సమరియా, యెరూషలేము
23 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! ఒక తల్లికి ప్టుిన ఇద్దరు స్త్రీలు కలరు.
3. వారు ఐగుప్తున యువతులుగానున్నపుడు వ్యభి చారిణులైరి. అక్కడ పురుషులు వారి చనుమొనలను నలిపిరి. వారి ఎల ప్రాయపు కుచములను పిసికిరి.
4. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమెయే సమరియా, చిన్నదాని పేరు ఒహోలిబా1. ఆమెయే యెరూషలేము. వీరు నాకు పెండ్లిచేయబడినవారై కుమారులను, కుమార్తెలను కనిరి.
5. ఒహోలా నా భార్యయైనను వేశ్యగా వర్తించెను. ఆమె తన పొరుగువారైన అస్సిరియనులను కామించెను.
6. వారు ముదురు కెంపువన్నె ముడు పులు తాల్చిన సైనికులు, ప్రసిద్ధులు, ఉన్నతోద్యోగులు, అందరును సొగసైన యెలప్రాయపు రౌతులు.
7. ఆమె అస్సిరియా అధికారులకెల్ల వేశ్యయయ్యెను. కామోద్రేకముతో అస్సిరియా విగ్రహములను సేవించి భ్రష్టురాలయ్యెను.
8. ఆమె ఐగుప్తుననే పడుపువృత్తి మొదలుపెట్టెను. అచట పడుచుగా ఉన్నపుడే పురుషులు ఆమెతో శయనించిరి. ఆమె యెలప్రాయపు కుచము లను పిసికి ఆమెతో వ్యభిచరించిరి. ఆమె వేశ్యావృత్తిని మానదయ్యెను.
9. కావున నేను ఒహోలా విటులకు అనగా ఆమె కామించు వారైన అస్సిరియనులకు ఆమెను ఒప్పగించితిని.
10. వారామెను దిగంబరనుచేసిరి, ఆమె సంతానమును బంధించి, ఆమెను సంహరించిరి. స్త్రీలు ఎల్లరును ఆమెకు ప్టిన దుర్గతి గూర్చి చెప్పుకొనిరి.
11. ఆమె చెల్లెలైన ఒహోలీబాకు ఈ సంగతంతయు తెలియును. కాని ఆ చెల్లెలి కామోద్రేకము, వేశ్యా వర్తనము అక్కను తలదన్నెను.
12. ఆమె కూడ అంద మైన దుస్తులను తాల్చిన అస్సిరియా ప్రముఖులను, అధికారులను, రౌతులను కామించెను. వారెల్లరు సొగసైన యువకులు.
13. ఆమె అపవిత్రురాలనియు, ఆ అక్క చెల్లెండ్రిద్దరు భ్రష్టురాండ్రై ఒకేవిధముగా ప్రవర్తించుచున్నారనియు నేను గ్రహించితిని.
14. ఆమె వేశ్యావృత్తి ఇంకను పెరిగిపోయెను. బబులోనియా అధికారుల చిత్రములను చూడగా ఆమెకు మతి చలించెను.
15. వారి బొమ్మలను గోడలమీదచెక్కి వానికి ఎఱ్ఱని రంగు పూసిరి. వారి నడుముల మీద ద్టీలును, తలపై పాగాలునుండెను.
16. ఆ చిత్రము లను చూడగానే, ఆమె కామోద్రేకము చెంది వారిని పిలిపించుటకు బబులోనియాకు దూతలను పంపెను.
17. బబులోనీయులు వచ్చి ఆమెతో శయనించిరి. ఆమెతో వ్యభిచరించి ఆమెను అపవిత్రము చేసిరి. ఆమె బబులోనీయుల వలన భ్రష్టురాలైన పిదప ఆశాభగ్నురాలాయెను.
18. ఇట్లు తన జారత్వమును అధికము చేసి తన మానచ్ఛాదమును తీసివేసికొనెను. గనుక ఆమె అక్క విషయములో ఆశాభగ్నుడైనట్టు, ఈమె విషయములో కూడా నేను నిరాశచెందితిని.
