దేవాలయములోని పవిత్రస్థానము
41 1-2. అటుపిమ్మట అతడు నన్ను దేవాలయ ములోని పవిత్రస్థలమునకు కొనిపోయి దానికి ఇరు వైపులనున్న స్తంభాకార గోడలను కొలిచెను. ఇవి ఒక్కొక్కి ఆరుమూరల మందము కలిగియుండెను. దాని ప్రవేశద్వారము పదిమూరలు కలిగి, ద్వారమును ఆనుకొని ఇరువైపుల ఒక్కొక్కి ఐదు మూరలు పొడవు కలిగిన గోడలును కలవు. అతడు పవిత్రస్థలమును కొలవగా అది నలుబదిమూరల పొడవు, ఇరువది మూరల వెడల్పు ఉండెను.
దేవాలయములోని గర్భగృహము
3. అటుపిమ్మట అతడు గర్భగృహము లోనికి పోయి, దాని ఇరుప్రక్కలనున్న స్తంభాకార గోడలను కొలవగా ఒక్కొక్కి రెండు మూరల మందము ఉండెను. ప్రవేశద్వారము వెడల్పు ఆరుమూరలు మరియు ప్రవేశ ద్వారమును ఆనుకొని ఇరువైపులనున్న గోడలు ఒక్కొక్కి ఏడు మూరల పొడవు ఉండెను.
4. గర్భగృహమును కొలువగా అది నలుచదరముగా నుండి ఇరువది మూరల పొడవును మరియు పవిత్ర స్థలపు వెడల్పు ననుసరించి ఇరువది మూరలు వెడల్పు కలిగి యుండెను. ఇది పవిత్రస్థలమునకు ఆవలనున్నది. అతడు నాతో అది మహాపవిత్రస్థలమని చెప్పెను.
5. ఆ మనుష్యుడు దేవాలయపు గోడను కొలువగా అది ఆరుమూరల మందముండెను. ఒక్కొక్కి నాలుగు మూరల మందము కలిగిన చిన్నగదులు దేవాలయము చుట్టు ఉండెను.
6. ఈ గదులు ఒక దానిపైన ఒకిగా మూడంతస్తులులో ఉండెను. ఒకొక్క అంతస్తులో ముప్పది గదులుండెను. గదులను చ్టుియున్న దేవా లయపు వెలుపలి గోడనుండి ఆ గదులు గూడులవలె చొచ్చుకొని వచ్చియుండెను గాని అవి దేవాలయపు గోడను ఆధారము చేసుకొనలేదు. దేవాలయపు వెలుపలిగోడ ఒక్కొక్క అంతస్తు పెరిగిన కొలది తగ్గుచూ వచ్చెను.
7. ఒక్కొక్క అంతస్తునకు గోడ మందము తగ్గిన పరిమాణము చొప్పున దేవాలయము చుట్టునున్న ఆయా అంతస్తులలోని గది కొలత పెరుగు చుండెను. వెలుపలినుండి చూచునపుడు దేవాలయపు గోడలు క్రిందినుండి మీదివరకును ఒకే మందము కలిగియుండునట్లు కనిపించెను. దేవాలయపు వెలుపలి గోడ ప్రక్కన, పైగదులకు వెలపలి ప్రక్క రెండు మెట్ల వరుసలు కలవు. క్రింది అంతస్తు నుండి పై రెండు అంతస్తుల లోనికి ఈ మెట్లద్వారా వెళ్ళవచ్చును.
8-11. ఈ గదుల వెలుపలిగోడ మందము ఐదుమూరలు. దేవాలయమునకు ఉత్తరదిక్కున ఈ గదులలోనికి పోవుటకు ఒక తలుపు కలదు. దక్షిణదిక్కుననున్న గదులలోనికి పోవుటకును ఒక తలుపుగలదు. దేవాల యము చుట్టు రాళ్ళుపరిచిన ఐదుమూరల వెడల్పు గల ఎత్తయిన సమతలము ఉండెను. దేవాలయము ప్రక్కనున్న గదులకు పునాదిగానున్న ఈ సమతలకప్పు ఎత్తు ఒక నిండు కొలబద్ద. అనగా ఆరుమూరలు ఉండెను. దేవాలయము ప్రక్కనున్న గదుల పునాదికి ఈ కప్పు సమతలముగా నుండెను. ఈ ఎత్తయిన సమతలమునకును యాజకులు వాడుకొను కట్టడముల కును మధ్య ఖాళీస్థలము కలదు. దాని పొడవు ఇరువది మూరలు. అది దేవాలయము చుట్టును కలదు.
