త్రుప్పుప్టిన వంటపాత్రము

24 1. అంతట తొమ్మిదవయేడు, పదియవనెల, పదియవ దినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నరపుత్రుడా! ఈ రోజు తేదీని లిఖించి ఉంచుము. నేడు బబులోనియా రాజు యెరూషలేము ముట్టడిని ప్రారంభించెను. 3. ఈ తిరుగుబాటుదారులకు నీవు ఈ సామెతను చెప్పుము. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు.

               వంట పాత్రమును పొయ్యిమీద ప్టిె

               దానిలో నీళ్ళు పోయుము.

4.           దానిని మేలైన మాంసపు ముక్కలతో

               తొడజబ్బ మొదలగు మంచిమంచి 

               ముక్కలన్నింని చేర్చి, అందులోవేసి,

               మంచి ఎముకలను ఏరి దానిని నింపుము.

5.           మంచి గొఱ్ఱెనే ఎన్నుకొనుము.

               కుండ క్రింద కట్టెలు చాలాపేర్చుము.

               నీిని బాగుగా మరగబ్టెి పొంగువరకు

               మాంసమును, ఎముకలను

               చాలినంతగ ఉడుకబెట్టుము.

6.           యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు;

               నరహంతల నగరము నాశమగును.

               అది మాలిన్యముప్టిన పాత్రమువింది.

               ఆ మాలిన్యమును తొలగింపరైరి.

               కుండలోని మాంసపుముక్కలన్నిని

               తీసివేయుదురు.

               చీట్లు వేయకయే ఒక్కదానినికూడ మిగులనీయరు.

7.            నగరమున నెత్తురు చిందించిరి.

               ఆ రక్తమును నేలమీదనే చిందించినచో

               ధూళి దానిని కప్పివేసెడిది

               కాని దానిని బండమీద ఒలికించిరి.

8.           నా కోపమురానిచ్చి నేను ప్రతీకారము

               చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా

               దానిని బండమీదనే ఉండనిచ్చితిని.

9.           యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు:

               నరహంతల నగరము నాశనమగును.

               నేనే కట్టెలు పేర్తును.

10.         నీవు ఇంకను ఎక్కువ కట్టెలు కొనివచ్చి

               మంటలు లేపుము. మాంసమును ఉడుకబ్టెి,

               మసాలా కలుపుము. ఎముకలను మాడనిమ్ము.

11.           ఖాళీ యిత్తడి పాత్రమును పొయ్యిమీద

               ప్టిె ఎఱ్ఱగా మండునట్లు చేయుము.

               దానిలోని మాలిన్యము కరగిన పిమ్మట

               అది శుద్ధిచెందును.

12. నేను ఎంత కష్టపడి అలసటచెందినను దాని మాలిన్యము అంతయు మంటలో కరగిపోదు.

13. యెరూషలేమూ! నేను నీ వ్యభిచార మాలిన్యమును తొలగింపగోరితిని. కాని నీవు నీ మురికిని తొలగించు కొనుటకు ఇష్టపడవైతివి. నేను నీపై నా కోపము తీర్చుకొనువరకును నీవు శుద్ధిచెందవు.

14. ప్రభుడనైన నేను మాట పలికితిని. దానిని జరిగించి తీరుదును. నేను వెనుకాడను. నీపై దయచూపను. నిన్ను కరుణింపను. నీ క్రియలకు తగినట్లుగా నిన్ను శిక్షింతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

ప్రవక్త భార్య మరణము

15. ప్రభువువాణి నాతో ఇట్లనెను:16. ”నర పుత్రుడా! నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అక స్మాత్తుగా నీనుండి తొలగింతును. కాని నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరుకార్చవద్దు.

17. మృతునికై విలాపము చేయక నిట్టూర్పు విడువుము. నీవు సంతాపసూచకముగా తలపాగాను తీసివేయ కుము, పాదరక్షలు విడువకుము, నీ గడ్డమును కప్పు కోవలదు, దుఃఖించువారికి జనులొసగెడి ఆహారమును భుజింపవలదు”.

18. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మ్లాడితిని. ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసినాి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసితిని.

19. ప్రజలు ‘నీ చెయిదముల భావమేమి’ అని అడిగిరి.

20. ”నేనిట్లింని: ప్రభువువాణి నాతో ఇట్లుచెప్పెను: 21. ‘నీవు యిస్రాయేలీయులతో ఇట్లు నుడువుము: ప్రభువు వాక్కిది: మీరు దేవాలయ బలమునుజూచి గర్వించుచున్నారు. దానిని సందర్శించి దానినిజూచి ఆనందింపగోరుచున్నారు. కాని ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు.

22. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ గడ్డములను కప్పుకొనరు, దుఃఖించు వారివలె భోజనము చేయరు.

23. మీ తలపాగాలను తీయక, మీ పాదరక్షలను పాదములనుండి తీయక, అంగలార్పక, ఏడ్వక ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషములను బ్టి మీరు క్షీణించిపోదురు.

24. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్ల మీరునూ చేయుదురు. ఇదంతయు జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభుడని అర్థము చేసికొందురు. ఇది ప్రభువు వాక్కు.’ ”

25. ప్రభువిట్లనెను: ”నరపుత్రుడా! నేను ఆ ప్రజలనుండి వారి ఆశ్రయమును, అతి శయాస్పద మును, వారు కన్నులకు ఇంపైన దానిని, వారికి ప్రీతిని కలిగించు దేవాలయమును, వారి కుమారులను, కుమార్తెలను నేను తీసివేయు దినమునందు 26. నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీయొద్దకు వచ్చును.

27. నీవు కోల్పోయిన వాక్చక్తిని ఆ దినమున మరల పొందు దువు. నీవు ఆ కాందిశీకునితో స్పష్టముగా మాటలాడు దువు. ఈ రీతిగా నీవు ప్రజలకు గుర్తుగానుందువు. అపుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”