గోగు ఓటమి

39 1. ప్రభువిట్లనెను: నరపుత్రుడా! రోషు, మెషెకు, తుబాలు జాతులకు అధిపతియైన గోగును ఖండింపుము. నేనతనికి శత్రువునగుదునని చెప్పుము.

2. అతనిని క్రొత్తదారి ప్టింతును. అతనిని దూరముననున్న ఉత్తర ప్రాంతమునుండి తోడ్కొనివచ్చి యిస్రాయేలు కొండల మీదికి తీసికొనివత్తును.

3. అతని ఎడమచేతిలోని వింని, కుడిచేతిలోని బాణములను పడగొట్టుదును.

4. గోగు అతనిసైన్యము, అతని పక్షమున అవలంబించిన వారు యిస్రాయేలు కొండలపై కూలుదురు. వన్య మృగములు, పకక్షులు వారి శవములను తినివేయును.

5. వారు పొలములలో కూలుదురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

6. నేను మాగోగు దేశమునను, ప్రజలు నిశ్చింతగా జీవించు సముద్రతీరములందును మంటలు లేపుదును. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు.

7. నా ప్రజలైన యిస్రాయేలీయులు నా పవిత్రనామమును గుర్తింతురు. నా నామమునకు ఇక అపకీర్తి కలుగదు. అప్పుడు జాతులు నేను ప్రభుడననియు, యిస్రాయేలు కొలుచు పవిత్ర దేవుడ ననియు గ్రహించును.

8. యావే ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. నేను చెప్పినదంతయు జరిగితీరును. నేను పేర్కొనిన దినము వచ్చితీరును.

9. యిస్రాయేలు నగరములలో వసించు వారు వెలుపలికి వెళ్ళి శత్రువులు వదలిప్టిెన ఆయు ధములను వంటచెరకుగా ప్రోగుజేసికొందురు. వారు డాళ్ళు, విండ్లు, బాణములు, బల్లెములు, ఈటెలు, గదలు మొదలైన వానిని పొయ్యిలో పెట్టుకొందురు. అవి ఏడేండ్లవరకు వారికి వంటచెరకుగా ఉపయోగ పడును.

10. వారు పొలములలో పుల్లలు ఏరుకొన నక్కర లేదు. శత్రువులు వదలిప్టిెన ఆయుధములే వారికి వంటచెరకగును. వారు తమను దోచుకొనిన వారిని దోచుకొందురు. తమను కొల్లగ్టొిన వారిని కొల్లగొట్టుదురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

గోగును పాతిపెట్టుట

11. ప్రభువిట్లనెను: ఆ కాలమున నేను గోగును పాతిపెట్టుటకు యిస్రాయేలు దేశమున తావునిత్తును. సముద్రమునకు తూర్పున, ప్రయాణికులు పోవు లోయలో ఆ తావును ఏర్పరచెదను. గోగును, అతడి సైన్యమును అచటనే పాతిపెట్టుదురు. ప్రయాణికులు పోవుటకు వీలులేకుండా ఆ తావునకు హమోన్‌గోగు1 అని పేరు పెట్టుదురు.

12. దేశమును శుద్ధి చేయుచు యిస్రాయేలీయులు ఏడునెలలుపాటు శవములను పాతిపెట్టుదురు.

13. వారిని పాతిపెట్టుటకు, దేశము లోని ప్రజలెల్లరు సాయపడుదురు. నేను విజయము బడసిన దినమున ఈ కార్యమునకుగాను వారికి కీర్తి లభించును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

14. ఏడు నెలలు గడచిన పిదప ప్రజలు ఎన్నుకొనిన వారు కొందరు దేశమున సంచరించి, ఇంకను నేలపై మిగిలి యున్న శవములను పాతిప్టిెంతురు. అప్పుడుగాని దేశము శుద్ధికాదు.

15. ఆ మనుష్యులు దేశము నలుమూలల తిరుగునప్పుడు నరాస్థికలు కన్పించెనేని వాని ప్రక్క ఒకగుర్తు పెట్టుదురు. తరువాత పాతి పెట్టువారు వచ్చి వారిని హమోన్‌గోగు లోయలో పాతి పెట్టుదురు.

