ప్రభువు దేవళమునకు తిరిగివచ్చుట
43 1. అంతట అతడు నన్ను తూర్పునకు అభి ముఖముగా నున్న ద్వారమువద్దకు కొనిపోయెను.
2. అచట నేను యిస్రాయేలు దేవుని తేజస్సు తూర్పునుండి వచ్చుటను చూచితిని. ప్రభువుధ్వానము సముద్ర ఘోషవలె నుండెను. భూమి ఆయన తేజస్సుతో ప్రకా శించెను.
3. ప్రభువు యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చినపుడును, కెబారునది చెంతనుగూడ నేన్టి దర్శనమునే కాంచితిని. అపుడు నేను నేలపై బోరగిలబడితిని.
4. ప్రభువుతేజస్సు తూర్పు ద్వారము నుండి దేవళమును ప్రవేశించెను.
5. దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణము లోనికి కొనిపోయెను. అచట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుట గాంచితిని.
6. ఆ మను ష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ప్రభువు దేవళమును నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింని. 7. ”నర పుత్రుడా! ఇది నా సింహాసనము ఉండుస్థలము. నా పాదపీఠము. నేనిచట యిస్రాయేలు ప్రజలమధ్య సదా నివసించెదను. ఇకమీదట యిస్రాయేలు ప్రజలును, వారి రాజులును విగ్రహారాధన వలనను, రాజులను నాకు చేరువలో పాతిపెట్టుటవలనను నా పవిత్ర నామమును అమంగళము చేయరు.
8. రాజులు వారి ప్రాసాదపు ద్వారబంధములను, గడపలను నా దేవాల యపు ద్వారబంధములకును, గడపలకును చేరువలో క్టిరి. నాకును వారికిని మధ్య ఒక్క గోడమాత్రమే అడ్డము కలదు. వారు తమ హేయమైన కార్యముల ద్వారా నా పవిత్రనామమునకు అపకీర్తి తెచ్చిరి. కావున నేను కోపముతో వారిని నాశనము చేసితిని. 9. వారిపుడు విగ్రహారాధనను మానుకొని, తమ రాజుల శవములను నా సన్నిధినుండి తొలగింపవలెను. నేను వారి నడుమ శాశ్వతముగా వసింతును.
10. నరపుత్రుడా! యిస్రాయేలీయులు వారు తమ పాపములకు సిగ్గుపడునట్లు దేవళమును గూర్చియు, దాని వివిధ భాగములను గూర్చియు తెలియజెప్పుము.
11. వారు తమ ప్రవర్తనకు సిగ్గు పడుదురేని, నీవు వారికి ఆలయము ఆకారము గూర్చియు, దాని ప్రవేశద్వారములు, నిష్క్రమణ ద్వారములు, దాని ఏర్పాటు, దాని నియమములు మొదలైన అంశములను గూర్చియు వివరింపుము. ఈ అంశములన్నియు వారికి వ్రాసియిమ్ము. అపుడు వారు దేవాలయము ఎట్లు ఏర్పాటు చేయబడునో గ్రహింతురు. దానిని గూర్చిన నియమములన్నింని పాింతురు.
12. కొండమీద దేవళముచుట్టునున్న స్థలమంతయు పరమపవిత్రమైనది. దేవళమును గూర్చిన విధి యిదియే.
బలిపీఠము
13. బలిపీఠము కొలతలివి. మూర ఒకి ముంజేతిపొడవు మరియు అరచేయి వెడల్పు కలిపి నంత పొడవుండెను. బలిపీఠము: ఒక మూర ఎత్తు, ఒక మూర వెడల్పు గల పాదుచుట్టు, దానికి వెలుపలి ప్రక్కన ఒక జేన వెడల్పు అంచుకలదు.
