26 1. గుణవతియైన భార్యను బడసినవాడు
ధన్యుడు.
ఆమె మూలమున అతని ఆయుష్షు
రెండు రెట్లు పెరుగును.
2. సద్బుద్ధికల భార్య
భర్తకు పరమానందము కలిగించును.
అతడు శాంతిసమాధానములతో
జీవితమును గడపును.
3. మంచి ఇల్లాలు శ్రేష్ఠమైన వరము వింది.
దైవభీతి కలవారికేగాని ఆ వరము లభింపదు.
4. అి్టవారు ధనికులైనను, దరిద్రులైనను
సంతసముతో జీవింతురు.
వారి ముఖములు ఎల్లవేళల
ఆనందముతో నిండియుండును.
5. మూడు సంగతులనిన నాకు భయము.
నాలుగవదనిన నా గుండె దడదడలాడును.
పుకారులు నగరమంతట ప్రాకుట,
జనులు గుమిగూడుట, నీలాపనిందలను
మూడును మృత్యువుతో సరిసమానము.
6. కాని స్త్రీని చూచి స్త్రీ అసూయపడినపుడు
మితిమీరినబాధయు, దుఃఖమును కలుగును.
ఆమె సూిపోటుమాటలు ఎల్లరిని నొప్పించును.
7. దుష్టురాలైన భార్య కుదరని కాడివలె ఉండును.
ఆమెను అదుపులో పెట్టుకొనుట
తేలును చేతబట్టుకొనుట వింది.
8. త్రాగియున్న భార్య మహాకోపమును రప్పించును.
ఆమె సిగ్గుమాలినతనమును
ఎల్లరును గమనింతురు.
9. కులటయైన స్త్రీ ధైర్యముగా కన్నెత్తి చూచును.
ఆమె వాలు చూపులను బ్టియే
ఆమె గుణమును గ్రహింపవచ్చును.
10. తలబిరుసు కుమార్తెను
ఒక కంట కనిప్టిెయుండవలెను,
లేదేని ఆమె అవకాశము చూచుకొని
కానిపనికి పాల్పడును.
11. ఆ యువతి సిగ్గుమాలిన చూపులను
గమనించు చుండుము.
ఆమె నీకు తలవంపులు తెచ్చినను ఆశ్చర్యపడవలదు
12. ఆమె దప్పికగొనిన బాటసారివలె
ఏ నీరు దొరకిన ఆ నీినే త్రాగును.
ఏ తావుననైనను, ఏ పురుషునికైనను
కాళ్ళుచాచును.
ఏ బాణమునైనను తన అమ్ములపొదిలో
ప్టిెంచుకొనును
13. యోగ్యురాలైన భార్యవలన భర్త
ఆనందము చెందును.
ఆమె సామర్థ్యమువలన అతడు బలాఢ్యుడగును.
14. మితభాషిణియైన భార్య దేవుడిచ్చిన
వరము అనవలెను.
ఆమె సంయమనమునకు వెలకట్టలేము.
15. శీలవతియైన భార్య మనోజ్ఞత అంతింతకాదు.
ఆమె సచ్ఛీలమును ఏ తక్కెడతోను తూచజాలము
16. ప్రభుని ఆకాశమున ఉదయభానుడు
ప్రకాశించినట్లే మంచి ఇల్లాలు
తాను చక్కగా తీర్చిదిద్దుకొనిన ఇంట
వెలుగొందుచుండును.
17. పవిత్ర దీపస్తంభముమీద దీపము వెలిగినట్లే, సుందరమైన తనువుమీద
ఆమె మొగము మెరయుచుండును.
18. వెండి దిమ్మెలమీద నిలిచిన బంగారుస్తంభమువలె
బలమైన మడమల మీద
ఆమె అందమైన కాళ్ళు వెలుగొందుచుండును.
191.నాయనా! యువకుడవుగా ఉన్నపుడు,
నీ ఆరోగ్యమును కాపాడుకొనుము.
అన్యకాంతలను కూడి నీ బలమును
వమ్ము జేసికొనకుము.
20. దేశమున సారవంతమైన క్షేత్రమును వెదకి
దానిలో నీ సొంత బీజములను వెదజల్లుము.
నీ మంచి విత్తనములను నీవు నమ్మవలెను.
21. అప్పుడు నీ బిడ్డలు తాము మంచి కుటుంబమున
ప్టుితిమని నమ్మి,
పెరిగి పెద్దవారై వృద్ధిలోనికి వత్తురు.
22. ఉంపుడుకత్తె ఉమ్మివలె హేయమైనది.
వ్యభిచారిణియైన భార్య తన ప్రియులకు
చావు తెచ్చును.
23. దుర్మార్గునికి అతనికి తగినట్లే
భక్తిహీనురాలైన భార్య లభించును.
దైవభీతిగల నరునికి భక్తిగల భార్య దొరకును.
24. సిగ్గుమాలిన భార్య తనకు తానే అవమానమును తెచ్చుకొనును.
కాని శీలవతియైన భార్య
తన భర్త ఎదుటకూడ సిగ్గుపడును.
25. పొగరుబోతు భార్య కుక్కతో సమానము.
గుణవతియైనసతి దేవుని గౌరవించును.
26. పెనిమిని గౌరవించు ఇల్లాలిని
ఎల్లరు వివేకవతిగానెంతురు.
కాని పొగరుబోతుతనముతో భర్తను
ధిక్కరించుదానిని ఎల్లరు దుష్టురాలిగా గణింతురు
యోగ్యురాలైన భార్యను పొందినవాడు ధన్యుడు. ఆమెవలన అతని ఆయష్షు రెండంతలు పెరుగును
27. వదరుబోతు భార్య యుద్ధారంభమున ఊదు
బాకావింది.
అి్ట భార్యను బడసినవాడు
పోరుననే జీవితమును గడుపవలెను.
విచారకరమైన సంగతులు
28. రెండు విషయములు నాకు విచారము ప్టుించును
మూడవది నాకు కోపము రప్పించును.
శూరుడు పేదవాడగుట,
బుద్ధిమంతులకు మన్నన లభింపకపోవుట,
పుణ్యపురుషుడు పాపిగా మారిపోవుట.
ఇి్ట వానికి ప్రభువు మరణశిక్ష విధించును.
వ్యాపారము
29. వర్తకుడు దుష్కార్యమును చేయకుండ నుండలేడు.
ప్రతి వ్యాపారి, పాపమునకు పాల్పడును.