దేవాలయము క్రిందినుండి పారు ఏరు
47 1. అతడు నన్ను మరల దేవళము గుమ్మము నొద్దకు కొనివచ్చెను. దేవళము తూర్పుముఖముగా నుండెను. దేవళముగడప క్రిందినుండి నీరువూరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవళము కుడిప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను.
2. అతడు నన్ను దేవాలయ ఆవరణమునుండి ఉత్తరద్వారము గుండ వెలుపలికి చుట్టును కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసికొనిపోయెను. అచట ద్వారము దక్షిణదిక్కున చిన్న కాలువ పారుచుండెను.
3. అతడు తన కొలతకఱ్ఱతో కాలువను తూర్పు వైపునకు వేయిమూరలు వరకు కొలిచెను. అచటనున్న నీిగుండ నన్ను దాించెను. అచట నీళ్ళు నా చీలమండలము వరకు మాత్రమే వచ్చెను.
4. అతడు మరల వేయిమూరల దూరము కొలిచి అచట నాచే నీిని దాించెను. అక్కడ నీళ్ళు నా మోకాళ్ళవరకు వచ్చెను. మరల వేయిమూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్ళను దాింపగా, నీళ్ళు నా నడుము వరకు వచ్చెను.
5. అతడు మరల వేయిమూరల దూరము కొలిచెను. కాని అచట ఏరు చాల లోతుగానుండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈదిననే గాని అచట ఏిని దాటజాలనైతిని.
6. అతడు నాతో” నరపుత్రుడా! దీనిని జాగ్రత్తగా గమనింపుము” అనెను. అతడు నన్ను మరల ఏి ఒడ్డునకు కొని పోయెను.
7. నేనచికి చేరుకొని ఏికిరువైపుల చాల వృక్షములుండుట చూచితిని.
8. అతడు నాతో ఇట్లనెను: ”ఈ నీళ్ళు తూర్పుదిక్కుగా ప్రవహించి యోర్ధాను లోయనుచేరి అచటనుండి మృతసముద్రమున కలియును. వీనివలన దానిలోని ఉప్పునీళ్ళు మంచినీళ్ళగును.
9. ఈ నీళ్ళు పారిన తావులందెల్ల వివిధ జంతువులు, చేపలు వర్థిల్లును. ఈ ఏరు మృతసముద్రమును మంచి నీిని చేయును. ఇది పారిన తావులందెల్ల జీవము నెలకొనును.
10. ఎంగెది చెలమల నుండి ఎనెగ్లాయిము ఊటలవరకును సముద్రపుొడ్డున బెస్తలు సంచరింతురు. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచట మధ్యధరాసముద్రమున దొరికినన్ని చేపలు దొరకును.
11. కాని అచి ఒడ్డుననున్న కుంటలలోను, బురద గుంటలలోను ఉన్న జలములు మంచినీళ్ళుగా మారవు. అవి ఉప్పునీళ్ళుగానే ఉండి, ఉప్పు చేయుటకు ఉప యోగపడును.
12. ఆ ఏి యొడ్డులపై అన్నిరకముల పండ్లచెట్లు పెరుగును. వాని ఆకులువాడవు. అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయమునుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతినెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును, ఆకులు ఔషధమునకును ఉపయోగపడును.”
దేశమునకు ఎల్లలు – భూవిభజన
13. యావే ప్రభువు ఇట్లనెను: ”మీరు పండ్రెండు తెగలకును వారసత్వముగా పంచి ఈయవలసిన భూమి ఎల్లలు ఇవి. యోసేపు తెగకు రెండువంతులు రావలెను.
14. ప్రతియొక్కడు దానిలో ఏ బేధము లేకుండ తన వారసఆస్థిని కలిగియుండును. ఎందుకన నేను నా హస్తమును పైకెత్తి ప్రమాణము చేయుచూ దానిని మీ పితరులకు దత్తముచేసితిని. అందుచేత ఈ దేశము మీకు వారసఆస్థిగా నుండవలెను.
15. ఈ దేశపు ఎల్లలివి: ఉత్తరమున మహా సముద్రము నుండి హెత్లోను దిశగా లెబోహాయారు, సేదాదు, 16. బెరొతా, దమాస్కు, హామాతు ప్రాంత ముల మధ్యనున్న సిబ్రాయిము, హౌరాను పర్వతముల మీదనున్న హాసారుఏనోను వరకు ఉన్నభాగము.
17. అందుచేత ఈ సరిహద్దు సముద్రము మొదలుకొని హాసారుఏనోను వరకు ఉన్న స్థలము. దమాస్కు, సాఫోను, హామాతు ప్రాంతములు దీనికి ఉత్తరముగా నుండును. ఇది ఉత్తరపు సరిహద్దు.
18. తూర్పుదిశన యోర్దాను నది గిలాదుకును యిస్రాయేలు దేశమునకును మధ్యగా హౌరాను పర్వతములకు దమాస్కునకు మధ్యనున్న హాసారు ఏనోను మొదలుకొని తూర్పుదిశన ఉన్న సముద్రము, తామారు వరకు ఈ సరిహద్దు ఉండును. ఇది తూర్పు సరిహద్దు.
19. దక్షిణపు సరిహద్దు నెగెబులో ఉండును. తామారు మొదలుకొని మెరిబా, కాదేషు జల ఊటల వరకును, మహాసముద్రములోనికి పారుచున్న వాగు వరకును ఉండును. ఇది నెగెబులో దక్షిణపు సరిహద్దు.
20. పశ్చిమమున మహాసముద్రము లెబోహమాతు వరకు సరిహద్దుగా నుండును. ఇది పశ్చిమ సరిహద్దు.
21. మీరు ఈ భూమిని మీ తెగలకు పంచి యిండు.
22. ఇది మీకు శాశ్వతముగా భుక్తమగును. మీ మధ్య వశించుచు సంతానమును కనిన అన్యజాతి వారికికూడ మీరు ఈ నేలను పంచియీయవలయును. మీరు వారిని యిస్రాయేలు పౌరునివలె గణింప వలయును. యిస్రాయేలు తెగలకువలె వారికికూడ చీట్లు వేసి నేలను పంచిపెట్టవలయును.
23. ప్రతి అన్యజాతి పౌరుడును తాను ఏ తెగతో వశించునో ఆ తెగపౌరులతోపాటు తన వాను స్వీకరించును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”