19 1. త్రాగుబోతు సంపన్నుడు కాజాలడు.
చిన్న విషయములలో జాగ్రత్త చూపనివాడు
క్రమముగా నశించును.
2. మధువు, ముదితలు విజ్ఞులజ్ఞానమును చెరతురు
వేశ్యలను కూడువాడు శీలము కోల్పోవును.
3. శీలము కోల్పోయిన వాడు
ప్రాణహాని తెచ్చుకొనును.
కుళ్ళుప్టి పురుగులు పడిచచ్చును.
వదరుబోతుతనము
4. ప్రజలను సులభముగా నమ్మువాడు
తెలివిలేనివాడు.
పాపము చేయువాడు తనకు తానే
హానిచేసికొనును.
5. దుష్కార్యములందు అనురక్తి చూపువాడు
నిందితుడగును.
6. వాచాలత్వమును క్టిపెట్టువాడు
పాపమును జయించును.
7. ఒకరినుండి విన్నదానిని ఇతరులకు చెప్పకుము.
అప్పుడు నీవు పశ్చాత్తాపపడవలసిన
అవసరముండదు.
8. నీవు విన్న సంగతిని ఇతరులకు చెప్పకుము. ఇతరులకు చెప్పకుండుట పాపహేతువైననే తప్ప,
మిత్రులకుగాని, శత్రువులకుగాని
దానిని చెప్పవద్దు.
9. నీ నుండి ఆ వర్తమానమును వినినవాడు
నిన్ను శంకించును.
అటుపిమ్మట నిన్నుగూడ ద్వేషించును.
10. నీవేదైన సంగతిని విన్నచో
దానిని నీతోనే సమసిపోనిమ్ము. భయపడకుము.
దానివలన నీ కడుపు పిగిలిపోదు!
11. మూర్ఖుడు తాను విన్న రహస్యమును
దాచలేక ప్రసవవేదనను అనుభవించు
స్త్రీవలె బాధపడును.
12. తొడలో దిగబడిన బాణమ్లెో
మూర్ఖుని యెదలోనున్న రహస్యవార్తలు అట్లుండును
మనము విన్నదియల్ల నమ్మకూడదు
13. నీ మిత్రుడేదో పాడుపని చేసెనని వార్త పొక్కినచో
అతనినే అడుగుము,
అతడు అి్ట పనిని చేసియుండకపోవచ్చును.
ఒకవేళ చేసినా, మరల దానిని చేయబోడు.
14. నీ ప్రక్కవాడేదో పాడుమాట చెప్పెనని వార్త
ప్టుినచో అతనినే అడుగుము,
అతడ్టి మాట చెప్పియుండకపోవచ్చును. ఒకవేళ చెప్పినను మరల ఆ మాటచెప్పడు.
15. నీ మిత్రుని గూర్చి ఏదో వదంతి ప్టుినచో
అతనినే అడుగుము, అది అపనింద కావచ్చును.
మనము వినిన దానినెల్లా నమ్మరాదు.
16. ఒక్కొక్కసారి నరునికి నోరు జారవచ్చును.
కాని అతడామాటను ఉద్దేశపూర్వకముగా
అని యుండకపోవచ్చును.
నోి మాటలలో తప్పులు దొరలని వాడెవడు?
17. ప్రక్కవానినిగూర్చి యేదో విని
వానిని కోపింతువేని,
వానిమీదికి వెళ్ళకముందు అసలుసంగతి
ఏమో అడుగుము.
మహోన్నతుని ధర్మశాస్త్రము అతనికి తీర్పుచెప్పును
నీవు శాంతింపుము.
18. దేవుని మన్ననను పొందుటకు
మొదిమెట్టు దైవభీతి.
విజ్ఞానము కలవానిని ప్రభువు ఆదరించును.
19. ప్రభువు ఆజ్ఞల నెరుగుటయనిన
జీవనదాయకమైన విద్యనుపొందుట,
ఆయనకు ప్రీతిగొల్పు పనులు చేయుట,
జీవనవృక్ష ఫలములను భుజించుట.
సద్విజ్ఞానము, దుష్టవిజ్ఞానము
20. విజ్ఞానమెల్ల దేవునికి భయపడుటయే,
విజ్ఞానమెల్ల దైవాజ్ఞలను పాించుటయే,
ఆ ప్రభువు సర్వాధిపత్యమును గుర్తించుటయే.
21. సేవకుడు యజమానుని ధిక్కరించినచో,
తరువాత అతని మాటవిన్నను
అతని కోపము తగ్గదు
22. దుష్టత్వమునుగూర్చి నీకు
విశేషముగా తెలిసియున్నను,
దానివలన నీవు విజ్ఞుడవు కాజాలవు.
పాపాత్ముల సలహాలను పాించుటలో విజ్ఞతలేదు
23. కొందరు తమ తెలివిని దుష్కార్యములకు
వినియోగింతురు.
కొందరు తెలివిలేకపోవుట వలననే
మూర్ఖులగుదురు.
24. తెలివికలవాడైయుండి
ధర్మవిధులను మీరుటకంటె,
మందబుద్ధియైయుండి
దైవభీతితో బ్రతుకుట మేలు.
25. నరుడు ధీమంతుడయినా
ధర్మవర్తనుడు కాకపోవచ్చును.
తన కార్యమును నెరవేర్చుకొనుటకే
అతి వినయమును ప్రదర్శింపవచ్చును.
26. కొందరు దుర్మార్గులు దుఃఖాక్రాంతులవలె
వంగి నడుతురు.
కాని లోలోపల వంచకులై ఉందురు.
27. అి్టవారు మొగము ప్రక్కకు త్రిప్పుకొని
నీ మాటలు విననట్లే నింతురు.
కాని నీవు ఊహింపని గడియలో వచ్చి
నీ మీద పడెదరు.
28. ప్రస్తుతము చెడుకు పాల్పడకున్నను, అవకాశము దొరికినపుడు దుష్కార్యములు చేసితీరుదురు.
29. నరుని ఆకారమును బ్టియే
అతడ్టెివాడో చెప్పవచ్చును.
మొదిసారి చూచినప్పుడే
అతని తెలివిని అంచనా వేయవచ్చును.
30. నరుని బట్టలు, నవ్వు, నడక అతని శీలమును ప్టియిచ్చును.