ప్రభువు దినము
30 1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు నా పేరుమీదుగా ప్రవచింపుము. పెద్దగా అరుచుచు ఇట్లు చెప్పుము.
అయ్యో దుర్దినము!
3. ఆ దినము రానేవచ్చినది,
ప్రభువు దినము సమీపించినది.
అది మేఘావృతమైన దినము.
జాతులకు నాశనకరమైన రోజు.
4. ఐగుప్తున పోరు జరుగును.
కూషు వేదనలకు గురియగును.
ఐగుప్తున చాలమందిని వధింతురు.
శత్రువులు ఆ దేశమును దోచుకొని
దాని పునాదులను ధ్వంసము చేయుదురు.
5. కూషు, పూటు, లూదు, అరేబియా, కూబు దేశముల నుండి బాడుగకు వచ్చిన సైనికులును, నా సొంత ప్రజలును గూడ ఆ యుద్ధమున కూలుదురు.
6. ప్రభువు వాక్కిది: ఉత్తరమున మిగ్దోలు నుండి దక్షిణమున సెవెనే వరకును ఐగుప్తును ఆదుకొను వారందరును పోరునచత్తురు. ఐగుప్తునకు గర్వకారణ మైన సైన్యము నాశనమగును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.
7. ఐగుప్తు ప్రపంచములోని అన్ని దేశముల కంటె అదనముగా నాశనమగును. దాని నగరములు ఎడారులగును. 8. ఐగుప్తును తగులబ్టెి దాని సహా యులనందరిని వధించినపుడు, వారు నేనే ప్రభుడనని గుర్తింతురు.
9. ఐగుప్తు నాశనమగుదినము వచ్చినపుడు నేను ఓడలలో కూషునకు దూతలను పంపుదును. చీకు చింత లేక యుండు అచి ప్రజలు తల్లడిల్లుదురు. ఆ దినము సమీపించుచున్నది.
10. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను బబులోనియారాజగు నెబుకద్నెసరు ద్వారా ఐగుప్తు మూకలను నాశనము చేయింతును.
11. అతడు తన క్రూర సైన్యముతోవచ్చి ఆ దేశమును పాడు చేయును. వారు కత్తులతో ఐగుప్తుమీదకి దాడిచేయు దురు. ఆ దేశమున పీనుగులు కుప్పలుగా పడును.
12. నేను నైలు నదిని ఎండబ్టెి ఐగుప్తును దుష్టుల కప్పగింతును. అన్యజాతులు ఆ దేశమునంతిని పాడుచేయును. ఇది ప్రభుడనైన నా వాక్కు.
13. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను నోపు నగరములోని విగ్రహములను, దబ్బరదైవములను నాశనము చేయుదును. ఐగుప్తును పరిపాలించు వాడెవడును ఉండడు. ఆ దేశ ప్రజలెల్లరును భీతిల్లు నట్లు చేయుదును. 14. నేను పత్రోసును ధ్వంసము చేయుదును, ఉత్తరమున సోవానును తగులబెట్టు దును, నో పట్టణమును శిక్షింతును.
15. ఐగుప్తు మహాదుర్గమైన సీనుపై నా కోపము రగుల్కొనును. నో నగరపు ప్రజాసమూహములను హతము చేయు దును.
16. నేను ఐగుప్తునకు నిప్పింంతును. సీను నగరము వేదనలకు గురియగును. నో నగరపు గోడలు కూలును. అది వరదలలో మునుగును.
17. ఓను, పిబేసెతు నగరముల యువకులు పోరునచత్తురు. ఇతర ప్రజలు బందీలగుదురు.
18. నేను ఐగుప్తు అధికారమును వమ్ముచేసి, దానికి గర్వకారణమైన బలగమును తుడిచిప్టిెనప్పుడు, తహపనేసు నగర ముపై చీకట్లు క్రమ్ముకొనును. ఐగుప్తును మేఘములు ఆవరించును. ఆ దేశనగరముల ప్రజలెల్లరును బందీలగుదురు.
19. నేను ఐగుప్తును ఈ రీతిగా శిక్షించినపుడు అచి జనులు నేనే ప్రభుడనని గ్రహింతురు.”
ఐగుప్తురాజు దుర్బలుడగును
20. అంతట పదునొకండవయేడు, మొదినెల ఏడవదినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను: 21. ”నరపుత్రుడా! నేను ఐగుప్తు రాజు హస్తమును విరుగ గ్టొితిని. దానికెవరును కట్టుకట్టలేదు. దానిని ఎత్తిప్టి త్రాితో కట్టలేదు. కనుక అది మరల కుదురుకొని బలపడి ఖడ్గమును పట్టజాలదు.
22. కావున యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను: ‘నేను ఐగుప్తు రాజునకు శత్రువునగుదును. అతని రెండు చేతులను- మంచి చేతిని, ఇదివరకే విరిగిన చేతినిగూడ విరుగ గొట్టుదును. అతని చేతినుండి ఖడ్గము జారిపడును.
23. నేను ఐగుప్తీయులను జాతులనడుమను దేశముల మధ్యను చెల్లాచెదరు చేయుదును.
24. అటుపిమ్మట బబులోనియారాజు హస్తములను బలపరచి నా ఖడ్గమును అతని చేతికందింతును. కాని ఐగుప్తురాజు హస్తములు విరుగగొట్టుదును. అతడు తన శత్రువుల ముందట మూలుగుచు ప్రాణములు విడుచును.
25. నేను బబులోనియా రాజు చేతులను బలపరుతును. ఫరో చేతులు చచ్చుపడును. నేను బబులోనియా రాజు చేతికి కత్తినందింపగా, అతడు దానిని ఐగుప్తువైపునకు త్రిప్పును. అపుడు ఎల్లరును నేనే ప్రభుడనని గ్రహింతురు. 26. నేను ఐగుప్తీయులను లోకమందంతట చెల్లా చెదరు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని తెలిసికొందురు.”