆలోచనను విరమించు కొని నా వాగ్ధానమును నెరవేర్చితిని. 23. వారు నా చట్టములను, ఆజ్ఞలను మీరి నా విశ్రాంతిదినమును తృణీకరించి అపవిత్రము చేసిరి. తమపితరులు కొలి చిన విగ్రహములను తాము కూడ పూజింపగా, 24. నేను వారిని పలు దేశములలో వివిధజాతులమధ్య చెల్లాచెదరు చేయుదునని ఎడారిలో శపథము చేసితిని.

25. అటుపిమ్మట నేను ప్రభుడనని వారు తెలుసు కొనునట్లును, వారిని విస్మయము నొందింపవల యునని వారికి మేలు చేయని చట్టములను, జీవము నొసగని విధులనిచ్చితిని.

26. తమ తొలిచూలు పిల్లలను నివేదించుటలోను, బలిఅర్పణములను ఇచ్చుటలోను తమ అర్పణములద్వారా తమను తామే అపవిత్ర పరచుకొననిచ్చితిని.

27. ”కనుక నరపుత్రుడా! నీవు యావే ప్రభుడనైన నా మాటలను యిస్రాయేలీయులకు ఇట్లు ఎరిగింపుము. వారి పితరులు నాకు ద్రోహముచేసి నన్ను మరియొక విధముగాకూడ అవమానపరచిరి.

28. నేను వారికిత్తు నని ప్రమాణముచేసిన నేలకు వారిని తోడ్కొనివచ్చితిని. కాని వారచట ఎత్తయిన కొండలను, పచ్చనిచెట్లను చూచి వానికెల్ల బలులర్పించిరి. వారి పరిమళ ధూప ములు, పానీయార్పణములు నా కోపమును రెచ్చ గొట్టెను.

29. మీరు వెళ్ళు ఆ ఉన్నత స్థలములేమి వని నేను వారిని ప్రశ్నించితిని. కనుక నేివరకును వానికి ఉన్నతస్థలములను పేరు స్థిరపడినది.

30. యిస్రాయేలీయులకు నీవు నా మాటలుగా ఇట్లు చెప్పుము: మీరు మీ పితరులు కొలిచిన విగ్రహము లను కొలిచి, మరల వారుచేసిన పాపములు చేయనేల?

31. నేడును మీరు వానికి అర్పణలర్పించుచున్నారు. మీ బిడ్డలను అగ్నిలో దహించి బలి అర్పించుచున్నారు. ఈ రీతిగా ఆ విగ్రహములవలన మీరు అపవిత్రుల గుచున్నారు. యిస్రాయేలీయులారా! మీరింతచేసిన పిమ్మట మరల నన్ను సంప్రతింపవచ్చుచున్నారు. నా జీవము తోడు, నా నుండి ఏ ఆలోచనయు మీకు లభింపదు.

32. మీరు ‘చెట్లను, రాళ్ళను కొలుచు అన్యజాతులవలె ఉండగోరుచున్నారు.’ కాని అది పొసగదు. ఇది ప్రభువు వాక్కు.

ప్రభువు శిక్షించి, రక్షించును

33. నా జీవముతోడు. యావే ప్రభుడనైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. నేను నా  ఆగ్రహమును రగుల్కొలిపి, భుజబలముతోను, చాచినబాహువుతోను మీపై అధికారము చెలాయింతును.

34. మీరు చెల్లాచెదరైయున్న దేశములనుండి మిమ్ము మరల తీసికొనివచ్చినపుడు, నేను నా బలమును, ఆగ్రహమును మీకు చూపింతును.

35. మిమ్ము ”జాతుల ఎడారి” అను దానిలోనికి కొనివచ్చి, అచట మీ ముఖము నెదుటనే మీరు దోషులని నిరూపింతును.

36. నేను సీనాయి ఎడారిలో మీ పితరులను దోషులనుగా నిరూపించినట్లే, ఇప్పుడు మిమ్ము కూడ దోషులునుగా నిరూపింతును. ఇవి యావే ప్రభువు పలుకులు.

