27 1.      లాభము గణింపవలెనన్న

                              పేరాశతో చాలమంది పాపము చేసిరి.

                              ధనికుడు కాగోరువాడు

                              కన్నులు మూసికోవలెను.

2.           బిగించిన రెండు రాళ్ళమధ్య

               మేకు ఇరుకుకొనియున్నట్లే 

               క్రయవిక్రయముల    నడుమ 

               అన్యాయము దాగుకొనియుండును.

3.           నరుడు దైవభీతికి లొంగడేని,

               వానిఇల్లు వానిమీదనే కూలిపడును.

సంభాషణములు

4.           ఊపిన జల్లెడలో మ్టిపెళ్ళలు మిగులునట్లే 

               నరుని సంభాషణమున దోషములు కన్పించును.

5.           కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము.

               అట్లే నరునికి పరీక్ష అతడి సంవాదము.

6.           చెట్టు కాపును బ్టి దానికెంత

               పరామరిక జరిగినదో ఊహింపవచ్చును.

               అట్లే నరుని మాటల తీరునుబ్టి

               అతడి శీలమును గుర్తింపవచ్చును.

7.            నరుని సంభాషణమే అతనికి పరీక్ష.

               కనుక ఏ నరునిగాని అతడు మ్లాడకముందు

               స్తుతింపవలదు.

ధర్మము

8.           నీవు ధర్మమును సాధింపగోరెదవేని

               సాధింపవచ్చును.

               దానిని సుందరమైన వస్త్రమునువలె

               ధరింపవచ్చునుగూడ.

9.           పకక్షులు తమ జాతి పకక్షులతో కలియును.

               అట్లే ధర్మమును ధర్మాత్మునితో కలియును.

10.         సింహము ఎరకొరకు పొంచియున్నట్లే

               పాపము దుష్కార్యములు చేయువారి కొరకు

               పొంచియుండును. 

11.           సత్పురుషుని  సంభాషణము పొందికగానుండును

               కాని మూర్ఖుని మాటలు చంద్రబింబమువలె

               మాిమాికి మారుచుండును.

12.          మూర్ఖులు తటస్థ పడినపుడు ఏదో ఒక నెపముతో

               తప్పించుకొని వెళ్లిపొమ్ము.

               జ్ఞానులు తటస్థపడినపుడు

               దీర్ఘకాలము నిలువుము.

13. మూర్ఖుల సంభాషణము రోతప్టుించును.

               వారు తమ దుష్కార్యములను గూర్చి

               పెద్దగా నవ్వుచు మాటలాడుదురు.

14.          వారి శాపవచనములు వినినచో

               ఒడలు గగుర్పొడుచును.

               వారి కలహవాక్యములు వినినచో

               చెవులు మూసికోగోరుదుము.

15.          గర్వాత్ముల కలహ ములు హత్యకు దారితీయును.

               వారి దూషణ భాషణములను

               మన చెవులు వినజాలవు.

రహస్యములు

16.          రహస్యములను వెలిబుచ్చువాడు

               నమ్మదగనివాడు.

               అతనికి ఆప్తమిత్రులు దొరకరు.

17.          నీ స్నేహితుని ప్రేమించి 

               విశ్వసనీయునిగా మెలగుము

               అతని రహస్యములను వెల్లడిజేసెదవేని,      ఇక అతనిని వదులు కోవలసినదే.

18.          నరుడు తన శత్రువును నాశనము చేసినట్లే

               నీవును రహస్య ప్రకాశనము ద్వారా

               నీ స్నేహమును నాశనము చేసికొింవి.

19.          నీ చేతిలోని పక్షి జారిపోయినట్లుగానే

               నీ స్నేహితుడును తప్పించుకొనెను.

               అతడు మరల నీకు చిక్కడు.

20.        అతడు చాలదూరము వెళ్ళిపోయెను.

               కనుక అతని వెంటబడవలదు.

               ఉచ్చులలో నుండి తప్పించుకొనిన లేడివలె

               అతడు పారిపోయెను.

21.          గాయమునకు కట్టు కట్టవచ్చును,

               అపరాధమును మన్నింపవచ్చును,

               కాని రహస్యమును వెల్లడించినచో

               ఇక ఆశ వదులుకోవలసినదే.

వేషధారణము

22.        కన్ను గీటువాడు అపకారమును తలపెట్టును.

               అతడు అపకారమును చేయకమానడు.

23.        అతడు నీ ఎదుట తీయగా మ్లాడును.

               నీ పలుకులెల్ల మెచ్చుకొనును.

               కాని నీ పరోక్షమున నీ మీద నేరములు తెచ్చును.

24.         నేను అసహ్యించుకొను విషయములు

               చాల గలవుగాని ఇి్ట నరుని

               అన్నింకంటే అధికముగా ఏవగించుకొందును.

               ప్రభువు కూడా వానిని రోయును.

25.        ఎవడైనను రాతిని పైకి విసరినచో

               అది వాని తలమీదనే పడును.

               ఎవడైనను ఇతరుని క్టొినచో

               వానికే దెబ్బలు తగులును.

26.        ఎవడు త్రవ్విన గోతిలో వాడే పడును.

               ఎవడు పన్నిన ఉరులలో వాడే చిక్కుకొనును.

27.         అపకారము చేయువాడు

               అపకారమునకు గురియగును.

               ఆ అపకారమెచటనుండి వచ్చినదో

               అతడికి తెలియదు.

28.        గర్వాత్ములు ఇతరులను అవమానించి

               ఎగతాళి చేయుదురు.

               కాని ప్రతీకారము అతని మీదికి సింహము వలె

               దూకి పగతీర్చుకొనును.

29.        సత్పురుషుల పతనమునకు సంతసించువారు

               ఉరులలో తగుల్కొని ఘోరబాధలతో చత్తురు.

పగ

30.        పగ, కోపము అనునవి ఘోరమైనవి.

               పాపి ఈ రెండింకి వశుడగును.