ప్రభువు భూమి

45 1. ”మీరు చీట్లువేసి, ఒక్కొక్కతెగకు భూమిని పంచి ఇచ్చినపుడు ప్రతిష్ఠిత అర్పణముగా ఒక భాగ మును దేవునికి అర్పింపవలెను. అది ఇరువదిఐదువేల మూరల పొడవును, ఇరువదివేల మూరల వెడల్పు నుండవలెను. ఆ భాగమంతయు పవిత్రమైన నేలయగును.

2. ఈ నేలలో ఐదువందల మూరల నలుచదరపు భాగము దేవాలయమునకు వినియోగింపబడును. దాని చుట్టును ఏబది మూరల వెడల్పు గల ఖాళీస్థల ముండవలెను.

3. ప్రభువునకు నివేదించిన నేల మొత్తములో సగభాగము అనగా ఇరువది ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుగల నేలను ప్రత్యే కింపవలెను. అందులో మహాపవిత్రస్థలము, పవిత్ర స్థలములుండును.

4. అది దేశమున పవిత్రభూమి యగును. దేవాలయమున ప్రభువు నర్చించు యాజకులు దానిని వాడుకొందురు. దానిలో గృహములును దేవాలయ మునకు ఉద్దేశింపబడిన భూమియునుండును.

5. మిగిలిన సగభాగము దేవాలయమున ఊడిగము చేయు లేవీయులకు చెందును. అచట వారు వసించు టకు నగరములుండును.

6. ఈ దేవుని భాగమునకు ప్రక్కన మరియొక భాగమును విభజింపవలెను. యిస్రాయేలీయులెవరైనను వసించుటకు దానిలో ఒక నగరముండును. దాని పొడవు ఇరువది ఐదువేల మూరలు, వెడల్పు ఐదువేల మూరలు.

రాజు భూమి

7. రాజునకుకూడా ఒక భాగము విభజింపవలెను. అది రెండు ప్రక్కలను అనగా పవిత్ర భూమి నానుకుని ఒకప్రక్కను మరియు తూర్పు పడమడరలుగా నగర భాగము నానుకొని మరియొకప్రక్కను విస్తరించి ఉండవలెను. దాని పొడవు యిస్రాయేలీయుల ఒకతెగకు లభించు భాగమునకు సమానముగ నుండును.

8. యిస్రాయేలు దేశమున ఈ భాగమును రాజు తీసికొనును. కనుక అతడు ప్రజలను పీడింపడు. మిగిలిననేల యిస్రాయేలులోని ఆయాతెగలకు దక్కును.

రాజునకు నియమములు

9. యావే ప్రభువు ఇట్లనెను: యిస్రాయేలు రాజు లారా! మీరు చేసిన పాపములు చాలును. ఇక మీరు హింసను, పీడనమును మానుడు. నీతిన్యాయములను పాింపుడు. ఇకమీదట మీరు నా ప్రజలను దేశము నుండి వెళ్ళగొట్టరాదు. ఇది యావే  ప్రభుడనైన నా వాక్కు.

10. ఎల్లరును న్యాయమైన త్రాసులను, కొల మానములను, పడికట్టురాళ్ళను వాడవలెను.

11. ఘనపదార్థములను కొలుచు పడి, ద్రవపదార్ధములను కొలుచు తూము సమానముగానుండవలెను. పందుమును సామాన్య పరిమాణముగానెంచుడు. కావున ఒక తూము పందుములో పదియవవంతు.

12. మీ పడి కట్టురాళ్ళు ఇట్లుండవలెను. ఒక తులము 20 చిన్నములు, 60 తులములు అరవీసె.

బలులు

13-15. మీరు అర్పించు బలులకు నియమములివి. మీకు పండినపంటలో అరువదియవవంతు గోధు మలను, అరువదియవవంతు యవలను చెల్లింపుడు. మీకు లభించు ఓలివుతైలములో నూరవవంతు చెల్లింపుడు. పదితూములు ఒక పందుమగును. మీ పొలములోని ప్రతి రెండువందల గొఱ్ఱెలకును ఒకి చొప్పున సమర్పింపుడు. మీరు ధాన్యబలులను, దహన, సమాధానబలులకు వలయు పశువులను కొనిరండు. దానివలన మీ పాపములు పరిహార మగును. ఇది యావే ప్రభుడనైన నా శాసనము.

16. దేశ ప్రజలెల్ల ఈ అర్పణములను రాజు వద్దకు కొనిరావలెను.

17. అమావాస్య పండుగ లందును, ఇతర ఉత్సవములందును, విశ్రాంతిదినము లందును దహనబలులను, ధాన్యబలులను, పానీ యార్పణములను యిస్రాయేలీయులందరి కొరకు అర్పించుట అతని బాధ్యత. ప్రజల పాపముల పరి హారమునకుగాను అతడు ప్రాయశ్చిత్త బలులను, ధాన్య బలులను, దహన, సమాధానబలులను అర్పింపవలెను.

ఉత్సవములు

18. ప్రభువు ఇట్లనెను: మీరు మొది నెల మొది రోజున ఎి్ట లోపములేని కోడెను బలి యిచ్చి దేవాలయమును శుద్ధిచేయవలెను.

19. పాపపరిహార బలిగా అర్పించు ఈ కోడె నెత్తుిని యాజకుడు కొంచెము తీసికొని మందిరపు ద్వారబంధములకును, బలిపీఠము నాలుగు కొమ్ములకును, లోపలి ఆవరణము ద్వారబంధములకును పూయవలెను.

20. ఎవరైన అజ్ఞానమువలనగాని, అనాలోచితముగాగాని పాప ములు చేసినచో వాని పరిహారము కొరకుకూడ నెల ఏడవనాడు మీరు ఈ రీతినే చేయవలెను. ఈ విధముగా మీరు  దేవాలయమున ప్రాయశ్చిత్తము చేయుదురు.

21. మొది నెల పదునాలుగవ దినమున మీరు పాస్కాపండుగను ప్రారంభింపవలెను. ఎల్లరును ఏడునాళ్ళపాటు పులిపిడి ద్రవ్యము కలుపని రొట్టెలను భుజింపవలెను.

22. ఉత్సవము మొదిదినమున రాజు తన పాపములును, ప్రజల పాపములును పరిహారమగుటకు కోడెను అర్పింపవలెను.

23. అతడు ఉత్సవము ఏడునాళ్ళ పొడవున ప్రతిదినమును ఎి్ట లోపములులేని ఎడ్లను ఏడింని, పొట్టేళ్ళను ఏడింని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలెను. ఇంకను ప్రతిదినము ప్రాయశ్చిత్తబలిగా ఒక మేకపోతునుగూడ అర్పింపవలెను.

24. ఇంకను బలి ఇచ్చిన ప్రతి ఎద్దున కును, ప్రతి పొట్టేలునకు ఒక తూము పిండిప్టిన ధాన్యమును, మూడుపడుల ఓలివుతైలమును అర్పింప వలెను.

25. ఏడవనెల పదిహేనవ దినమున ప్రారంభ మగు గుడారముల పండుగలోకూడ రాజు ఏడు దిన ములపాటు ప్రతిరోజు పై విధముననే పాప పరిహార బలిని ధాన్యతైలార్పణములను అర్పింపవలెను.”