19. ఆమె పడుపువృత్తి ఇంకను పెరిగిపోయెను. తాను పూర్వము ఐగుప్తున యువతిగానున్నపుడెట్లు వేశ్యగా వర్తించెనో అటు తరువాత గూడ అట్లే చేసెను.
20. అచి పురుషులు గాడిదలవలె పెద్ద జననేంద్రియ ములు కలవారు. గుఱ్ఱములవలె రేతఃస్ఖలనము చేయు వారు. 21. ఒహోలీబా! నీవు ఐగుప్తున పడుచుదానవుగా నున్నపుడు చేసిన వ్యభిచారమును కొనసాగింప నెంచితివి. అచట పురుషులు నీ చనుమొనలను నలిపి నీ యెలప్రాయపు కుచములను చిదిమిరి.”
యెరూషలేమునకు శిక్ష
22. కావున ఒహోలీబా! యావే ప్రభుడనైన నా పలుకులు ఇవి: నీవు నీ ప్రేమికులవలన విసుగుచెంది తివి. కాని నేను వారు నీపై ఆగ్రహించి నిన్ను చుట్టు ముట్టునట్లు చేయుదును.
23. నేను బబులోనీయులను, కల్దీయులను, పెకోడు, షోవా, కోవాదేశీయులను, అస్సిరియనులను, యువకులను, సుందరరూపులునైౖన ఆ ప్రముఖులను, ఉన్నతాధికారులను, రౌతులను నీ మీదికి కొనివత్తును. 24. వారు పెద్ద సైన్యములతోను, రథములతోను, సామానులబండ్లతోను ఉత్తరదిక్కు నుండి వచ్చి నీపైబడుదురు. శిరస్త్రాణములతో, డాళ్ళతోవచ్చి నిన్ను ముట్టడింతురు. నేను నిన్ను వారికి అప్పగింతును. వారు తమ చట్టముల ప్రకారము నీకు తీర్పు చెప్పుదురు.
25. నేను నీపై కోపించితిని కనుక వారును కోపముతో నిన్ను శిక్షింతురు. నీ ముక్కును, చెవులను కోసివేసి, నీ పిల్లలను చంపుదురు. నీ బిడ్డలను సజీవులుగా కాల్చివేయుదురు.
26. నీ బట్టలను ఊడబీకి నీ సొమ్ములు దోచుకొందురు.
27. నీవు ఐగుప్తుననున్నప్పి నుండియు ప్రదర్శించుచు వచ్చిన వ్యభిచారములను, కామకలాపములను నేను తుద మ్టుింతును. నీవు ఆ మీదట విగ్రహములవైపు చూడవు. ఐగుప్తును గుర్తుకు తెచ్చుకొనవు.
28. యావే ప్రభుడనైన నా పలుకులివి: నీవు ద్వేషించువారును, నీకు రోత ప్టుించువారునైన ప్రజలకు నేను నిన్నప్పగింతును.
29. వారు నిన్ను ద్వేషింతురు. కనుక నీవు కూడబెట్టుకొన్న వానినెల్ల దోచుకొందురు. నిన్ను దిగంబరనుచేయగా నీవు వేశ్యవలె నగ్నమగుదువు. నీ వ్యభిచారములు, రంకులు నీకు ఈ ఆపద తెచ్చెను.
30. నీవు అన్యజాతులతో రంకాడితివి. వారి విగ్రహముల వలన భ్రష్టురాలవైతివి.
31. నీవు మీ అక్క అడుగుజాడలలో నడిచితివి. కనుక నేను ఆమెచే త్రాగించిన శిక్షాపాత్రలోని పానీయమునే నీ చేతను త్రాగింతును.
32. యావే ప్రభువు పలుకులివి:
”మీ అక్క త్రాగిన పాత్రముయందలి
పానీయమునే నీవును త్రాగుదువు.
ఆ పాత్రము వెడల్పయినది, లోతయినది.
ఎల్లరును నిన్ను గేలిచేసి తిరస్కరింతురు.
ఆ పాత్రము అంచుల వరకును నిండియున్నది.
33. మీ అక్కయైన సమరియా త్రాగిన
పాత్రమును పుచ్చుకొనినపుడు
నీకు దుఃఖము కలుగును, కైపెక్కును.
