ప్రభువు ఖడ్గము

21 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు యెరూషలేమును ఖండింపుము. ప్రజల పూజాస్థానములను తెగడుము. యిస్రాయేలు దేశము నకు నా హెచ్చరికలను ఇట్లు వినిపింపుము.

3. నేను నీకు శత్రువునగుదును. నేను నా కత్తిదూసి మీలో మంచివారినిగూడ వధింతును.

4. నా ఖడ్గము దక్షిణము నుండి ఉత్తరమువరకును నీతిమంతులను, దుష్టులను గూడ నరుకును.

5. ఎల్లరును ప్రభుడనైన నేను కత్తి దూసితిననియు దానిని తిరిగి ఒరలో పెట్టననియు గ్రహింతురు.

6. నరపుత్రుడా! నీవు గుండె పగిలిపోవునట్లుగా నిరాశతో నిట్టూర్పు విడువుము.

7. ‘నీ వెందుకు నిట్టూర్పు విడుచుచున్నావు’ అని వారు నిన్నడుగుదురు. నీవు వారితో ఇట్లు చెప్పుము: ‘నేను రానున్న వార్తలను బ్టి నిట్టూర్పు విడుచుచున్నాను. ఆ వార్తలు వచ్చి నపుడు మీ గుండెలు పగులును. చేతులు చచ్చుపడును. ధైర్యము చెడును, కాళ్ళు గడగడ వణకును. ఆ కాలము సమీపించినది, చేరువ లోనికే వచ్చినది. ఇది ప్రభువు వాక్కు.’ ”

8. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

9. ”నరపుత్రుడా! నీవు  ప్రవచింపుము.

               ప్రభుడనైన నా పలుకులను ప్రజలకు

               ఇట్లు తెలియజేయుము:

               ఖడ్గము, ఖడ్గమే!

               దానికి పదును ప్టిె మెరుగులు దిద్దిరి.

10. చంపుట కొరకే దానికి పదును ప్టిెరి.

               మెరుపువలె మెరయుటకే

               దానికి మెరుగులు దిద్దిరి.

               ఇక ఆనందమునకు తావు లేదు.

               నా ప్రజలు నా హెచ్చరికలను,

               శిక్షను ప్టించుకోరైరి.

11. కత్తిని వినియోగించుకొనుటకే

               దానికి మెరుగులు దిద్దిరి.

               సంహారకుని చేతి కందించుటకే

               దానికి పదును ప్టిె మెరుగులు దిద్దిరి.

12. నరపుత్రుడా! నీవు విచారముతో

               పెడబొబ్బలు పెట్టుము.

               ఈ ఖడ్గము నా ప్రజల కొరకును,

               యిస్రాయేలు నాయకుల కొరకును

               ఉద్దేశింపబడినది.

               వారెల్లరును నా ప్రజలతోపాటు చత్తురు.

               నీవు నిరాశతో గుండె బాదుకొనుము.

               నీ తొడను చరచుకొనుము.

13. నేను నా ప్రజలకు పరీక్ష పెట్టుచున్నాను.

               వారు పశ్చాత్తాపపడరేని

               ఈ వినాశనములెల్ల ప్రాప్తించును.”

               ఇది దేవుడైన ప్రభువు వాక్కు.

14. ”నరపుత్రుడా! నీవు ప్రవచింపుము,

               చేతులు చరుచుకొనుము.

               ఆ కత్తి మరల మరల నరుకును.

               అది నరులను చంపునది, వారికి భీతిగొల్పునది.

               వారిని ముక్కలు ముక్కలుగా నరుకునది.

15.          దానిని చూచి నా ప్రజలు

               ధైర్యము కోల్పోయి తొిల్లుదురు,

               నేను మెరుపువలె తళతళ మెరయుచు

               వధించుటకు సిద్ధమైయున్న కత్తిని జూపి

               వారి నగరమును భయపెట్టుదును.

16.          పదునైన ఖడ్గమా!

               నీవు కుడిఎడమలందును నరుకుము.

                నీవు తిరిగిన చోటులందెల్ల నరుకుము.    

17. నేను చేతులు చరుచుకొందును.

               నా కోపము తీర్చుకొందును.         

               ఇవి ప్రభుడనైన నా పలుకులు”.