16. ఆ ప్రాంతమున హమోన్‌ అను పేరుగల ఒక పట్టణము వెలయును. ఈ రీతిగా దేశము మరల శుద్ధినిపొందును.

17. యావే ప్రభువు నాతో ఇట్లనెను: నర పుత్రుడా! ‘నేను సిద్ధముచేయు బలిని భుజించుటకు గాను నలువైపులనుండి పకక్షులను, మృగములను పిలువుము. యిస్రాయేలు కొండలమీద పెద్దబలి జరు గును. అవి అచట మాంసముతిని, నెత్తురు త్రాగ వచ్చును.

18. అవి సైనికుల మాంసము తినును, లోకపు రాజుల నెత్తురు త్రాగును. నేను వారినెల్లరిని గొఱ్ఱెపిల్లలవలె,  పొట్టేళ్ళవలె, మేకపోతులవలె, బాషానులో బలిసిన ఎడ్లవలె వధింతును.

19. నేను ఆ జనులను బలి పశువులవలె వధించినపుడు ఆ మృగములు, పకక్షులు తమకు వలసినంత క్రొవ్వు తిన వచ్చును. తాము మత్తెక్కువరకు నెత్తురు త్రాగవచ్చును.

20. నేను వానికి భోజనము సిద్ధము చేయుదును. అవి గుఱ్ఱములను, సైనికులను, వీరులను కడుపార భుజింపవచ్చును.’ ఇది ప్రభుడనైన నా వాక్కు.

యిస్రాయేలు ఉద్ధరణము

21. ప్రభువిట్లనెను: నేను జాతులకు నా మహిమను చూపింతును. నేను నా హస్తముతో నా న్యాయనిర్ణయ ములను జరిగించు తీరును వానికి చూపింతును.

22. అప్పినుండి యిస్రాయేలీయులు నేను వారి ప్రభుడనైన దేవుడనని గుర్తింతురు.

23. నాకు ద్రోహ ముగా పాపము చేసినందులకు యిస్రాయేలీయులు ప్రవాసమునకుపోయిరని జాతులు గ్రహించును. నేను నా ప్రజల నుండి వైదొలగితిని. శత్రువులు వారిని యుద్ధమున ఓడించి చంపనిచ్చితిని.

24. హేయమైన వారి పాపములకు తగినట్లుగానే నేను వారికి బుద్ధి చెప్పితిని. వారినుండి వైదొలగితిని.

25. ప్రభువిట్లనెను: ”ఇప్పుడు నేను యాకోబు సంతతిని చెరనుండి విడి పింతును. యిస్రాయేలీయులకు దయచూపుదును. నా పవిత్రనామమును కాపాడుకొందును.

26. వారు శత్రువుల పీడనమును తప్పించుకొని స్వీయదేశమున సురక్షితముగా వసించునపుడు, పూర్వము నాకు ద్రోహముచేసి, అవమానము తెచ్చుకొన్న ఉదంత మును మరచిపోదురు.

27. నేను నా ప్రజలను వారి శత్రువుల దేశమునుండి తోడ్కొనివచ్చి పెక్కుజాతు లకు నా పావిత్య్రమును చూపింతును.

28. అప్పుడు నా ప్రజలు నేను వారి ప్రభువును, దేవుడనని గ్రహింతురు. నేను వారిని ప్రవాసమునకు పంపితిని గనుకను, ఇప్పుడు మరల ఒక్కరిని గూడ వదలిపెట్టక అందరిని ప్రవాసమునుండి ప్రోగుజేసి స్వీయదేశమునకు కొని వత్తును. గనుక వారు ఈ అంశమును గ్రహింతురు.

29. నేను యిస్రాయేలీయులపై నా ఆత్మను క్రుమ్మ రింతును. వారినుండి నా మొగమును మరల ప్రక్కకు త్రిప్పుకొనను. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”