పిల్లల పెంపకము
30 1. ప్రేమగల తండ్రి తన కుమారుని
తరచుగా శిక్షించును.
సుశికక్షుతుడైన పుత్రుడు
పెరిగిపెద్దవాడైనపుడు
తండ్రిని సంతోషపెట్టును.
2. కుమారుని క్రమశిక్షణమునకు గురిచేసిన తండ్రి
ఫలితము బడయును.
అతడు ఆ పుత్రునిగూర్చి
తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు.
3. కుమారునికి విద్య గరపిన తండ్రి,
తన శత్రువులకు అసూయ ప్టుించును.
అతడు ఆ పుత్రుని తలచుకొనుచు మిత్రుల మధ్య
సగర్వముగా తిరుగును.
4. తండ్రి చనిపోయినను చనిపోయినట్లుకాదు.
అతని ప్రతిబింబమైన కుమారుడు
మిగిలియున్నాడు కదా!
5. తండ్రి బ్రతికియున్నప్పుడు పుత్రుని చూచి
ఆనందించును.
చనిపోవునపుడు నిశ్చింతగా చనిపోవును.
6. అతడు దాిపోయిన తరువాత కుమారుడు
తండ్రి విరోధులమీద పగతీర్చుకొనును.
తండ్రి మిత్రులు తండ్రికి జేసిన
ఉపకారమునకుగాను వారికి కృతజ్ఞుడై ఉండును.
7. కాని పుత్రుని చెడగొట్టు తండ్రి
వాని గాయములకు కట్టుకట్టును.
వాడు ఏడ్చినప్పుడెల్ల అతని హృదయము కరుగును
8. చక్కగా తర్ఫీదునీయని గుఱ్ఱము మొండిదగును. అదుపు మీరిన కుమారునికి పొగరెక్కును.
9. గోముగా పెరిగినబిడ్డడు కడన తండ్రికి
నిరాశను కలిగించును.
తండ్రి పుత్రునితో ఆడిపాడెనేని,
తరువాత అతనికి దుఃఖము తప్పదు.
10. ఇప్పుడు నీ బిడ్డతో కలిసి ఆనందింతువేని
తరువాత అతని గూర్చి చింతింపవలసి వచ్చును.
విచారముతో పెదవి గరచుకోవలసి వచ్చును.
11. బాల్యమున బిడ్డనకు స్వేచ్ఛనీయరాదు.
అతని తప్పిదములకు దండన విధించి
తీరవలయును.
12. బాలుడుగా ఉన్నప్పుడే వానిని శిక్షింపుము.
చిన్నవాడుగానున్నప్పుడే వాని ఎముకలు
విరుగగొట్టుము.
లేదేని వాడు పొగరుబోతు తనముతో
నీకు ఎదురు తిరుగును. నీ మనసును కష్టపెట్టును.
13. కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణనిమ్ము. లేదేని వాడు నీకు అపకీర్తిని తెచ్చును.
ఆరోగ్యము
14. ధనికుడై రోగాలగొట్టుగా ఉండుటకంటె,
దరిద్రుడై ఆరోగ్యముగాను,
బలముగాను ఉండుట మేలు.
15. ఆరోగ్యము, బలము
బంగారముకంటెను మెరుగు.
దృఢమైన శరీరము
అనంత సంపదలకంటెను మిన్న.
16. దేహారోగ్యమును మించిన సంపదలేదు.
సంతోషచిత్తమును మించిన సంబరము లేదు.
17. నికృష్టజీవనము కంటెను మరణము మేలు.
దీర్ఘకాలవ్యాధికంటెను, చచ్చి శాశ్వతముగా
విశ్రాంతిచెందుట మెరుగు.
18. వ్యాధి వలన భుజింపలేని వానికి,
విశిష్టాన్నము వలన ప్రయోజనములేదు.
సమాధిమీద భోజనము ప్టిెన లాభమేమి?
19. విగ్రహమునకు బలినర్పించిన ఏమి ఫలితము?
అది భోజనమును తినలేదు, వాసనచూడలేదు.
ప్రభువుచే వ్యాధితో శిక్షింపబడువాని
గతియునంతియే.
20. అతడు యువతిని కౌగిలోనికి తీసికొనిన
నపుంసకుని వలె
తన ఎదుటనున్న భోజనమును చూచి
నిట్టూర్పు విడుచును.
సంతోషము, దుఃఖము
21. నీవు దుఃఖమునకు గురికావలదు.
బుద్ధిపూర్వకముగా విషాదమునకు లోను కావలదు
22. ఆనందమువలన జీవితము సార్థకమగును.
సంతోషమువలన దీర్ఘాయువు కలుగును.
23. కావున సుఖములను అనుభవించుచు
సంతసింపుము.
విచారమును పారద్రోలుము.
విచారమువలన చాలమంది నశించిరి.
దానివలన ఎవరికిని మేలు కలుగదు.
24. విచారమువలన నరుడు
ప్రాయము రాకమునుపే ముసలివాడగును.
అసూయ, కోపము ఆయుష్షును తగ్గించును.
25. సంతోషచిత్తుడైన నరునికి ఆకలి బాగుగా వేయును
అతడు తృప్తిగా భుజించగలుగును.