మతహింసలలో దైవభక్తి

2 1.         కుమారా! నీవు దేవుని సేవింపగోరెదవేని

                              పరీక్షకు సిద్ధముగా నుండుము.

2.           చిత్తశుద్ధితోను, పట్టుదలతోను మెలగుము.

               ఆపదలు, వచ్చినపుడు నిబ్బరముగా నుండుము.

3.           ప్రభువును ఆశ్రయింపుము.

               ఆయనను విడనాడకుము.

               అప్పుడు నీ జీవితాంతమున విజయమును

               పొందుదువు.

4.           నీక్టిె ఆపదలు వచ్చినను

               వానినెల్ల అంగీకరింపుము.

               శ్రమలు కలిగినను సహనముతో ఉండుము.

5.           కుంపిలో పుటము వేయుట బంగారమునకు పరీక్ష.

               శ్రమలకు గురియగుట నరునికి పరీక్ష.

6.           ప్రభువును నమ్మెదవేని ఆయన నిన్ను కాపాడును. ఋజుమార్గమున నడచుచు ప్రభువును విశ్వసింపుము.

7.            దైవభీతి కలవారందరు ప్రభుని దయకొరకు

               వేచియుండుడు.

               అతనిని విడనాడెదరేని మీరు తప్పక నశించెదరు.

8.           దైవభీతి కలవారందరు ప్రభుని నమ్ముడు.

               మీరు బహుమతిని పొందెదరు.

9.           దైవభీతి గలవారందరు శుభముల నాశింపుడు.

               ప్రభువునుండి కరుణను,

               నిత్యానందమును పొందుడు.

10.         పూర్వతరములను పరిశీలించి చూడుడు.

               ప్రభువును నమ్మినవాడెవడైన భంగపడెనా?

               నిరంతర దైవభీతి కలవానినెవనినైన

               ప్రభువు చేయివిడచెనా?

               తనకు మొరప్టిెన వారినెవరినైన

               ఆయన అనాదరము చేసెనా?

11.           ప్రభువు దయ, కనికరము కలవాడు.

               ఆయన మన పాపములను మన్నించును.

               ఆపదలలో నుండి మనలను కాపాడును.

12. పిరికివారు అధోగతి పాలయ్యెదరు.

               ఏ ఎండకు ఆ గొడుగుపట్టు

               పాపులు నాశనమయ్యెదరు.

13. ధైర్యము కోల్పోవువారు చెడుదురు.

               వారు విశ్వాసమును కోల్పోయిరి

               కనుక వారినెవరును రక్షింపరు.

14. పోరాటమునుండి వైదొలగు వారికి

               అనర్థము కలుగును.

               ప్రభువు తీర్పు తీర్చుటకు వచ్చినపుడు 

               వారికి దిక్కెవరు?

15. దైవభీతి కలవారు ప్రభుని ఆజ్ఞలు ఉల్లంఘింపరు.

               దైవప్రేమ కలవారు ప్రభువు మార్గములను

               విడనాడరు.

16.          దైవభీతి కలవారు ప్రభువునకు

               ప్రియము గూర్తురు.

               దైవప్రేమ కలవారు ధర్మశాస్త్రమునకు

               బద్ధులగుదురు.

17.          దైవభీతి కలవారు దేవుని సేవించుటకు

               సిద్ధముగా ఉందురు.

               దేవునిఎదుట వినయవిధేయతలను

               ప్రదర్శింతురు.

18. వారు ‘మేము దేవుని పాలబడెదము కాని

               నరుల పాలబడుటకు ఇష్టపడము.

               ఆ ప్రభువు మహాత్మ్యమువలెనే

               ఆయన కరుణయు ఘనమైనది’ అని పలుకుదురు.