37. నేను మిమ్ము అదుపులో బెట్టుకొని, మీరు నా నిబంధనమును పాించునట్లు చేయుదును.

38. నాకు ఎదురుతిరుగువారిని, నాకు ద్రోహము చేయు వారిని మీ నుండి తొలగింతును. వారిపుడు వసించు చున్న దేశమునుండి వారిని కొనివత్తునుగాని వారిని యిస్రాయేలు దేశమునకు తిరిగి రానీయను. అపుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.

39. యావే ప్రభువిట్లనుచున్నాడు: ”యిస్రాయేలీ యులారా! నా మాటవినక మీ విగ్రహములను మీ ఇచ్ఛ వచ్చినట్లు పూజించుకొనుడు. అయితే మీ అర్పణముల చేతను, మీ విగ్రహములచేతను నా పవిత్ర నామమును అపవిత్రపరచకుడు.

40. యిస్రాయేలు ఉన్నతమైన కొండయగు నా పవిత్రపర్వతమందు దేశములోనున్న యిస్రాయేలీయులందరు నన్ను ఆరాధింతురు. అపుడు నేను మీ వలన ప్రీతిజెందుదును. మీరు నాకు బలులను, ఉత్తమ అర్పణములను, పవిత్ర నైవేద్యము లను అర్పింపవలెనని కోరుకొందును.

41. మీరు చెల్లాచెదరైన జాతులనుండి మిమ్ము తీసికొనివచ్చి, మిమ్ము ప్రోగుజేసిన తరువాత, నేను పరిమళధూప ముగా మిమ్మును అంగీకరింతును. జాతులు నేను పవిత్రుడనని గుర్తించును.

42. నేను మీ పితరుల కిత్తునన్న యిస్రాయేలు దేశమునకు మిమ్ము కొనివచ్చి నపుడు, మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

43. అపుడు మీరు మీ దుష్టచేష్టలను, వాని ద్వారా మిమ్ము మీరు అపవిత్రము చేసికొనిన తీరును జ్ఞప్తికి తెచ్చు కొందురు. మీ దుష్కార్యములకు గాను మీమీద మీకే రోతపుట్టును.

44. యిస్రాయేలీయులారా! మీ దుష్టత్వమునుబ్టియు, మీ దుష్కార్యములనుబ్టియు గాక, నేను నా కీర్తిని నిలుపుకొనుటకుగాను ఈ కార్యములు చేసినపుడు, నేను ప్రభుడనని మీరు గుర్తింతురు. ఇవి యావే ప్రభువు పలుకులు”.

దక్షిణమున అగ్ని

45. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 46. ”నరపుత్రుడా! నీవు దక్షిణమునకు తిరిగి దక్షిణ దేశమును ఖండింపుము. దక్షిణ దేశమునగు నేగేబు ఎడారికి ప్రతికూలముగా ప్రవచనము చెప్పుము.

47. దానికి యావే ప్రభువు వాక్కులుగా ఇట్లు చెప్పుము. వినుము, నేను నిప్పును రగిలింతును. అది నీలోని పచ్చని చెట్లను, ఎండుచెట్లనుగూడ తగులబెట్టును. ఆ అగ్గిని ఏదియు ఆర్పజాలదు. అది దక్షిణము నుండి ఉత్తరమునకు వ్యాపించును. ఎల్లరును దాని మంట లకు కమిలిపోదురు.

48. ఎల్లరును ఆ అగ్నిని రగిల్చిన వాడను నేనే అనియు, అది చల్లారదనియు గ్రహింతురు”.

49. ”ప్రభూ! ఈ ప్రజలు నేనెల్లపుడు గూఢార్ధముగా మాటలాడుచున్నానని నన్ను ఈసడించుకొనుచున్నారు” అని నేను మొరప్టిెతిని.