అది భయమును, నాశనమును కొనివచ్చు పాత్రము.
34. నీవు ఆ పాత్రమునందలి పానీయమును
చుక్కకూడ మిగులకుండ త్రాగి,
ఆ పాత్రమును పగలగ్టొి, దాని పెంకులతో
నీ స్తనములను పెరుకుకొనెదవు.
35. యావే ప్రభువు పలుకులివి: నీవు నన్ను విస్మరించి నా నుండి వైదొలగితివి కనుక నీ వ్యభిచార ములకును, రంకులకును తగినదండన అను భవింతువు.”
అక్కచెల్లెండ్రలకును శిక్ష
36. ప్రభువు నాతో ఇట్లనెను: ”నరపుత్రుడా! నీవు ఒహోలాకును, ఒహోలీబాకును తీర్పు విధించుటకు సిద్ధముగా ఉన్నావా? వారి హేయమైన కార్యములకు గాను వారికి బుద్ధిచెప్పుము.
37. వారు వ్యభిచారము నకును, హత్యకును పాల్పడిరి, విగ్రహములతో రంకాడిరి. నాకు కనిన బిడ్డలను హత్యచేసిరి. నా బిడ్డలను అగ్నిలోదహించి బలిగాఅర్పించిరి.
38. అంతితో ఆగక నా మందిరమును అపవిత్రము చేసిరి. నేను నియమించిన విశ్రాంతిదినమును పాింప రైరి. 39. వారి బిడ్డలను వారి విగ్రహములకు బలిగా అర్పించిన దినముననే దేవాలయమునఅడుగిడి, దానిని అమంగళముచేసిరి. నా మందిరముననే అటులచేసిరి.
40. వారు దూరప్రాంతముల నుండి పురుషులను రప్పించుటకుగాను పలుసారులు దూతలను పంపిరి. వారు రాగానే ఈ అక్క చెల్లెండ్రు స్నానమాడి, కన్నులకు కాటుక పెట్టుకొని, నగలతో అలంకరించుకొనెడివారు.
41. అందమైన పాన్పుపై కూర్చుండెడివారు. వారి చెంతనున్న బల్లపై నేను వారికిచ్చిన సాంబ్రాణి, ఓలివు తైలము నుంచెడి వారు.
42. అంతట ఎడారినుండి వచ్చిన భోగప్రియుల కోలాహలము వినిపించెడిది. వారు ఆ ఉవిదల చేతులకు కంకణములు తొడిగి, వారి శిరస్సులను పూలదండలతో అలంకరించెడివారు.
43. వీరు వ్యభిచారములవలన బలహీనురాలైన స్త్రీని ఇంకనూ వేశ్యగా వాడుకొనుచున్నారుగదా! అది మరెన్నికిని వ్యభిచారము చేయకమానదు అని నేను తలంచితిని.
44. వారు ఆ వేశ్యలను పలుమారులు సందర్శించిరి. వ్యభిచారిణులైన ఒహోలాను, ఒహోలీబాను పెక్కుమారులు సమీపించిరి.
45. సజ్జనును ఆ స్త్రీలు రంకులు, హత్యలు, నేరములను చేసిరని తీర్పు చెప్పుదురు. వారు రంకాడిరి. వారి చేతులు నెత్తురులో తడిసినవి.”
46. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు: ”ఈ స్త్రీలను భయప్టిె దోచుకొనుటకుగాను మీరొక పెద్ద గుంపును తీసికొనిరండు.
47. ఆ మూక వారిపై రాళ్ళురువ్వునుగాక! వారిపై కత్తులుదూసి వారి పిల్లలను చంపి, వారి ఇండ్లను తగులబెట్టునుగాక!
48. నేను దేశమునుండి వ్యభిచారమును తొలగింతును. వారివలె ఏ స్త్రీయుకూడ వ్యభిచారము చేయరాదని హెచ్చరింతును.
49. అక్కచెల్లెండ్రలారా! మీరు రంకాడి నందులకుగాను, విగ్రహములను సేవించినందులకు గాను నేను మిమ్మిద్దరిని దండింతును. అప్పుడు నేను యావే ప్రభుడనని మీరు గ్రహింతురు.”