14. నేలమీది పాదునుండి మొదలుప్టిెనచో పీఠము క్రిందికట్టు వరకు ఎత్తు రెండుమూరలు, గనిమ వెడల్పు ఒక మూర. క్రిందికట్టునుండి పైకట్టు వరకు ఎత్తు నాలుగు మూరలు, గనిమ వెడల్పు ఒకమూర. పైకట్టునుండి పీఠముయొక్క ఉపరిభాగము క్రిందికి నాలుగుమూరల ఎత్తు ఉండెను.
15. ఈ మూడవదే పై భాగము. దానిపై పశువులను దహించెడివారు. దాని ఎత్తు నాలుగు మూరలు. ఈ మూడవ భాగము నుండి నాలుగుమూలలను నాలుగుకొమ్ములు వ్యాపించి, మిగిలిన భాగముకంటె ఎత్తుగానుండెను.
16. పీఠము ఉపరిభాగము పన్నెండు మూరల నలుచదరము.
17. పైనున్న గనిమ పదునాలుగు మూరల నలు చదరము. దానికిచుట్టు ఒక మూర అలుగు దానిపైన ఒక జేన ఎత్తు గల అంచు కలదు. తూర్పు దిక్కున పీఠము మీదికెక్కుటకు మెట్లు కలవు.”
బలిపీఠమును ప్రతిష్టించుట
18. యావేప్రభువు నాతో ఇట్లనెను: ”నరపుత్రుడా! నా మాటలు ఆలింపుము. మీరు ఈ బలిపీఠమును నిర్మించి దానిని ప్రతిష్ఠించినపుడు దానిపై పశువులను దహనబలిగా అర్పింపవలెను. వాని నెత్తుిని దానిపై చల్లవలెను.
19. లేవీ తెగలో సాదోకు వంశజులైన యాజకులు మాత్రమే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను అర్చింపవలెను. ఇది యావే ప్రభుడనైన నా ఆజ్ఞ. పాపపరిహారబలిని అర్పించుటకు నీవు ఆ యాజకు లకు ఒక కోడె నీయవలయును. 20. నీవు దాని నెత్తుిని కొంచెము తీసికొని పీఠము ఉపరిభాగము మూలలందున్న కొమ్ములకును, ఉపరిభాగపు నాలుగు మూలలకును, అంచులచుట్టును పూయవలెను. ఈ రీతిగా నీవు బలిపీఠమును శుద్ధిచేసి ప్రతిష్ఠింపవలెను.
21. పిమ్మట పాప పరిహారబలిగా అర్పించిన కోడెను కొనిపోయి దేవాలయము వెలుపల నిర్ణీతస్థలమున దహింపవలెను.
22. ఆ మరుసి రోజున ఎి్ట లోపములులేని మేకపిల్లను పాపపరిహారబలిగా అర్పింపవలెను. కోడె నెత్తుితోవలె ఈ మేకపిల్ల నెత్తుితోగూడ బలిపీఠమును శుద్ధి చేయవలయును.
23. ఈ కార్యము ముగించిన తరువాత ఎి్ట లోపములేని కోడెను, పొట్టేలిని గైకొని, 24 వానిని నా వద్దకు కొనిరమ్ము. యాజకులు వానిపై ఉప్పు చల్లి వానిని నాకు దహనబలిగా అర్పింతురు.
25. ఏడురోజులపాటు ప్రతిరోజు నీవు నాకు పొట్టేలిని, మేకను, కోడెను పాపపరిహారబలిగా అర్పింపవలెను. ఆ బలిపశువులలో ఎి్ట లోపము ఉండరాదు.
26. యాజకులు ఏడు నాళ్ళు బలిపీఠమును ప్రతిష్ఠించి దానిని బలులర్పించుటకు సిద్ధము చేయవలయును.
27. ఏడునాళ్ళు ముగిసినపిదప వారు ప్రజలు కొని వచ్చు సమాధానబలులను, దహనబలులను పీఠముపై అర్పించవచ్చును. అపుడు నేను మిమ్ము ప్రీతితో చూతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”