మౌనము – సంభాషణము

20 1.     తగని సమయమున మందలించుట

                              అనునది కలదు.

                              ఉచితముగాని సమయమున

                              మౌనముగా నుండుటయేమేలు.

2.           కోపముతో మండిపడుటకంటే 

               మందలించుటయే మెరుగు.

3.           తన తప్పునొప్పుకొనువాడు

               శిక్షను తప్పించుకొనును.

4.           బలవంతముగా తన వాదమును

               నెగ్గించుకోజూచుట

               నపుంసకుడు యువతిని చెరుపగోరినట్లేయగును

5.           కొందరు మితముగా మాటలాడుటచే 

               జ్ఞానులని అనబడుదురు.

               కొందరు అమితముగా మ్లాడుటచే

               చెడ్డపేరు తెచ్చుకొందురు.

6.           ఏమి మ్లాడవలెనో తెలియక

               కొందరు మౌనముగానుందురు.

               ఎప్పుడు మ్లాడవలెనో తెలిసి

               కొందరు మౌనము వహింతురు.

7.            జ్ఞాని తగిన  సమయము లభించువరకు

               మౌనముగా నుండును. 

               కాని గొప్పలు చెప్పుకొను మూర్ఖునకు

               ఉచితసమయము తెలియదు.

8.           అమితముగా ప్రేలెడు వానిని

               జనులు అసహ్యించుకొందురు.

               మ్లాడుటకు తమకు అవకాశమీయని వానిని

               నరులు అసహ్యించెదరు.

విపరీత పరిస్థితులు

9.           ఒక్కొక్కసారి దురదృష్టము వలన లాభమును,

               అదృష్టము వలన నష్టమును కలుగును.

10.         కొన్నిసార్లు ఉదారముగా ఇచ్చుటవలన

               లాభము కలుగదు.

               కొన్నిసార్లు మాత్రము రెండింతలుగా

               ఫలితము కల్గును.

11.           కొందరు గౌరవము పొందుటవలననే

               హీనులగుదురు.

               కొందరు హీనథ నుండియు

               గౌరవపదమును చేరుకొందురు.

12.          ఒక్కొక్కసారి కొద్దిసొమ్మునకే చాలవస్తువులు

               వచ్చినట్లు కన్పించును,

               కాని కడన ఆ వ్యాపారమున

               రెండురెట్లు నష్టముకలుగును.

13.          జ్ఞాని వివేకముతో మ్లాడి

               నరుల మన్నన పొందును.

               మూర్ఖుడు ఎల్లరిని మెచ్చుకొనిన 

               ఏ  ఫలితమూ  పొందడు.

14.          మూర్ఖునినుండి బహుమతి పొందుటవలన

               లాభములేదు.

               అతడు గ్రహీతనుండి

               ప్రతిఫలము ఎక్కువగనే ఆశించును.

15.          అతడు తక్కువఇచ్చి ఎక్కువగా విమర్శించును.

               వార్తావహునివలె పెద్ద గొంతు చేసికొని

               అరచును.

               ఈనాడు ఏదైనా ఇచ్చినచో

               రేపు దానిని తిరిగి ఇచ్చివేయుమనును.

               అతడు వ్టి నీచుడు.

16.          అటుపిమ్మట ఆ మూర్ఖుడు

               ”నేననిన ఎవరికి ఇష్టము లేదు,      

               నేను చేసిన సత్క్యార్యములనెవరు మెచ్చుకొనుటలేదు

               నా ఉప్పు తిన్నవారే నా చాటున

               నన్ను తూలనాడుచున్నారు” అని వాపోవును.

17.          అి్ట వానినెల్లరును నిరతము గేలిచేయుదురు.

అనుచిత సంభాషణలు-కల్లలాడుట

18.          రాళ్ళు పరచిన నేలమీద జారిపడుటకంటె

               నోరుజారుట ఎక్కువ హానికరము.

               ఆ రీతిననే దుష్టుల పతనము

               త్వరితగతిన సంభవించును.

19.          మర్యాదనెరుగని మనుష్యుడు, 

               పామరులు మాిమాికి చెప్పుకొను

               బూతుకథ వింవాడు.

20.        మూర్ఖుడు సుభాషితము పలికినను ఎవరు వినరు

               అతడు అనుచితమైన కాలముననే దానిని బలుకును

21.          నరుడు నిరుపేదయైనను పాపము చేయడేని అంతరాత్మ అతడిని నిందింపదు.

22.        మూర్ఖుల సమక్షమున మ్లాడనొల్లనివాడు

               గౌరవమును కోల్పోవును.

23.        కాదనలేక మిత్రుని వేడుకోలును

               అంగీకరించువాడు అనవసరముగా

               అతనిని శత్రువును జేసికొనును.

24.         అబద్ధము నరుని శీలమునకు మచ్చదెచ్చును.

               అది ఎల్లప్పుడు అజ్ఞానుల పెదవులపై ఉండును.

25.        అలవాటు చొప్పున అబద్ధములాడు వానికంటె 

               దొంగ మేలు.

               కాని ఆ  ఇరువురికి  నాశనము  తప్పదు.

26.        బొంకులాడుట వలన అవమానము కలుగును. ఆ అపకీర్తి ఏనాికిని తొలగదు.

జ్ఞానికి ఘనతయు అపాయమును కలుగును

27.         జ్ఞాని తన విజ్ఞాన వాక్యముల వలన రాణించును. తన పలుకులద్వారా

               ప్రముఖుల మన్ననలు పొందును.

28.        నేలను దున్నువానికి మంచిపంట పండును. ప్రముఖులు తమను మెప్పించినవాని

               అపరాధమును మన్నింతురు.

29.        లంచములు, బహుమతుల వలన

               జ్ఞానులును గ్రుడ్డివారగుదురు.

               అవి వారి నోికి చిక్కములై

               వానినుండి సద్విమర్శలు వెలువడనీయవు.

30.        దాచియుంచిన విజ్ఞానము

               గుప్తమైయున్న నిధివింది.               

               ఆ రెండిం వలన ప్రయోజనము లేదు. 

31.          తన విజ్ఞానమును దాచియుంచిన వానికంటే

               తన మూర్ఖత్వమును దాచియుంచినవాడు మెరుగు