సామెతలు

25 1.      మూడు కార్యములు నాకు ఇష్టము.

                              దేవునికిని నరులకుగూడ

                              ఇవి ప్రీతి కలిగించును.

                              సోదరులు ఐకమత్యముగా జీవించుటయు,

                              ఇరుగుపొరుగువారు

                              స్నేహముగా జీవించుటయు,

                              భార్యాభర్తలు పొందికగా జీవించుటయు.

2.           క్రింది మూడు రకముల మనుష్యులనిన

               నాకు గిట్టరు.

               వారి పోకడలను

               నేనెంతమాత్రమును సహింపజాలను

               గర్వాత్ముడైన దరిద్రుడును,

               అబద్ధములాడు ధనికుడును,

               వ్యభిచారము చేయు మూర్ఖవృద్ధుడును.

వృద్ధులు

3.           నీవు బాలుడవుగా ఉన్నప్పుడు విజ్ఞానమును

               గణింపవేని వృద్ధుడవైనపుడు జ్ఞానివి కాజాలవు.

4.           చక్కగా ఆలోచించుట వృద్ధులకు చెల్లును.

               మంచిసలహా ఇచ్చుట వృద్ధులకు తగును.

5.           వృద్ధులకు జ్ఞానము తగును. 

               పెద్ద వారికి మంచి ఆలోచన చెప్పుట తగును.

6.           పండిన అనుభవమే వృద్ధులకు కిరీటము.

               దైవభీతియే వారికి అనంతకీర్తి.

సంఖ్యాత్మక సూక్తులు

7.            తొమ్మిదిరకముల నరులనెరిగి యుండుట

               నా అదృష్టము.

               పదియవ రకము మనుజునెరిగి యుండుటయు

               నా భాగ్య విశేషము.

               తన బిడ్డలను చూచి ఆనందించువాడును,

               తాను గతింపకముందే తన శత్రువుల

               పతనమును చూచినవాడును,

8.           తెలివి తేటలుగల భార్యనుబడయుట

               అను భాగ్యమునకు నోచుకొనిన భర్తయును,

               పరస్పరము తగిన దంపతులును,

               నోి దురుసుతనము వలన

               పాపము చేయనివాడును,

               తనకంటె నికృష్టుడైన వానికి సేవలు చేయనివాడును

9.           మంచిస్నేహితుని బడయుట అను

               భాగ్యమునకు నోచుకొనినవాడును,

               శ్రోతలు శ్రద్ధగా వినునట్లు మ్లాడగలవాడును,

10.         విజ్ఞానమును అర్జించిన మహానుభావుడును.

               కాని వీరందరికంటె ఘనుడు దైవభీతి కలవాడు.

11.           దైవభీతికి మించిన భాగ్యములేదు.

               దైవభయముగల నరునికి సమతుల్యుడును లేడు.

12.          దైవభీతి దైవప్రేమకు మొదిమెట్టు.

               విశ్వాసమువలన నరుడు దేవుని అంిపెట్టుకొనును

స్త్రీలు

13.          గాయములన్నింలో ప్రేమను

               భగ్నము చేయు గాయము పెద్దది.

               దుష్టత్వములన్నిలో స్త్రీ దుష్టత్వము పెద్దది.

14.          అపకారములన్నిలో

               శత్రువు చేయు అపకారము గొప్పది.

               ప్రతీకారములన్నిలో

               పగవాని ప్రతీకారము ఘోరమైనది.

15.          పాము విషమును మించిన విషము లేదు.

               పగతుని కోపమును మించిన కోపము లేదు.

16.          నేను సింహముతోను, కాలసర్పముతోను

               కలిసి వసింపగలను,

               కాని దుష్టురాలైన భార్యతో కలిసి జీవింపలేను.

17.          భార్యకు కోపము వచ్చినపుడు

               ఆమె రూపము మారిపోయి

               ఆగ్రహము చెందిన తోడేలువలె అగును.

18.          ఆమె పెనిమి పొరుగింట భోజనము చేయవలెను

               అచట అతడు నిట్టూర్పులు విడువక తప్పదు.

19.          స్త్రీ దుష్టత్వమును మించిన దుష్టత్వములేదు.

               ఆమెకు పాపికి పట్టెడు దుర్గతిపట్టునుగాక.

20.        వృద్ధునికి ఇసుకదిబ్బను ఎక్కుట ఎంత కష్టమో,

               సాధుపురుషునికి నిరతము గొణిగెడు భార్యతో

               కాపురము చేయుట అంత కష్టము.

21.          స్త్రీ సౌందర్యమునకు భ్రమసిపోవలదు.

               అతివను చూసి మతికోల్పోవలదు.

22.        స్త్రీచే పోషింపబడు పురుషుడు కోపమునకు,

               అహంకారమునకు, అవమానమునకు

               గురియగును.

23.        దుష్టురాలైన భార్యవలన భర్తకు విషాదమును,

               విచారమును, హృదయవేదనయు కలుగును.

               ధైర్యసాహసములు లేని భర్తను

               భార్య సంతోషపెట్టదు.

24.         పాపము స్త్రీతోనే ప్రారంభమైనది.

               ఆమె మూలమున మన మందరము

               చావవలసి వచ్చినది.

25.        త్టొినుండి నీిని కారనీయగూడదు.

               దుష్టురాలైన భార్యను

               నోికి వచ్చినట్లు వాగనీయకూడదు.

26.        నీ మాట విననిచో ఆమెకు విడాకులిమ్ము.