పడమరన ఉన్న కట్టడములు
12. దేవాలయమునకు పశ్చిమమున ఉన్న ఖాళీ స్థలము ప్రక్కన ఒక కట్టడము కలదు. అది తొంబది మూరల పొడవు, డెబ్బదిమూరల వెడల్పునుండెను. దాని గోడల మందము ఐదుమూరలు.
దేవాలయపు మొత్తము కొలత
13. ఆ మనుష్యుడు దేవాలయపు వెలుపలి పొడవును కొలువగా వందమూరలుండెను. దేవాల యము వెనుకనుండి పశ్చిమభాగమునందలి ఖాళీ స్థలములోని కట్టడము చివరివరకును దూరముకూడ వందమూరలు.
14. దేవాలయపు ముందిభాగము ఇరువైపుల నున్న ఖాళీస్థలముతో కలుపుకొని వంద మూరల పొడవుండెను. 15. అతడు పడమరనున్న కట్టడమును దానికిరువైపులనున్న వసారాలతో కలుపు కొని కొలువగా వందమూరలుండెను.
దేవాలయ భాగములు
16. దేవాలయ ముఖమంటపము, పవిత్ర స్థలము, గర్భగృహము నేలమీదినుండి కికీల వరకును కొయ్య పలకలతో కప్పబడి ఉండెను. ఈ కికీలను మూసివేయవచ్చును.
17. దేవాలయపు గోడల లోపలిభాగము తలుపుల పై భాగము వరకును మరియు గర్భగృహము, పవిత్రస్థలము చుట్టునున్న అన్ని గోడలును కొలత ప్రకారము కట్టబడి, చెక్కడ ములతో నిండియుండెను.
18. వానిమీద ఖర్జూర ములను, కెరూబుదూతలను ఒకదాని తరువాత ఒకి వచ్చునట్లుగా చెక్కిరి. ఒక్కొక్క కెరూబుదూతకు రెండేసి మొగములు కలవు.
19-20. మనుష్యముఖము ఒక వైపున నున్న ఖర్జూరమువైపును, కొదమసింహ ముఖము మరియొక వైపునున్న ఖర్జూరము వైపు మళ్ళియుండెను. నేల మీదినుండి తలుపువరకు ఆలయముననున్న గోడఅంతయు ఇట్లే చెక్కబడి యుండెను.
21. పవిత్రస్థలము ద్వారబంధములు చతురస్రముగా ఉండెను.
కొయ్యపీఠము
గర్భగృహము ప్రవేశభాగము ముందట కొయ్య పీఠము విందొకి కలదు.
22. దాని ఎత్తు మూడు మూరలు, వెడల్పు రెండు మూరలు. దాని మూలలు, ప్రక్కలు క్రింది భాగము అంతయు కొయ్యతో చేయబడి ఉండెను. అతడు నాతో ‘ఇది దేవుని సముఖమున నుండెడు బల్ల’ అని చెప్పెను.
తలుపులు
23. పవిత్రస్థలములోనికి పోవు ద్వారమునకు, గర్భగృహములోనికి పోవు ద్వారమునకు రెండేసి తలుపులు కలవు.
24. అవి మధ్యలో తెరచుకొను జంట తలుపులుగానుండెను.
25. పవిత్రస్థలము గోడలమీదవలె తలుపుల మీదకూడ ఖర్జూరములను, కెరూబుదూతలను చెక్కిరి. దేవాలయ ముఖమంటప ద్వారముపైన వెలుపలితట్టున కొయ్యచూరు కలదు.
26. ఈ గది ప్రక్కలందు కికీలు కలవు. దాని ప్రక్క గోడలను ఖర్జూరములతో అలంకరించిరి.