బబులోనియా రాజు ఖడ్గము

18. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 19. ”నరపుత్రుడా! బబులోనియా రాజు ఖడ్గము వచ్చుటకు నీవు రెండు మార్గములను గుర్తింపుము. ఆ త్రోవలు రెండును ఒక దేశమునుండే బయలుదేరునట్లు  సూచించుటకై ఒక హస్తరూపమును నగరపు వీధి కొనవద్ద గీయుము.

20. ఒక చీలిక అమ్మోనీయుల నగరమైన రబ్బాకు పోవు త్రోవను ఖడ్గమునకు చూపును. మరియొకి యూదాకు, సురక్షితనగరమైన యెరూషలేమునకు పోవు త్రోవను ఖడ్గమునకు చూపును.

21. బబులోనియారాజు మార్గము చీలినచోట నిలు చుండి శకునములు చూచును. ఏ త్రోవను పోవల యునో తెలిసికొనుటకు అతడు బాణములను ఊపును. తెరాఫీముచే విచారణచేయుచూ, బలియర్పించిన పశువు కాలేయమును పరిశీలించి చూచుచున్నాడు.

22. అదిగో! యెరూషలేముఎదుట ద్వారములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వనిఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడిదిబ్బలు కట్టుమనియు తన కుడివైపున శకునము కనబడెను.

23. యెరూషలేము పౌరులు తాము చేసికొనిన సంధినిబ్టి ఈ సంగతులను నమ్మరు. కాని ఈ ప్రవచనము వారు తమ పాపము లను జ్ఞప్తికి తెచ్చుకొనునట్లు చేయును. అది వారు శత్రువులకు చిక్కుదురని హెచ్చరించును.

24. ప్రభువును, దేవుడనైన నా పలుకులివి. జనులారా! మీ పాపములు బట్టబయలయినవి. మీ తప్పిదము లెల్లరికిని తెలియును. మీరు చేయు పనులన్నిలోను మీ పాపములు కన్పించుచునేయున్నవి. మీరు దోషులని రుజువైనది. నేను మిమ్ము మీ శత్రువులకు అప్పగింతును. 

25. అపవిత్రుడవును, దుష్టుడవునైన యిస్రాయేలు రాజా! నీ పాపకార్యములను తుదమ్టుించురోజు వచ్చుచున్నది.

26. యావే ప్రభుడనైన నా పలుకులివి. నీవు నీ తలపాగాను, కిరీటమును తొలగింపుము. అంతయు మారిపోవును. దరిద్రులు అధికులగుదురు. పాలకులు దరిద్రులగుదురు.

27. నాశనము, నాశనము! నేను నగరమును నాశనము చేయుదును. కాని నగరమును నాశనముచేయుటకు నేను ఎన్ను కొనినవాడు వచ్చు వరకును ఈ కార్యము జరుగదు. అతడు వచ్చినపుడు నేను పట్టణమును అతనికి అప్పగింతును.”

అమ్మోనీయుల మీదికి ఖడ్గము

28. ”నరపుత్రుడా! నీవు ప్రవచింపుము. యిస్రాయేలీయులను అవమానించు అమ్మోనీయు లకు యావే ప్రభుడనైన నా పలుకులిట్లు ఎరిగింపుము:

నాశనము చేయుటకు కత్తిని దూసిరి

               హతము చేయుటకు కత్తికి పదును ప్టిెరి

               మెరుపువలెమెరయ కత్తికి మెరుగుప్టిెరి

29. మీరు చూచు దర్శనములు అనృతములు. మీరు చెప్పు ప్రవచనములు అసత్యములు. మీరు దుష్టులు, పాపులు, మీ కార్యములను తుదమ్టుించు రోజు వచ్చుచున్నది. కత్తి మీ మెడమీదవాలును.

30. కత్తిని ఒరలో దూర్చుడు. మీరు ప్టుిన దేశముననే, మీరు జన్మించిన తావుననే, నేను మీకు తీర్పు విధింతును. 31. నేను నా కోపమును మీపై క్రుమ్మరింతును. నా కోపాగ్నిని మీపై రగిలింతును. నాశనము చేయుటలో నేర్పుగల క్రూరులకు మిమ్ము అప్పగింతును.

32. అగ్ని మిమ్ము కాల్చివేయును. మీరు మీ దేశముననే మీ నెత్తురును ఒలుకుదురు. మీ పేరును ఇక ఎవడును గుర్తుంచుకొనడు. ఇది ప్రభువు వాక్కు.”